Telangana

News August 24, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో నవ వధువు ఆత్మహత్య
> అదనపు, జోనల్ కమిషనర్లతో GHMC కమీషనర్ ఆమ్రపాలి టెలీ కాన్ఫరెన్స్
> రామంతపూర్‌లో భవనంపై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య
> బోయిన్‌పల్లిలి వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ అనుదీప్
> కేటీఆర్‌కు రాఖీలు కట్టిన మహిళా కమిషన్ సభ్యులు
> ఆర్టీసీ కళా భవన్‌లో ప్ర‌గ‌తి చ‌క్ర అవార్డుల ప్ర‌దానోత్స‌వం
> PIB ఏడీజీ శ్రుతి పాటిల్‌తో గవర్నర్ సమావేశం

News August 24, 2024

RR:ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉంది:జానీ
✓HYD:ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ దానం అంతంతే!
✓తార్నాక: ఆర్టీసీ బాధితులకు రూ.1.15 కోట్ల చెక్కు
✓HYD: ట్రాఫిక్ ఉల్లంఘన పై 28% పెరిగిన జరిమాణాలు
✓డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుపడ్డ వారికి 2 రోజులు ట్రాఫిక్ డ్యూటీ
✓జగద్గిరిగుట్ట: నవ వధువు మనిషా ఆత్మహత్య
✓ఉప్పల్: మూడో ఫ్లోర్ నుంచి దూకి యువకుడు ఆత్మహత్య

News August 24, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో టాప్ న్యూస్..

image

> MLG: వయనాడ్ బాధితులకు అండగా ఉంటాం: సీతక్క
> MHBD: గుంజేడులో అరుదైన ఉడుత
> WGL: మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలి: మంత్రి పొంగులేటి
> BHPL: జిల్లా వ్యాప్తంగా ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలు
> HNK: విద్యార్థులు లక్ష్యం వైపు అడుగులు వేయాలి: సీపీ
> JN: అవినీతికి ఆస్కారం లేకుండా అభివృద్ది చేస్తా: కడియం
> MLG: లక్నవరంలో గవర్నర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

News August 24, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ వేములవాడ ప్రభుత్వాసుపత్రిలో 24 గంటలలో 17 శస్త్ర చికిత్సలు. @ గొల్లపల్లి మండలంలో ఆర్దిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య. @ ఉత్తమ కండక్టర్ అవార్డు అందుకున్న వేములవాడ డిపో మహిళా కండక్టర్. @ గొల్లపల్లి మండలంలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. @ పెగడపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జగిత్యాల ఎస్పీ. @ ఉమ్మడి కరీంనగర్ లో పలుచోట్ల ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు.

News August 24, 2024

HYD: ఇక 40 ఏళ్ల వరకు డోకా లేదు: కేంద్ర మంత్రి

image

HYD నగరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధిపై రైల్వే సహాయక మంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టు మీడియాతో మాట్లాడారు. పునరాభివృద్ధి అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తే, 40 ఏళ్ల వరకు ఎలాంటి డోకా ఉండదన్నారు. రాబోయే 40 ఏళ్ల ప్రయాణికుల సామర్థ్యాన్ని అంచనా వేసి, డిజైన్ చేసి పనులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాంలో GM అరుణ్ కుమార్ జైన్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News August 24, 2024

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేటి ముఖ్యంశాలు..

image

* సిర్నాపల్లిలో అంత్యక్రియలో వెళ్లి మృతి చెందిన యువకుడు* పిట్లంలో 3 ఇసుక టిప్పర్లు పట్టివేత* బాన్సువాడ పట్టణంలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి* ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు* ఆర్మూర్ రుణమాఫీ కోసం వేల సంఖ్యలో రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న రైతులు* రైతులకు మద్దతు తెలిపిన బిఆర్ఎస్ నాయకులు.

News August 24, 2024

NLG: ప్రభుత్వ ఆసుపత్రిలో పడకలు పెంచండి సారూ.!

image

నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కుర్చీలో గర్భిణీ ప్రసవించిన ఘటనను వార్తల్లో చూసిన సామాన్య ప్రజలు ఆస్పత్రిలో ఇకనైనా మౌలిక వసతులు వెంటనే కల్పించాలని మాత శిశు సంరక్షణ కేంద్రంలోని వార్డులు, లేబర్ రూమ్‌లో పడకలు పెంచాలని కోరుతున్నారు. చిన్న పిల్లలకు జ్వరం సిరప్ 250 ఎంజీ అందుబాటులో లేవు యాంటీ బయాటిక్ సిరప్‌లు వారి వయస్సులకు తగ్గట్టుగా లేవు, బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉందని సామాన్యులు అంటున్నారు.

News August 24, 2024

HYD: ఇక 40 ఏళ్ల వరకు డోకా లేదు: కేంద్ర మంత్రి

image

HYD నగరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధిపై రైల్వే సహాయక మంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టు మీడియాతో మాట్లాడారు. పునరాభివృద్ధి అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తే, 40 ఏళ్ల వరకు ఎలాంటి డోకా ఉండదన్నారు. రాబోయే 40 ఏళ్ల ప్రయాణికుల సామర్థ్యాన్ని అంచనా వేసి, డిజైన్ చేసి పనులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాంలో GM అరుణ్ కుమార్ జైన్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News August 24, 2024

మద్దిరాల: వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యం ధ్వంసం

image

మద్దిరాల పోలీస్ స్టేషన్ పరిధిలో 26 కేసుల్లో పట్టుబడిన మద్యంను పోలీసులు శనివారం సాయంత్రం ఐదు గంటలకు ధ్వంసం చేశారు ఎక్సైజ్ శాఖ అనుమతితో మద్యంతో పాటు బీర్లను బయట పారబోసినట్లు మద్దిరాల ఎస్సై తెలిపారు. అక్రమ మద్యం రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ సూపర్డెంట్ లక్ష్మా నాయక్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ మల్లయ్య ఉన్నారు.

News August 24, 2024

నల్గొండ: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

image

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. నల్గొండ మండలంలోని చర్లపల్లి బైపాస్‌ను NAM, రోడ్డు భవనాల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే నేషనల్ హైవే, స్టేట్ హైవేలను గుర్తించి ప్రమాదాల నివారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.