Telangana

News August 25, 2024

పెద్దపల్లి: జ్వరంతో యువకుడి మృతి

image

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో విషాదం నెలకొంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన నేరెళ్ల ప్రశాంత్ (26) 10 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో అతడిని కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి శనివారం తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. కాగా ఏడాది కిందట ప్రశాంత్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రశాంత్ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News August 25, 2024

ఖమ్మం: GREAT.. ఈ అబ్బాయికి రూ.కోటి స్కాలర్‌షిప్

image

ఖమ్మం జిల్లాకి చెందిన కొక్కిరేణి సాకేత్‌ సాగర్‌ ఏకంగా 4 అమెరికా విశ్వవిద్యాలయాలకు ఎంపికై అట్లాంటలోని జార్జియా యూనివర్సిటీలో రూ.కోటి స్కాలర్‌షిప్ సాధించాడు. తనకు ఇష్టమైన కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ చదివేందుకు ఈనెల 19న వెళ్లారు. అయితే అక్కడి యూనివర్సిటీలో నిర్వహించే పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిస్తే నిర్వాహకులే స్కాలర్‌షిప్‌లు ఇచ్చి ఉచితంగా చదువు చెబుతారు. అటువంటి అవకాశాన్ని సంపాదించుకున్నాడు.

News August 25, 2024

‘హైడ్రా’ లాగా.. వరంగల్‌లో ‘వాడ్రా ‘!

image

వరంగల్‌లో ‘ వాడ్రా’ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే HYDలో చెరువుల రక్షణ కోసం అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝులిపిస్తోంది. అదే తరహాలో WGLలో వాడ్రా ఏర్పాటును ప్రజలు కోరుతున్నారు. ఇటీవల MLA రాజేందర్ రెడ్డి సైతం వాడ్రా ఏర్పాటుపై యోచిస్తున్నట్లు చెప్పారు. 2020లో WGLలో అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి.అలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News August 25, 2024

నల్గొండలో విచ్చలవిడిగా నీటి వ్యాపారం

image

NLG మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు కొన్నేళ్ల నుంచి తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. డబ్బులు పెట్టి నీరు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. నల్గొండలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు దాదాపు వందకు పైగానే ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క ప్లాంట్‌కూ అనుమతులు లేవు. మున్సిపాలిటీ పరిధిలో 5 లక్షకు పైగా జనాభా ఉన్నా.. ఇప్పటికీ అనేక వార్డుల్లో పరిశుభ్రమైన నీరు సరఫరా జరగడం లేదు. తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

News August 25, 2024

సదాశివనగర్: విష జ్వరంతో బాలిక మృతి

image

సదాశివనగర్ మండలం భూంపల్లికి చెందిన మాన్యశ్రీ(12) విష జ్వరంతో శనివారం మృతి చెందినట్లు మండల ప్రాథమిక కేంద్రం వైద్యురాలు అస్మా తెలిపారు. బాలిక రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడటంతో కామారెడ్డికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు కుటుంబీకులు వెల్లడించారు. గ్రామంలో వరుసగా ఇద్దరు విషజ్వరాలతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తుందన్నారు.

News August 25, 2024

రంగారెడ్డి: ROR 2024 చట్టం బిల్లుపై అవగాహన

image

ROR  చట్టం రూపకల్పనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలని ప్రభుత్వం భావించింది. ఈమేరకు శనివారం కలక్టరేట్‌లో ప్రస్తుత 2020 ROR చట్టంతో కలిగే ఇబ్బందులను తొలగించి, రైతులకు ఉపయోగకరమైన చట్టాన్ని తీసుకొచ్చేందుకు ROR  2024 చట్టం బిల్లుపై అవగాహన, అభిప్రాయసేకరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ శశాంక, అదనపుకలెక్టర్ ప్రతిమాసింగ్ తదితరులు పాల్గొన్నారు.

News August 25, 2024

MBNR:జోనల్ స్థాయి ప్రగతిచక్రం పురస్కారాలు అందుకున్నది వీళ్లే!

image

ఉమ్మడి జిల్లాకు చెందిన 9 మంది RTC ఉద్యోగులకు 2024 ప్రగతి చక్రం పురస్కారాలను మంత్రి పొన్నం ప్రభాకర్, RTC ఎండీ సజ్జనార్ ప్రదానం చేశారు. ఉత్తమ కండక్టర్లు, డ్రైవర్లు, సూపర్వైజర్లుగా ఎండీ సుల్తాన్(WNPT), MD షర్ఫుద్దీన్ (WNPT), మహాలింగం(NGKL), రవికుమార్(NGKL), శ్రీనివాసులు (కల్వకుర్తి), ఫర్జానా బేగం(కల్వకుర్తి), నిర్మల (NGKL), వెంకటస్వామి(కొల్లాపూర్), నాగరాజు ప్రశంసాపత్రాలు అందుకున్నారు.

News August 25, 2024

పరకాల వాసికి అమేజింగ్‌ ఇండియన్స్‌ అవార్డు

image

పరకాల మున్సిపాలిటీ రాజుపేటకు చెందిన మహిపాల్ చారి ఢిల్లీలో అమేజింగ్‌ ఇండియన్స్‌ అవార్డు-2024 స్వీకరించారు. తన కళా నైపుణ్యంతో మినీ కల్టివేటర్‌ను ఆవిష్కరించినందుకు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 2011 నుంచి ఇప్పటి వరకు పత్తి, మిర్చి పంటల సాగులో రైతులకు ఉపయోగపడే మినీ కల్టివేటర్‌, శ్రీవరి సాగు వీడర్‌, మినీ ట్రాక్టర్‌ను తయారు చేశారు. 2018లో నేషనల్‌ ఎంటర్‌ప్రెన్యుర్‌షిప్‌ అవార్డు సైతం అందుకున్నారు.

News August 25, 2024

ఖమ్మం ఈసారి సర్పంచ్ పోటికి యువత ఉత్సాహం

image

ఖమ్మం జిల్లాలో రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి చూపని యువత ధోరణిలో ప్రస్తుతం మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాజకీయాల్లోకి రావడానికి మక్కువ చూపుతున్నారు. అందుకు పంచాయతీ ఎన్నికలను అవకాశంగా మలుచుకోవాలని ఎంతో మంది యువకులు భావిస్తున్నారు. అటు రాజకీయ హోదాను అనుభవించేందుకు, అదే సమయంలో ఇటు ప్రజా సేవ చేయొచ్చన్న ఆలోచనతో చాలా మంది యువ నేతలు పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.

News August 25, 2024

HYD: వినాయకచవితికి పటిష్ట చర్యలు: సీపీ

image

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి శనివారం బంజారాహిల్స్ పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో మూడు కమిషనరేట్స్ పరిధిలోని ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు, గణేశ్ ఉత్సవ్ సమితి, ఖైరతాబాద్ ఉత్సవ్ సమితి, పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయకచవితి ఉత్సవాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టాలని పలు సూచనలు చేశారు