Telangana

News August 24, 2024

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేటి ముఖ్యంశాలు..

image

* సిర్నాపల్లిలో అంత్యక్రియలో వెళ్లి మృతి చెందిన యువకుడు* పిట్లంలో 3 ఇసుక టిప్పర్లు పట్టివేత* బాన్సువాడ పట్టణంలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి* ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు* ఆర్మూర్ రుణమాఫీ కోసం వేల సంఖ్యలో రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న రైతులు* రైతులకు మద్దతు తెలిపిన బిఆర్ఎస్ నాయకులు.

News August 24, 2024

NLG: ప్రభుత్వ ఆసుపత్రిలో పడకలు పెంచండి సారూ.!

image

నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కుర్చీలో గర్భిణీ ప్రసవించిన ఘటనను వార్తల్లో చూసిన సామాన్య ప్రజలు ఆస్పత్రిలో ఇకనైనా మౌలిక వసతులు వెంటనే కల్పించాలని మాత శిశు సంరక్షణ కేంద్రంలోని వార్డులు, లేబర్ రూమ్‌లో పడకలు పెంచాలని కోరుతున్నారు. చిన్న పిల్లలకు జ్వరం సిరప్ 250 ఎంజీ అందుబాటులో లేవు యాంటీ బయాటిక్ సిరప్‌లు వారి వయస్సులకు తగ్గట్టుగా లేవు, బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉందని సామాన్యులు అంటున్నారు.

News August 24, 2024

HYD: ఇక 40 ఏళ్ల వరకు డోకా లేదు: కేంద్ర మంత్రి

image

HYD నగరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధిపై రైల్వే సహాయక మంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టు మీడియాతో మాట్లాడారు. పునరాభివృద్ధి అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తే, 40 ఏళ్ల వరకు ఎలాంటి డోకా ఉండదన్నారు. రాబోయే 40 ఏళ్ల ప్రయాణికుల సామర్థ్యాన్ని అంచనా వేసి, డిజైన్ చేసి పనులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాంలో GM అరుణ్ కుమార్ జైన్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News August 24, 2024

మద్దిరాల: వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యం ధ్వంసం

image

మద్దిరాల పోలీస్ స్టేషన్ పరిధిలో 26 కేసుల్లో పట్టుబడిన మద్యంను పోలీసులు శనివారం సాయంత్రం ఐదు గంటలకు ధ్వంసం చేశారు ఎక్సైజ్ శాఖ అనుమతితో మద్యంతో పాటు బీర్లను బయట పారబోసినట్లు మద్దిరాల ఎస్సై తెలిపారు. అక్రమ మద్యం రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ సూపర్డెంట్ లక్ష్మా నాయక్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ మల్లయ్య ఉన్నారు.

News August 24, 2024

నల్గొండ: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

image

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. నల్గొండ మండలంలోని చర్లపల్లి బైపాస్‌ను NAM, రోడ్డు భవనాల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే నేషనల్ హైవే, స్టేట్ హైవేలను గుర్తించి ప్రమాదాల నివారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

News August 24, 2024

KMM: రైతులకు సక్రమంగా ఎరువులు అందించాలి: మంత్రి తుమ్మల

image

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎరువుల పరిస్థితిపై అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో వానాకాలానికి అంచనా వేసిన ఎరువులు, అందుబాటులో ఉన్న ఎరువుల లభ్యతపై మంత్రికి అధికారులు వివరించారు. 10,41,000 టన్నుల యూరియా, 240 లక్షల టన్నుల DAP, 10 లక్షల టన్నుల కాంప్లెక్స్ 0.60 లక్షల టన్నుల MOP అవసరమవుతాయని అంచనా వేశారు. రైతులకు సక్రమంగా ఎరువులు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

News August 24, 2024

మల్లికార్జున ఖర్గేను కలిసిన మంత్రి జూపల్లి

image

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రాష్ట్ర టూరిజం, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. వారిరువురి మధ్య రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాల గురించి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి చర్చ జరిగినట్లు జూపల్లి మీడియోతో పేర్కొన్నారు.

News August 24, 2024

HYD: బాధితులకు రూ.1.15 కోట్ల చెక్కు అందజేత

image

ఉద్యోగులకు ఆర్టీసీ సంస్థ అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరెంట్ షాక్‌తో మరణించిన వరంగల్-2 డిపోకు చెందిన డ్రైవర్ మెరుగు సంపత్ కుటుంబ సభ్యులకు రూ.1.15 కోట్ల విలువగల ప్రమాద బీమా చెక్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం బాగ్‌లింగంపల్లిలో అందజేశారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ. సజ్జనర్, యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జోనల్ హెడ్ అరుణ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.

News August 24, 2024

ఖమ్మం: గవర్నర్‌ను కలిసిన ఎంపీ రఘురామిరెడ్డి

image

రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి శనివారం హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. తన తండ్రి, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి‌తో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా.. ఆధ్యాత్మికం, పర్యాటకంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ఇటు ఖమ్మం ఖిల్లా, దక్షిణ ఆసియాలోనే పెద్దదైన బౌద్ధ స్తూపం గురించి వివరించారు.

News August 24, 2024

గాంధారి: తాళం వేసిన ఇంట్లో చోరీ

image

తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా గాంధారిలో చోటుచేసుకుంది. ఎస్సై ఆంజనేయులు వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన పత్తి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల దగ్గరికి వెళ్లారు. శనివారం ఉదయం ఇంటికి తిరిగి రాగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని వారు గమనించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న బంగారం, నగదు చోరికి గురైనట్లు పేర్కొన్నారు.