Telangana

News August 25, 2024

HYD: భరోసా సెంటర్లతో చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణం: DG

image

HYD నగరంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న దివ్యాంగులు, చిన్నారి బాధితులకు సంబంధించి జరిగిన స్టేట్ లెవెల్ సమావేశంలో CID డైరెక్టర్ షికాగోయల్ పాల్గొన్నారు. డైరెక్టర్ మాట్లాడుతూ..పోలీస్ స్టేషన్లలో భరోసా సెంటర్ల ఏర్పాటు ద్వారా చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడి, మంచి ప్రభావం చూపినట్లుగా పేర్కొన్నారు. భద్రత పై ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గే పరిస్థితి ఉండదన్నారు.

News August 25, 2024

HYD: భరోసా సెంటర్లతో చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణం: DG

image

HYD నగరంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న దివ్యాంగులు, చిన్నారి బాధితులకు సంబంధించి జరిగిన స్టేట్ లెవెల్ సమావేశంలో CID డైరెక్టర్ షికాగోయల్ పాల్గొన్నారు. డైరెక్టర్ మాట్లాడుతూ..పోలీస్ స్టేషన్లలో భరోసా సెంటర్ల ఏర్పాటు ద్వారా చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడి, మంచి ప్రభావం చూపినట్లుగా పేర్కొన్నారు. భద్రత పై ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గే పరిస్థితి ఉండదన్నారు.

News August 25, 2024

భద్రాద్రి రామాలయంలో భక్తుల సందడి

image

ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివచ్చారు. అర్చకులు ఉదయం స్వామివారికి అభిషేకం, అర్చన, ఆరాధన, పుణ్యవచనం, సేవాకాలం తదితర పూజలు గావించారు భక్తులు క్యూలైన్‌లో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రాక సందర్భంగా రామాలయం ప్రాంగణం సందడిగా కనిపించింది.

News August 25, 2024

నల్గొండ: ప్రైవేట్ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు

image

నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. బస్సు జగిత్యాల నుంచి దర్శి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 25, 2024

సిద్దిపేట: ఇలాంటి విషయాల్లో జాగ్రత్త..!

image

అతని వయస్సు పాతికేళ్లు. పెళ్లై ఇద్దరు పిల్లలు. పెడదారి పట్టి చివరకు చనిపోయాడు. శ్రీకాళహస్తి సీఐ గోపి వివరాల మేరకు.. తెలంగాణ(S) సిద్దిపేట(D) గజ్వేల్‌‌కు చెందిన శివ(26) పెయింటర్‌. ఆరేళ్ల క్రితం వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీకాళహస్తి మహిళతో వివాహేతర సంబంధం ఉండటంతో 2 రోజుల క్రితం ఇక్కడకు వచ్చాడు. ఆమె మందలించగా.. బెదిరించేందుకు పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.

News August 25, 2024

పెద్దపల్లి: జ్వరంతో యువకుడి మృతి

image

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో విషాదం నెలకొంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన నేరెళ్ల ప్రశాంత్ (26) 10 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో అతడిని కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి శనివారం తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. కాగా ఏడాది కిందట ప్రశాంత్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రశాంత్ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News August 25, 2024

ఖమ్మం: GREAT.. ఈ అబ్బాయికి రూ.కోటి స్కాలర్‌షిప్

image

ఖమ్మం జిల్లాకి చెందిన కొక్కిరేణి సాకేత్‌ సాగర్‌ ఏకంగా 4 అమెరికా విశ్వవిద్యాలయాలకు ఎంపికై అట్లాంటలోని జార్జియా యూనివర్సిటీలో రూ.కోటి స్కాలర్‌షిప్ సాధించాడు. తనకు ఇష్టమైన కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ చదివేందుకు ఈనెల 19న వెళ్లారు. అయితే అక్కడి యూనివర్సిటీలో నిర్వహించే పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిస్తే నిర్వాహకులే స్కాలర్‌షిప్‌లు ఇచ్చి ఉచితంగా చదువు చెబుతారు. అటువంటి అవకాశాన్ని సంపాదించుకున్నాడు.

News August 25, 2024

‘హైడ్రా’ లాగా.. వరంగల్‌లో ‘వాడ్రా ‘!

image

వరంగల్‌లో ‘ వాడ్రా’ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే HYDలో చెరువుల రక్షణ కోసం అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝులిపిస్తోంది. అదే తరహాలో WGLలో వాడ్రా ఏర్పాటును ప్రజలు కోరుతున్నారు. ఇటీవల MLA రాజేందర్ రెడ్డి సైతం వాడ్రా ఏర్పాటుపై యోచిస్తున్నట్లు చెప్పారు. 2020లో WGLలో అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి.అలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News August 25, 2024

నల్గొండలో విచ్చలవిడిగా నీటి వ్యాపారం

image

NLG మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు కొన్నేళ్ల నుంచి తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. డబ్బులు పెట్టి నీరు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. నల్గొండలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు దాదాపు వందకు పైగానే ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క ప్లాంట్‌కూ అనుమతులు లేవు. మున్సిపాలిటీ పరిధిలో 5 లక్షకు పైగా జనాభా ఉన్నా.. ఇప్పటికీ అనేక వార్డుల్లో పరిశుభ్రమైన నీరు సరఫరా జరగడం లేదు. తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

News August 25, 2024

సదాశివనగర్: విష జ్వరంతో బాలిక మృతి

image

సదాశివనగర్ మండలం భూంపల్లికి చెందిన మాన్యశ్రీ(12) విష జ్వరంతో శనివారం మృతి చెందినట్లు మండల ప్రాథమిక కేంద్రం వైద్యురాలు అస్మా తెలిపారు. బాలిక రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడటంతో కామారెడ్డికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు కుటుంబీకులు వెల్లడించారు. గ్రామంలో వరుసగా ఇద్దరు విషజ్వరాలతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తుందన్నారు.