Telangana

News August 24, 2024

HYD: ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసే CHANCE

image

HYD, RR, MDCL, VKB జిల్లాల్లోని ప్రజలు tspolice.gov.in వెబ్‌సైట్ ద్వారా పోలీసులకు ఫిర్యాదులు, సూచనలను ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా చేయొచ్చని HYD, CYB పోలీస్ అధికారులు తెలిపారు. FIR సైతం డైరెక్ట్ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. ప్రజా భద్రత విషయంలో పారదర్శకతను పాటిస్తున్నట్లుగా పోలీసు యంత్రాంగం తెలిపింది.

HYD: ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి అంతంతే..!

image

HYD ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి ప్రైవేట్ ఆసుపత్రులతో పోలిస్తే అంతంత మాత్రమే జరుగుతుంది. 2013నుంచి ఇప్పటివరకు సుమారు నిమ్స్ ఆసుపత్రిలో 32, గాంధీలో ఒకటి, ఉస్మానియాలో 9 అవయవ మార్పిడి పరీక్షలు జరిగాయి. అదే.. యశోదలో 486, కిమ్స్‌లో 275 అవయవ మార్పిడిలు జరగడం గమనార్హం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిపుణులు ఉన్నప్పటికీ, అత్యాధునిక థియేటర్లు, పూర్తి వసతులు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

లింగాల: బాల పురస్కార్ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

image

ప్రధానమంత్రి బాల పురస్కార్ అవార్డు కోసం ప్రతిభ గల బాల, బాలికల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ICDS) అధికారులు తెలిపారు. ధైర్య సాహసాలు ,క్రీడలు, పర్యావరణం కళలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సేవా రంగాలలో ప్రావీణ్యం కలిగిన 5 నుంచి 18 ఏళ్ల వయసు గల బాల, బాలికలు ఆగస్టు 31 తేదీ వరకు http.s://awrds.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు.

News August 24, 2024

HYD: కార్మికులకు భద్రత, సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత

image

రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు భద్రత ఇతర సదుపాయాల కల్పనకు TBOCWWB ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ గంగాధర్ అన్నారు. HYD ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ఆవరణలో TBOCWWB  ఆధ్వర్యంలో రాష్ట్రంలో సహాయ కార్మిక శాఖ అధికారులకు బయోమెట్రిక్, ఐరిష్ పరికరాలను పంపిణీ చేశారు.

News August 24, 2024

HYD: PIB ఏడీజీతో గవర్నర్ సమావేశం

image

HYD సోమాజిగూడ వద్ద ఉన్న రాజ్ భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ADG శృతి పాటిల్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏడీజీ, మీడియా యూనిట్స్ పరిస్థితి, మినిస్ట్రీ ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్ సంబంధించిన సమాచారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువచ్చినట్లుగా పేర్కొన్నారు.

ఖమ్మం: గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి

image

ఖమ్మం జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికలు వాయిదా పడతాయని భావిస్తున్న తరుణంలో పంచాయతీ ఓటర్ల ముసాయిదా షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ మద్దతుదారులతో పాటు వనరుల సమీకరణలో నిమగ్నమయ్యారు. ఖమ్మం జిల్లాలో 589 గ్రామ పంచాయతీల్లోని 5389 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది.

News August 24, 2024

ఉప్పల్: మద్యం తాగి పట్టుపడ్డ వారికి ట్రాఫిక్ డ్యూటీ

image

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వ్యక్తులు 2 రోజుల పాటు ట్రాఫిక్ డ్యూటీ చేయాలని మెజిస్ట్రేట్ ఆదేశించింది. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఉప్పల్ ట్రాఫిక్ పీఎస్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు కోర్టు ఆర్డర్లను అమలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారు ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ‘మద్యం తాగి వాహనం నడపొద్దని’ ప్లకార్డులను ప్రదర్శించారు.