Telangana

News August 24, 2024

ఉప్పల్: మద్యం తాగి పట్టుపడ్డ వారికి ట్రాఫిక్ డ్యూటీ

image

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వ్యక్తులు 2 రోజుల పాటు ట్రాఫిక్ డ్యూటీ చేయాలని మెజిస్ట్రేట్ ఆదేశించింది. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఉప్పల్ ట్రాఫిక్ పీఎస్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు కోర్టు ఆర్డర్లను అమలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారు ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ‘మద్యం తాగి వాహనం నడపొద్దని’ ప్లకార్డులను ప్రదర్శించారు.

News August 24, 2024

గ్రేటర్ HYDలో బస్తీ ప్రాంతాలకు బస్సులు కరవు!

image

గ్రేటర్ HYDలో వందల సంఖ్యలో ఉన్న కాలనీలు, బస్తీలకు తగినన్ని ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేవు. ఫలితంగా వ్యక్తిగత వాహనాల సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగిపోతుందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలు, బస్తీలకు సెట్విన్ తరహాలో మినీ బస్సులు నడిపితే ప్రయోజనం ఉంటుందనే గతంలో నిపుణులు సూచించినా ఆ దిశగా ఇప్పటి వరకు ఆర్టీసీ చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. మీ కామెంట్?

కౌడిపల్లి: పాముకాటుతో బాలిక మృతి

image

పాము కాటుతో బాలిక మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఈరోజు జరిగింది. కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం.. మండల పరిధిలోని భుజరంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి(12) ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో అర్ధరాత్రి పాము కాటుకు గురైంది. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News August 24, 2024

విదేశీ పర్యటన ముగించుకొని నేడు హైదరాబాద్‌కు అచ్చంపేట ఎమ్మెల్యే

image

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఈ రోజు విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ రానున్నారు. గత పది రోజుల క్రితం చైనా వెళ్లిన ఎమ్మెల్యే పలు అంశాలపై అధ్యయనం చేశారు. విదేశీ పర్యటన ముగించుకొని వస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణకు స్వాగతం పలికేందుకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News August 24, 2024

కరీంనగర్: CSE వైపే విద్యార్థుల మొగ్గు!

image

ఇంజినీరింగ్ సీట్ల భర్తీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థులు CSE కోర్సులో చేరేందుకు అమితాసక్తి చూపారు. ఒకప్పుడు హవా చాటిన ‘సివిల్’ ఈసారి డీలా పడింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో అన్ని బ్రాంచిల్లో కలిపి 4,516 సీట్లు ఉన్నాయి. సీఎస్ఈ కోర్సులో 1,420 సీట్లు ఉండగా.. 1,242 సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్‌లో 248 సీట్లకు గాను 115 మాత్రమే భర్తీ కాగా.. మెకానిల్‌ది అదే పరిస్థితి ఉంది.

News August 24, 2024

సిద్దిపేట-మెదక్ రహదారిపై బైఠాయించిన విద్యార్థులు

image

అక్బర్ పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామస్థులు విద్యార్థులతో కలిసి రాస్తారోకో చేపట్టారు. పాఠశాలకు బదిలీపై వచ్చిన ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి డిప్యుటేషన్ చేయడంతో విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. విద్యార్థులు, గ్రామస్థులు, మాజీ సర్పంచ్ రాజయ్య ఆధ్వర్యంలో సిద్దిపేట మెదక్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వెంటనే డిప్యుటేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

News August 24, 2024

HYD: ప్రజావాణికి 1150 అర్జీలు

image

బేగంపేట్‌లోని మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 1150 అర్జీలు అందాయి. ఎస్సీ సంక్షేమం-610, విద్యుత్ శాఖ, సింగరేణి-115, పౌరసరఫరాల శాఖ-113, మైనారిటీ సంక్షేమం-85, రెవెన్యూ-69, ఇతర శాఖలకు 158 వచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి, ప్రత్యేక అధికారిణి దివ్య అర్జీలు స్వీకరించారు. దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

మెదక్: ఆశల పల్లకిలో పల్లె పోరు !

image

గత ఆరు నెలలుగా ఊరిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆశావాహులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సర్పంచులు, వార్డు సభ్యుల ఎన్నికల కోసం గ్రామ పంచాయతీలు, వార్డుల వారిగా ఓటర్ల జాబితా తయారికి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో గ్రామాల్లో సమీకరణాలు మొదలయ్యాయి. ముఖ్యంగా యువత స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.