Telangana

News August 25, 2024

రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి మంత్రి పొంగులేటి

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో సోమవారం మంత్రి పొంగులేటి పర్యటించనున్నట్లు మంత్రి పీఏ తెలిపారు. ముందుగా ఆయన పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారన్నారు. అనంతరం ఖమ్మం నగరంలో నిర్వహించే పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. తదనంతరం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో గీత కార్మికులకు కాటమయ్య సేఫ్టీ కిట్లను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.

News August 25, 2024

నిర్మల్: తండ్రి మరణం తట్టుకోలేక కొడుకు మృతి

image

తండ్రి మరణం తట్టుకోలేక కొడుకు మృతి చెందిన ఘటన నిర్మల్‌లో చోటుచేసుకుంది. ఆస్రా కాలనీకి చెందిన జుహార్ అలీ ఖాన్(74) ఆదివారం ఉదయం అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. తండ్రి మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆవీద్ అలీఖాన్ (52) ఏడుస్తూ గుండెపోటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గంటల వ్యవధిలోనే తండ్రీకొడుకులిద్దరూ మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

News August 25, 2024

కల్వకుర్తి బస్టాండ్‌లో గుండెపోటుతో వ్యక్తి మృతి

image

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి బస్టాండ్‌లో ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు దిగుతూ కుప్పకూలాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. వంగూరు మండలం చౌదరిపల్లికి చెందిన పట్టాభి వ్యక్తిగత పనుల నిమిత్తం స్వగ్రామం నుంచి కుటుంబ సభ్యులతో కల్వకుర్తికి వచ్చాడు. బస్టాండ్‌లో బస్సు దిగుతూ గుండెపోటుతో కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టాభి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News August 25, 2024

ములుగు: డ్రైవింగ్ సీట్లోనే ప్రాణాలోదిలాడు!

image

డ్రైవింగ్ సీట్లోనే లారీ డ్రైవర్ ప్రాణాలోదిలిన ఘటన ములుగు జిల్లా వెంకటాపురం రహదారిలో జరిగింది. ఇసుక లోడు చేసుకుని వెళ్తున్న రమేశ్ గుండెపోటుతో మృతి చెందాడు. ప్రాణం పోయే క్రమంలో లారీని రోడ్డు పక్కకు ఆపి మృతి చెందాడని తోటి లారీ డ్రైవర్లు తెలిపారు. వెంకటాపురం పోలీసులకు సమాచారం అందించగా.. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 25, 2024

ఘనంగా రామయ్యకు సువర్ణ పుష్పార్చన

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం స్వామివారికి అర్చకులు సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. నిత్య కళ్యాణంలో 75 దంపతులు పాల్గొన్నారన్నారు.

News August 25, 2024

అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి: మాజీ మంత్రి

image

సూర్యపేటలోని తాళ్లగడ్డలో కొలువుదీరిన శ్రీ ఇంద్రవెళ్లి ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగ సందర్బంగా అమ్మవారిని మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలకు ఆయురారోగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి పాడి పంటలతో తులతూగాలని చల్లని ఆశీస్సులు అందజేయాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.

News August 25, 2024

సోమశిల నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణం సాగేనా!

image

జిల్లాలో ప్రవహిస్తున్న కృష్ణా నది ప్రస్తుతం నిండుకుండలా ఉంది. కృష్ణమ్మ నిశ్శబ్దం ఒడిలో ప్రకృతి జలపాతాల అందాలు, పరివాహ ప్రాంత అటవీ అందాలు కృష్ణా నదిలో లాంచీ ప్రయాణం పర్యాటకుల మదిలో మర్చిపోలేని ఓ మధుర జ్ఞాపకం. ఈ ప్రయాణానికి పర్యాటకులు ఎంతగానో ఆసక్తి చూపుతారు. పర్యాటక శాఖకు ఆదాయం కూడా జమవుతుంది. సోమశిల నుంచి శ్రీశైలం వరకు పర్యాటక శాఖ లాంచీ ప్రయాణం కొనసాగించాలని పర్యాటకులు కోరుతున్నారు.

News August 25, 2024

భువనగిరి: ఈనెల 27, 29న జిల్లాలో గవర్నర్ పర్యటన

image

భువనగిరి జిల్లాలో ఈ నెల 27, 29న రాష్ట్ర గవర్నర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతు జెండగే అధికారులను ఆదేశించారు. 29న రాష్ట్ర గవర్నర్ శ్రీ విష్ణుదేవ్ శర్మ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుంటారని, అనంతరం 29న జైన దేవాలయాన్ని, సోమేశ్వర ఆలయాన్ని, స్వర్ణగిరి ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు.

News August 25, 2024

SRSPఅప్డేట్: 31,202 క్యూసెక్కులకు పెరిగిన ఇన్ ఫ్లో

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో పెరుగుతోంది. శనివారం రాత్రి 29,443 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా ఆదివారం ఉదయం 10 గంటలకు 31,202 క్యూసెక్కులకు ఇన్ ఫ్లో పెరిగింది. ఔట్ ఫ్లోగా 3,822 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. వాటిలో కాకతీయ కెనాల్‌కు 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80 TMCలకు గాను ప్రస్తుతం 53.620 TMCల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

News August 25, 2024

ఖమ్మం: శ్రావణమాసం ఎఫెక్ట్.. తగ్గిన చికెన్ అమ్మకాలు

image

శ్రావణమాసం, విష జ్వరాలతో చికెన్ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. దీంతో కోళ్ల పరిశ్రమ ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజుకు 2.8 లక్షల కిలోల చికెన్ వినియోగం జరిగేదని, ప్రస్తుతం అది సగానికి పరిమితం అయ్యిందని వ్యాపారస్థులు వాపోయారు. అమ్మకాలు తగ్గడంతో ధరలు పడిపోయాయని అంటున్నారు. కిలో బాయిలర్ చికెన్ ధర రూ.350 నుంచి రూ.170కి, రూ.150 పలికిన లైవ్ ధర రూ.100కి పడిపోయింది.