India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి పాలమూరులో ఉన్న ఐదుగురు జిల్లా పరిషత్ ఛైర్మన్లలో BRS పార్టీకి ఇక ఒక్కరే మిగలనున్నారు. ఒక్కొక్కరుగా ఇప్పటికే ముగ్గురు పార్టీలు మారగా, MBNR జెడ్పీ ఛైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి నేడు BRSను వీడి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. కాగా, నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ శాంత కుమారి ఒక్కరే BRS తమకు పదవులు ఇచ్చిందని, పార్టీ మారే ప్రసక్తే లేదు అంటూ స్పష్టం చేశారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.20,100 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,550 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు మిర్చి ధర రూ.100 తగ్గగా, పత్తి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్లో రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.
విదేశాల్లో ఎంఎస్, పీహెచ్ఏ కోర్సులు చదివేందుకు నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్‌కు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత విభాగం ప్రకటన జారీ చేసింది. 2024-25 సంవత్సరానికి ఎంపిక కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు. www.nosmsje.gov.in అనే వెబ్‌పోర్టల్‌లో ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవావాలని పేర్కొన్నారు.
పోలీసులమంటూ బెదిరించి బంగారు అపహరించిన ఘటన సంగారెడ్డి మండలం చక్రియాలలో జరిగింది. గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి దంపతులు బైకుపై సంగారెడ్డి నుంచి చక్రియాల వెళ్తుండగా MNR వద్ద నలుగురు వ్యక్తులు పోలీసులమంటూ ఆపారు. కత్తితో బెదిరించి వారి వద్దనున్న రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆదిలాబాద్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ గ్రామానికి చెందిన మత్స్యకారుడు రాజన్న(46) మంగళవారం గ్రామ సమీపంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు కాళ్లకు వల చుట్టుకొని నీటిలో మునిగాడు. గమనించిన జాలరులు బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
తిరుమలగిరి మండలం వెలిశాలలో గొర్ల మందపై కుక్కలు దాడి చేసిన ఘటన ఈ తెల్లవారు జామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎల్లంల సమ్మయ్య దొడ్డిలో ఉన్న 32 గొర్లపై కుక్కలు దాడి చేసి చంపినట్లు సమ్మయ్య వాపోయారు. వాటి విలువ సుమారు రూ.2,50,000 విలువ ఉంటుందని, రైతు అవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరుతున్నాడు.
దుమ్ముగూడెం మండలంలోని లక్ష్మీనగరం పోస్టల్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న బ్రాంచ్ పోస్టు మాస్టర్ చేతివాటం ప్రదర్శించాడు. దాదాపు రూ.50వేలకు పైగా పలువురు ఖాతాదారుల ఖాతాల్లో నుంచి వారికి తెలియకుండా నగదు మాయం కావడంపై పోస్టల్ భద్రాచలం ఎస్పీ సుచేందర్ విచారణ చేపట్టారు. ఖాతాదారుల పాసు పుస్తకంలో నగదు చెల్లించినట్టు పోస్టల్ స్టాంప్ సైతం వేసిన పోస్టుమాస్టర్ వారి ఖాతాలో మాత్రం నగదు జమ చేయకపోవడం గమనార్హం.
సింగరేణి సంస్థ విస్తరించిన ప్రాంతాల్లో నేరుగా వేలంలో పాల్గొని బొగ్గు గనులను దక్కించుకోవడానికి యాజమాన్యం కసరత్తు చేస్తుంది. 4 ఉమ్మడి జిల్లాల్లో 12వేల మిలియన్ టన్నుల నిక్షేపాలను సింగరేణి గుర్తించి, కొత్తగా 20 గనుల వరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. MMDC చట్టం ప్రకారం ఏ సంస్థ అయినా వేలం ద్వారానే కొత్త గనులను పొందాల్సి ఉండటంతో సింగరేణి, మిగతా సంస్థలతో పోటీపడి గనులను దక్కించుకునే అవకాశం ఉంది.
ప్రైవేటు వసతిగృహంలో ఉంటున్న యువతిపై ఓ నిర్వాహకుడు అత్యాచారం చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. భూపాలపల్లికి చెందిన వ్యక్తి నయీంనగర్‌లో వసతి గృహం నిర్వహిస్తున్నాడు. అందులో ఉండి ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్న యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. పలుమార్లు అత్యాచారం చేశాడు. తీరా మరో మహిళతో పెళ్లి నిశ్చయం కావడంతో.. బాధిత యువతి పెళ్లి గురించి ప్రస్తావించగా కులం పేరుతో దూషించాడు.
నిజామాబాద్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఇంకా పూర్తి కాలేదు. మంగళవారం ఢిల్లీలో అధిష్ఠానం నిర్వహించిన భేటీలో ఈ విషయంలో ఏకాభిప్రాయానికి రాలేదని సమాచారం. ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిటీ రూపొందించిన జాబితాపై పార్టీ పెద్దలు రెండుమార్లు సమీక్షించారు. సామాజిక సమీకరణాలు, విజయావకాశాల నివేదికలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది.
Sorry, no posts matched your criteria.