Telangana

News August 25, 2024

HYD: 75 ఏళ్ల వయసులో దేశభక్తి చాటుతూ.. బైక్‌ రైడ్‌

image

ఈయన పేరు శివన్‌కుట్టి.. రిటైర్డ్‌ ఆర్మీ అధికారి. వయస్సు 75 ఏళ్లు. ఈ వయస్సులోనూ సాహసోపేత బైక్‌ రైడ్‌ చేపట్టి ఈ తరం యువతకు తానేం తక్కువ కాదని నిరూపించారు. హైదరాబాద్‌ టూ లడఖ్‌.. లడఖ్‌ టూ కన్యాకుమారి, హైదరాబాద్‌ ఇలా సోలో బైక్‌ రైడ్‌తో దేశభక్తి చాటుతూ.. జాతీయ జెండాను రెపరెపలాడించారు. ఈ ఏడాది మే 26న నా యాత్ర ప్రారంభమై.. జూలై 20న ముగిసింది. 55 రోజుల్లో 8,826 కిలోమీటర్ల మేర యాత్ర చేశారు.

News August 25, 2024

HYD: వినాయకచవితికి పటిష్ట చర్యలు: సీపీ

image

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి శనివారం బంజారాహిల్స్ పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో మూడు కమిషనరేట్స్ పరిధిలోని ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు, గణేశ్ ఉత్సవ్ సమితి, ఖైరతాబాద్ ఉత్సవ్ సమితి, పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయకచవితి ఉత్సవాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని పలు సూచనలు చేశారు.

News August 25, 2024

BREAKING.. నల్గొండ: తల్లిని హత్య చేసి.. కుమారుడి సూసైడ్

image

నల్గొండ జిల్లా నిడమానూరులో విషాదం చోటుచేసుకుంది. ఓ కుమారుడు తల్లిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి సాయమ్మను కత్తితో పొడిచి అనంతరం శివ గొంతుకోసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబకలహాలతో తల్లిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

News August 25, 2024

HYD: 75 ఏళ్ల వయసులో దేశభక్తి చాటుతూ.. బైక్‌ రైడ్‌

image

ఈయన పేరు శివన్‌కుట్టి.. రిటైర్డ్‌ ఆర్మీ అధికారి. వయస్సు 75 ఏళ్లు. ఈ వయస్సులోనూ సాహసోపేత బైక్‌ రైడ్‌ చేపట్టి ఈ తరం యువతకు తానేం తక్కువ కాదని నిరూపించారు. హైదరాబాద్‌ టూ లడఖ్‌.. లడఖ్‌ టూ కన్యాకుమారి, హైదరాబాద్‌ ఇలా సోలో బైక్‌ రైడ్‌తో దేశభక్తి చాటుతూ.. జాతీయ జెండాను రెపరెపలాడించారు. ఈ ఏడాది మే 26న నా యాత్ర ప్రారంభమై.. జూలై 20న ముగిసింది. 55 రోజుల్లో 8,826 కిలోమీటర్ల మేర యాత్ర చేశారు.

News August 25, 2024

గుర్రంపోడులో గుండెపోటుతో యువతి మృతి

image

గుండెపోటుతో యువతి మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో శనివారం జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కవిత(18) రోజులాగే తల్లితో కలిసి ఆటోలో మిరపకాయలు కోయడానికి పనికి వెళ్లే క్రమంలో ఒక్కసారిగా కుప్ప కూలింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న 108 వాహన సిబ్బంది సీపీఆర్ చేసినా అప్పటికే పల్స్ పడిపోయింది. స్థానిక పీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News August 25, 2024

MBNR: నేటి నుంచి రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ టోర్నీ

image

రాష్ట్ర స్థాయి అండర్-16 యూత్ బాలబాలికల బాస్కెట్ బాల్ టోర్నీకి మహబూబ్ నగర్ ఆతిథ్యమిస్తోంది. మహబూబ్ నగర్‌లోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఆది,సోమవారాల్లో ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఉదయం, రాత్రి వేళల్లో టోర్నీలోని మ్యాచ్‌లు నిర్వహించేలా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలోని 17 జిల్లాల నుంచి 500 మంది బాలబాలికలు, అఫీషియల్స్ పాల్గొంటున్నారు. భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు.

News August 25, 2024

కరీంనగర్: రేపు మాంసం దుకాణాలు బంద్

image

ఈ నెల 26న కృష్ణాష్టమి సందర్భంగా మాంసం దుకాణాలు మూసివేయనున్నట్లు కరీంనగర్ నగరపాలక సహాయ కమిషనర్ వేణుమాధవ్ తెలిపారు. ఈ మేరకు అన్ని రకాల మాంసం దుకాణాలు బంద్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికే వ్యాపారులకు నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. ఎవరైనా మాంసం విక్రయించినట్లు తెలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News August 25, 2024

HYD: ‘క్యూలైన్ తిప్పలు వద్దు..UTS యాప్ ముద్దు’

image

HYD, RR, MDCL,VKB జిల్లాలో ఉంటున్న ప్రజలకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ‘క్యూలైన్ తిప్పలు వద్దు.. UTS యాప్ ముద్దు’ అని తెలిపారు. ఇటీవల రైల్వే స్టేషన్లలో వందల సంఖ్యలో ప్రయాణికులు క్యూలైన్లో నిలబడి టికెట్లు తీసుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా UTS మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.

News August 25, 2024

ఆదిలాబాద్: మేనల్లుడని చేరదీస్తే ఇంట్లోంచి వెల్లగొట్టాడు

image

మేనల్లుడని చేరదీస్తే తమను సొంత ఇంటి నుంచి బయటకు గెంటేశాడని ఆదిలాబాద్‌‌లోని శాంతినగర్‌కు చెందిన దేవన్న, దేవమ్మ దంపతులు వాపోయారు. తాను గతంలో మేస్త్రీ పని చేసే వాడినని, ఓ ప్రమాదంలో కాలుకోల్పోయి ఇంటికే పరిమితమయ్యానని దేవన్న పేర్కొన్నారు. దీంతో చేరదీసిన మేనల్లుడు తమను ఇంట్లోంచి వెల్లగొట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై RDOను కలిసేందుకు కలెక్టరేట్‌కు వెళ్లగా ఆయన రాకపోవడంతో వెనుదిరిగామన్నారు.