Telangana

News March 20, 2024

HYD: ఈటలకు జనసేన మద్దతు ప్రకటన 

image

BJP మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని జనసేన పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముమ్మడి ప్రేమ్‌కుమర్ ప్రకటించారు. ఈరోజు ఈటలను ఆయన కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. BJP అభ్యర్థి ఈటలను గెలిపించేందుకు జనసేన కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. BJP, జనసేన శ్రేణులు కలిసి ఈటలను తప్పకుండా గెలిపిస్తాయన్నారు.   

HYD: యువ శాస్త్రవేత్త కావాలని ఉందా..? నేడే లాస్ట్..!

image

యువ శాస్త్రవేత్తలను తయారుచేసేందుకు ఇస్రో యువిక పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లోని తొమ్మిదో తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు HYD DEO రోహిణి తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుకు నేడే చివరి తేదీ అని, దరఖాస్తు తర్వాత ఇస్రో క్విజ్ పోటీలు నిర్వహిస్తుందని,మార్చి 28న ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా ఇస్రో విడుదల చేస్తుందన్నారు. వెబ్‌సైట్ jigyasa.iirs.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

వరంగల్: ల్యాప్‌టాప్‌లకు వైర్‌లెస్ ఛార్జర్ ఆవిష్కరణ

image

వరంగల్ నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పేర్లి సురేష్ బాబు ల్యాప్‌టాప్‌ల కోసం వైర్‌లెస్ ఛార్జర్ ఆవిష్కరించారు. ఈయన నిట్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో పని చేస్తున్నారు. వైర్లు లేకుండా విద్యుత్‌ను సరఫరా చేసే వైట్రిసిటీ పరిజ్ఞానంతో 7 నెలల పాటు శ్రమించి “వైర్ లెస్ ల్యాప్‌టాప్ ఛార్జర్ విత్ కూలింగ్ పాడ్”ను తయారు చేశారు.

News March 20, 2024

HYD: సమ్మర్ క్యాంపులు.. 2023లో వచ్చిన ఫీజు ఎంత..?

image

GHMC 2023లో నిర్వహించిన సమ్మర్ క్యాంపులలో ఎల్బీనగర్ నుంచి రూ.31,030, చార్మినార్- రూ.1,05,680, ఖైరతాబాద్- రూ.1,72,600, శేర్లింగంపల్లి- రూ.81,240, కూకట్‌పల్లి- రూ.74,840, సికింద్రాబాద్ సర్కిల్ నుంచి- రూ.1,11,220 ఫీజు వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 25 నుంచి మే 31వ తేదీ వరకు సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 44 రకాల క్రీడలపై తర్ఫీదు ఇవ్వనున్నారు.

HYD: ఈ చిన్నారి GREAT

image

HYD చందానగర్‌ వాసి చార్విశ్రీ హుడాకాలనీలోని విద్యావాణి హైస్కూల్‌లో రెండో తరగతి చదువుతోంది. యూట్యూబ్‌లో వీడియో చూసిన చిన్నారి క్యాన్సర్ రోగికి అవసరమయ్యే విగ్ కోసం తన జుట్టు ఇవ్వాలనుకుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు గోపాలకృష్ణమూర్తి, మంజూష సహకారంతో 25అంగుళాల పొడవున్న జుట్టును ఇటీవల HYD హెయిర్ డొనేషన్ ఫర్ క్యాన్సర్ పేషెంట్ సంస్థకు అందించింది. ఈవయసులో చిన్నారి ఆలోచన ఆదర్శనీయమని స్థానికులు అభినందించారు.

సిద్దిపేట: ‘మెదక్ ఎంపీ సీటును భారీ మెజారిటీతో గెలిపించుకుందాం’

image

మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మెదక్ BJP అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. మెదక్ ఎంపీ సీటును భారీ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులతో పాటు ఆయా మోర్చాల నాయకులు, శక్తి కమిటీలు, బూత్ కమిటీల నాయకులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.