Telangana

News August 24, 2024

లక్నవరంలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈనెల 27, 28 తేదీల్లో ములుగు జిల్లాలో పర్యటించునున్నారు. అందులో భాగంగా ఆయన లక్నవరం సరస్సు, ఐలాండ్ సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో సుందరీకరణ ఏర్పాట్ల పనులను శనివారం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పరిశీలించారు.

News August 24, 2024

ఖమ్మం: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసిన డిప్యూటీ సీఎం

image

ఖమ్మం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రితో డిప్యూటీ సీఎం చర్చించారు. అలాగే పలు అంశాలపై కేంద్రమంత్రితో డిప్యూటీ సీఎం సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని పేర్కొన్నారు.

News August 24, 2024

HYD: కాలేయ మార్పిడి కోసం ఎదురుచూపులు..!

image

HYD నగరంలోని ఉస్మానియా, గాంధీ, NIMS ఆస్పత్రుల్లో కాలేయ మార్పిడి కోసం రోగులు ఏళ్లుగా వేచి చూస్తున్నారు. లాస్ట్ స్టేజ్ సిరోసిస్ లాంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి కాలేయ మార్పిడే చివరి ఆశ. ఉస్మానియాలో కాలేయ మార్పిడి కోసం వందల మంది వేచి చూస్తున్నారు. కాలేయ మార్పిడి జరిగితే తప్ప బతకడం కష్టమని రోగుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News August 24, 2024

HYD: కాలేయ మార్పిడి కోసం ఎదురుచూపులు..!

image

HYD నగరంలోని ఉస్మానియా, గాంధీ, NIMS ఆస్పత్రుల్లో కాలేయ మార్పిడి కోసం రోగులు ఏళ్లుగా వేచి చూస్తున్నారు. లాస్ట్ స్టేజ్ సిరోసిస్ లాంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి కాలేయ మార్పిడే చివరి ఆశ. ఉస్మానియాలో కాలేయ మార్పిడి కోసం వందల మంది వేచి చూస్తున్నారు. కాలేయ మార్పిడి జరిగితే తప్ప బతకడం కష్టమని రోగుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News August 24, 2024

HYD: రూ.1.15 కోట్ల చెక్కు అందజేత

image

ఉద్యోగులకు ఆర్టీసీ సంస్థ అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరెంట్‌షాక్‌తో మ‌ర‌ణించిన వరంగ‌ల్-2 డిపోకు చెందిన డ్రైవర్ మెరుగు సంప‌త్ కుటుంబ‌స‌భ్యుల‌కు రూ.1.15 కోట్ల విలువ‌గ‌ల ప్ర‌మాద బీమా చెక్‌ను మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ శనివారం బాగ్ లింగంపల్లిలో అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ.స‌జ్జ‌న‌ర్‌, యూనియ‌న్ బ్యాంక్ డిప్యూటీ జోన‌ల్ హెడ్ అరుణ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.

News August 24, 2024

సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం

image

సూర్యాపేట జిల్లా మాధవరం గ్రామ శివారులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతున్న కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో ఆ మార్గంలో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. గాయాలైన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

News August 24, 2024

పాల్వంచ: లారీని ఢీకొన్న కారు.. పలువురికి తీవ్ర గాయాలు

image

పాల్వంచ నవభారత్ మైనింగ్ కళాశాల వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ముందు వెళ్తున్న ఓ లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న ఓ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 24, 2024

MDK: డెంగ్యూతో బాలుడి మృతి

image

చిన్నకోడూరు మండలంలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన బాలుడు కామ అయాన్స్ (5) డెంగ్యూతో మృతి చెందాడు. స్థానికుల వివరాలు… బాలుడికి గత 3 రోజుల క్రితం తీవ్ర జ్వరం రాగా తల్లిదండ్రులు సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు శనివారం మృతి చెందాడు. ఈ విషయమై డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ.. రెండు రకాల డెంగ్యూ వైరస్‌లు అటాచ్ కావడంతో మెదడుపై ఎఫెక్ట్ పడి బాలుడు మృతి చెందాడని వివరించారు.

News August 24, 2024

వేములవాడ: 24 గంటల్లో 17 ఆపరేషన్లు

image

వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రి లో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 17 వివిధ రకాల ఆపరేషన్లు అయ్యాయి. ఇందులో 6 డెలివరీలు, ఒక గర్భసంచిలో గడ్డ, 3 సాధారణ శస్త్రచికిత్సలు, 2 కంటి ఆపరేషన్లు & 5 ఆర్థో ఆపరేషన్లు ఉన్నాయి. ఇందులో సూపరింటెండెంట్, సీనియర్ సర్జన్ డా. పెంచలయ్య, గైనకాలజిస్ట్ డా.సంధ్య, తదితరులున్నారు. ఇక్కడ అన్ని వైద్య సేవలు అందుతున్నట్లు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.

News August 24, 2024

కొండ్రుగట్ల: ‘అంగన్వాడీ కేంద్రాల్లో దోపిడీ, నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం’

image

అంగన్వాడి కేంద్రాల్లో దోపిడీ నిర్లక్ష్యం లాంటివి చేస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే మట్ట రాగమయి అన్నారు. శనివారం కొండ్రుగట్లలో అంగన్వాడి కేంద్రాన్ని, పల్లె దవాఖానను ఎమ్మెల్యే సందర్శించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు అంగన్వాడీ సిబ్బంది పౌష్టికాహారం అందించాలని సూచించారు. అలాగే పల్లె దవాఖానాలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని వైద్యులను ఆదేశించారు.