Telangana

News August 25, 2024

ఆదిలాబాద్: మేనల్లుడని చేరదీస్తే ఇంట్లోంచి వెల్లగొట్టాడు

image

మేనల్లుడని చేరదీస్తే తమను సొంత ఇంటి నుంచి బయటకు గెంటేశాడని ఆదిలాబాద్‌‌లోని శాంతినగర్‌కు చెందిన దేవన్న, దేవమ్మ దంపతులు వాపోయారు. తాను గతంలో మేస్త్రీ పని చేసే వాడినని, ఓ ప్రమాదంలో కాలుకోల్పోయి ఇంటికే పరిమితమయ్యానని దేవన్న పేర్కొన్నారు. దీంతో చేరదీసిన మేనల్లుడు తమను ఇంట్లోంచి వెల్లగొట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై RDOను కలిసేందుకు కలెక్టరేట్‌కు వెళ్లగా ఆయన రాకపోవడంతో వెనుదిరిగామన్నారు.

News August 25, 2024

HYD: ‘క్యూలైన్ తిప్పలు వద్దు..UTS యాప్ ముద్దు’

image

HYD, RR, MDCL,VKB జిల్లాలో ఉంటున్న ప్రజలకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ‘క్యూలైన్ తిప్పలు వద్దు.. UTS యాప్ ముద్దు’ అని తెలిపారు. ఇటీవల రైల్వే స్టేషన్లలో వందల సంఖ్యలో ప్రయాణికులు క్యూలైన్లో నిలబడి టికెట్లు తీసుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా UTS మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.

News August 25, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఓటర్ సర్వే
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} అశ్వాపురంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటన
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన

News August 25, 2024

కామారెడ్డి: దూర విద్యలో దరఖాస్తులకు ఆహ్వానం

image

అంబేడ్కర్ దూరవిద్యలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపల్ విజయ్ తెలిపారు. ఇంటర్, ఓపెన్ ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ చదివిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 31 వరకు మాత్రమే దరఖాస్తుకు అవకాశం ఉందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News August 25, 2024

విద్యార్థుల నడవడికను గమనించాలి: వరంగల్ సీపీ

image

వివిధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల నడవడికను యాజమాన్యాలు గమనిస్తూ ఉండాలని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. కమిషనరేట్‌లోని డిగ్రీ, జూనియర్ కళాశాల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థల్లో గంజాయిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీపీ కోరారు. కమిషనరేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రగ్స్ కంట్రోల్ విభాగానికి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

News August 25, 2024

నల్గొండ: రుణమాఫీ కాని వారు ఫిర్యాదు చేయండి

image

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 3 విడతలుగా రుణమాఫీ చేసింది. కాగా, కొంతమంది రైతులకు మాఫీ కాలేదు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా రుణమాఫీ కాని రైతుల నుంచి ఫిర్యాదులు సేకరిస్తోంది. దీని కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మండలాల వారిగా నోడల్ అధికారులను నియమించారు. బ్యాంకు ఖాతా, పాస్‌బుక్, ఆధార్ జిరాక్స్‌తో మండల/జిల్లా నోడల్ అధికారికి అందించేలా కార్యాచరణ రూపొందించారు.

News August 25, 2024

కొత్త జీపీగా తాట్‌పల్లి

image

గ్రామ పంచాయతీ ఎన్నికలకు కసరత్తు జరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలంలో నూతనంగా తాట్‌పల్లి గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేస్తూ శనివారం గెజిట్‌ ఉత్తర్వులు జారీ చేసింది. మండలంలో ఇప్పటి వరకు 37 గ్రామ పంచాయతీలు ఉండగా తాజాగా వాటి సంఖ్య 38కి చేరి జిల్లాలోనే న్యాల్‌కల్‌ అతిపెద్ద మండలంగా అవతరించింది.

News August 25, 2024

జూరాలకు తగ్గిన వరద

image

జూరాల జలాశయంలోకి వస్తున్న వరద తగ్గింది. జలాశయంలోకి 67వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. దిగువకు 10 గేట్లు ఎత్తి 41 వేలు, జలవిద్యుదుత్పత్తి ద్వారా 37 వేలు మొత్తం 78 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. జలాశయంలో నీటి నిల్వ 9.132 టీఎంసీల మేర ఉంది. మరో నాలుగు వేల క్యూసెక్కులు జూరాల కాల్వలకు, ఎత్తిపోతల పథకాలకు వినియోగించుకున్నట్లు జూరాల అధికారులు తెలిపారు.

News August 25, 2024

అశ్వారావుపేటలో తాచుపాము కలకలం

image

కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని జంగారెడ్డిగూడెం రహదారిలో మల్లికార్జునరావు ఇంట్లో తాచుపాము కలకలం సృష్టించింది. వంట గదిలో పాము ఉండటంతో ఇంట్లో వారు భయాందోళనకు గురయ్యారు. దాదాపు రెండు గంటల పాటు అది అక్కడే ఉండటంతో స్థానికులు అటవీశాఖ FBO సురేశ్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన పాములు పట్టే వ్యక్తి ప్రదీప్‌ను పిలిపించి దానిని బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశారు.

News August 25, 2024

HYD: కల్తీ కల్లు దుకాణాలను మూసేయాలి: ఎంపీ

image

VKB జిల్లాలో కల్తీకల్లు తాగి ఒకరు మృతి చెందారని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇదిలా ఉండగా.. ఆసుపత్రిలో ఉన్న 60 మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. గత పది ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు రసాయన కల్లుకు బానిసయ్యారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రసాయన కల్తీ కల్లు దుకాణాలను మూసేయాలన్నారు.