India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునే విధంగా భరోసా కల్పించడం కోసమే ఫ్లాగ్ మార్చ్ పోలీసు కవాతు నిర్వహిస్తున్నామని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర, ఖమ్మం రూరల్ పోలీసుల ఆద్వర్యంలో వివిధ ప్రాంతాలలోని సెంట్రల్ పోలీస్ ఫోర్స్ తో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు చెప్పారు. నగదు మద్యం రవాణాను చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా జలగం వెంకటరావు పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆయన ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనకు ఖమ్మం ఎంపీ టికెట్ ఇస్తామని బీజేపీ అధిష్టానం హామీ ఇచ్చిందని.. అందుకే పార్టీలో చేరారనే ప్రచారం జరుగుతోంది.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో ఈనెల 27న శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. 27 నుంచి 31 వరకు ఐదు రోజులపాటు శ్రీ శివ కళ్యాణోత్సవాలు జరపనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా 30న(శనివారం) సాయంత్రం శ్రీ స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అర్చకులు తెలిపారు.
MBNR: BRS నుంచి ఆ పార్టీ నేతలు వరుసగా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి సమక్షంలో బుధవారం జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ స్వర్ణ కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌తో పాటు వారి అనుచరులు కూడా కాంగ్రెస్‌లో చేరారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో గల శ్రీ గుంజేడు ముసలమ్మ జాతర నేటి నుంచే ప్రారంభం కానుంది. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా పేరున్న శ్రీ గుంజేడు ముసలమ్మ జాతర నేటి నుంచి మూడు రోజులపాటు ఘనంగా జరగనుంది. ఈ జాతరకు మహబూబాబాద్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు పోటెత్తనున్నారు. ఇప్పటికే జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఈవో బిక్షమాచారి తెలిపారు.
ఏళ్లుగా ప్రాపర్టీ TAX కట్టని వారిపై GHMC చర్యలకు సిద్ధమైంది. మొండి బకాయిల వసూలే లక్ష్యంగా పెట్టుకొన్న అధికారులు.. తొలుత వ్యాపారసముదాయాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే 100కు పైగా దుకాణాలకు తాళం వేశారు. ఇటువంటి వారి కోసం OTS(వన్ టైమ్ సెటిల్‌మెంట్) స్కీమ్ అమల్లో ఉందని గుర్తుచేస్తున్నారు. MAR 31లోపు చెల్లిస్తే 90% డిస్కౌంట్ ఇస్తున్నారు. పన్ను కట్టని నిర్మాణాలపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఏళ్లుగా ప్రాపర్టీ TAX కట్టని వారిపై GHMC చర్యలకు సిద్ధమైంది. మొండి బకాయిల వసూలే లక్ష్యంగా పెట్టుకొన్న అధికారులు.. తొలుత వ్యాపారసముదాయాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే 100కు పైగా దుకాణాలకు తాళం వేశారు. ఇటువంటి వారి కోసం OTS(వన్ టైమ్ సెటిల్‌మెంట్) స్కీమ్ అమల్లో ఉందని గుర్తుచేస్తున్నారు. MAR 31లోపు చెల్లిస్తే 90% డిస్కౌంట్ ఇస్తున్నారు. పన్ను కట్టని నిర్మాణాలపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
కాగజ్‌నగర్ మండలం భట్టుపెల్లికి చెందిన రమేశ్‌కుమార్ అదే గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలికను మే8, 2023న అత్యచారం చేశాడు. కుటుంబీకులు అదేరోజు కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేశారు. మంగళవారం 14 మంది సాక్షులను విచారించిన న్యాయమూర్తి నిందితుడికి జీవితఖైదు, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
యాదగిరిగుట్ట వద్ద రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. 108 సిబ్బంది తెలిపిన వివరాలు.. భువనగిరి మున్సిపాలిటీ రాయగిరికి చెందిన శివ మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు యాదగిరిగుట్ట సమీపాన బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. స్థానికుల సమాచారంతో క్షతగాత్రుడిని 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు క్షతగాత్రుడు అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు.
ఇన్విజిలేటర్ నిర్లక్ష్యంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. పాల్వంచలోని KTPS పాఠశాలలో పదో తరగతి తెలుగు పరీక్ష జరిగింది. విద్యార్థులకు ఇన్విజిలేటర్ ఆన్సర్ షీట్స్‌కి బదులు అడిషనల్ షీట్స్ ఇచ్చారు. విద్యార్థులు అందులోనే జవాబులు రాశారు. మరుసటి రోజు హిందీ పరీక్ష రాశాక జరిగిన తప్పును గ్రహించి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం తన దృష్టికి రాలేదని ఎంఈవో రామ్మూర్తి చెప్పారు.
Sorry, no posts matched your criteria.