Telangana

News August 25, 2024

కొత్త జీపీగా తాట్‌పల్లి

image

గ్రామ పంచాయతీ ఎన్నికలకు కసరత్తు జరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలంలో నూతనంగా తాట్‌పల్లి గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేస్తూ శనివారం గెజిట్‌ ఉత్తర్వులు జారీ చేసింది. మండలంలో ఇప్పటి వరకు 37 గ్రామ పంచాయతీలు ఉండగా తాజాగా వాటి సంఖ్య 38కి చేరి జిల్లాలోనే న్యాల్‌కల్‌ అతిపెద్ద మండలంగా అవతరించింది.

News August 25, 2024

జూరాలకు తగ్గిన వరద

image

జూరాల జలాశయంలోకి వస్తున్న వరద తగ్గింది. జలాశయంలోకి 67వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. దిగువకు 10 గేట్లు ఎత్తి 41 వేలు, జలవిద్యుదుత్పత్తి ద్వారా 37 వేలు మొత్తం 78 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. జలాశయంలో నీటి నిల్వ 9.132 టీఎంసీల మేర ఉంది. మరో నాలుగు వేల క్యూసెక్కులు జూరాల కాల్వలకు, ఎత్తిపోతల పథకాలకు వినియోగించుకున్నట్లు జూరాల అధికారులు తెలిపారు.

News August 25, 2024

అశ్వారావుపేటలో తాచుపాము కలకలం

image

కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని జంగారెడ్డిగూడెం రహదారిలో మల్లికార్జునరావు ఇంట్లో తాచుపాము కలకలం సృష్టించింది. వంట గదిలో పాము ఉండటంతో ఇంట్లో వారు భయాందోళనకు గురయ్యారు. దాదాపు రెండు గంటల పాటు అది అక్కడే ఉండటంతో స్థానికులు అటవీశాఖ FBO సురేశ్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన పాములు పట్టే వ్యక్తి ప్రదీప్‌ను పిలిపించి దానిని బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశారు.

News August 25, 2024

HYD: కల్తీ కల్లు దుకాణాలను మూసేయాలి: ఎంపీ

image

VKB జిల్లాలో కల్తీకల్లు తాగి ఒకరు మృతి చెందారని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇదిలా ఉండగా.. ఆసుపత్రిలో ఉన్న 60 మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. గత పది ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు రసాయన కల్లుకు బానిసయ్యారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రసాయన కల్తీ కల్లు దుకాణాలను మూసేయాలన్నారు.

News August 25, 2024

వరంగల్ మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలి: మంత్రి పొంగులేటి

image

వరంగల్ నగరాన్ని మరో నగరంగా తీర్చిదిద్దడానికి మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం డా.బీఆర్ అంబేడ్కరర్ సచివాలయంలోని తన కార్యాలయ సమావేశ మందిరంలో ‘కూడా’ అధికారులు, పలుశాఖల అధికారులతో వరంగల్ నగర అభివృద్ధిపై సమీక్షంచారు.

News August 25, 2024

KNR: రైతులకు మేలు చేయడానికే నూతన రెవెన్యూ చట్టం: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయడానికే నూతన రెవెన్యూ చట్టం -2024 ను పటిష్టంగా రూపొందిస్తుందని అని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో రెవెన్యూ చట్టం -2024ముసాయిదా చర్చా వేదిక కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. కొత్త ఆర్‌ఓఆర్‌ చట్టంపై సలహాలు, సూచనల స్వీకరణలో భాగంగా ఆయా వర్గాల ప్రతినిధులు వారి అభిప్రాయాలు వెల్లడించారు.

News August 25, 2024

NZB: సభ్యత్వ నమోదు విజయవంతం ఎంతో కీలకం

image

బీజేపీ పార్టీ పోలింగ్ బూత్ స్థాయి నుండి మరింత బలపడాలి అంటే సభ్యత్వ నమోదు విజయవంతం ఎంతో కీలకమని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. శనివారం జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యశాలలో ఆయన మాట్లాడుతూ పార్టీ సంస్థ గత నిర్మాణంలో భాగంగా సెప్టెంబరు 1 నుంచి సభ్యత్వ నమోదు ప్రారంభం అవుతుందన్నారు. ప్రతి పోలింగ్ బూత్ నుండి ఖచ్చితంగా 200 సభ్యత్వం చేయాలని సూచించారు.

News August 25, 2024

MBNR: ‘సాధికార కమిటీ ఏర్పాటు’

image

కోర్టు ద్వారా బైల్ పొంది సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించలేని నిరుపేద ఖైదీలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం రాష్ట్ర, జిల్లాస్థాయి సాధికార కమిటీలను ఏర్పాటు చేసిందని MBNR జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. ఇవాళ మొదటిసారి జిల్లా సాధికార కమిటీ నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లా సాధికార కమిటీ నోడల్ అధికారిగా ప్రొహిబిషన్ అధికారిని నియమించాలని తీర్మానించినట్లు తెలిపారు.

News August 25, 2024

ADB: ఆర్టీసి ఉత్తమ ఉద్యోగులకు ప్రగతి చక్రం పురస్కారాలు అందజేత

image

ఆదిలాబాద్ ఆర్టీసీ కార్గో విభాగంలో విధులు నిర్వహిస్తున్న షేక్ అబ్దుల్ ఆన్సర్ ఉత్తమ ఉద్యోగిగా ఎంపికయ్యారు. అదేవిధంగా ఉత్తమ డ్రైవర్‌గా అదిలాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన మహమ్మద్ ఎంపికయ్యారు. ఇందులో భాగంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వీరికి ప్రగతి చక్రం పురస్కారాలను అందజేసి ఘనంగా సత్కరించారు.

News August 24, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!

image

✔మల్లికార్జున ఖర్గేను కలిసిన మంత్రి జూపల్లి ✔NGKL:వనపట్ల సమీపంలో కారు బోల్తా ✔జూరాల ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత ✔అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశాలకు చివరి తేదీ 31 ✔బాల పురస్కార్ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం ✔MROకు రెవెన్యూ రికవరీ యాక్ట్ పై అవగాహన ✔WNPT:కలెక్టరేట్ ముందు రైస్ మిల్లర్ల ఆందోళన ✔భూ సమస్యల పరిష్కారానికి నూతన ఆర్ఓఆర్ చట్టం: చిన్నారెడ్డి