Telangana

News August 24, 2024

రైతు రుణమాఫీ కోసం ప్రత్యేక మొబైల్ యాప్: మంత్రి తుమ్మల

image

రెండు లక్షల లోపు రుణం ఉండి అన్ని వివరాలు సక్రమంగా ఉన్నా రుణమాఫీకి నోచుకోని రైతుల కోసం త్వరలో ఒక మొబైల్ యాప్ తీసుకొస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. రెండు లక్షల వరకు రుణం తీసుకున్నప్పటికీ మాఫీ కానీ 4,24,873 మంది రైతుల ఖాతాల వివరాలను సేకరించనున్నామని వీటిని మొబైల్ యాప్ లో అప్లోడ్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు . వ్యవసాయ అధికారులు రైతుల వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తారు.

News August 24, 2024

HYD: నవోదయ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికిగాను 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజియన్ ఉపసంచాలకులు టీ.గోపాలకృష్ణ గచ్చిబౌలిలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. సెప్టెంబరు 15వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్ష జనవరి 18న ఉంటుందన్నారు.

News August 24, 2024

NLG: రుణమాఫీకి దండిగా దరఖాస్తులు

image

రుణమాఫీ కాని రైతులు వ్యవసాయశాఖ కార్యాలయాల్లోని గ్రీవెన్స్ సెల్‌లలో పెద్ద ఎత్తున దరఖాస్తులు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేసింది. అయితే వివిధ కారణాల వల్ల జిల్లాలు అనేక మంది రైతులకు రుణమాఫీ కాలేదు. శుక్రవారం నాటికి జిల్లాలోని అన్ని మండలాలకు సంబంధించి 5,840 దరఖాస్తులు వచ్చినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.

News August 24, 2024

HYD: నవోదయ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికిగాను 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజియన్ ఉపసంచాలకులు టీ.గోపాలకృష్ణ గచ్చిబౌలిలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. సెప్టెంబరు 15వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్ష జనవరి 18న ఉంటుందన్నారు.

News August 24, 2024

జూరాలకు భారీగా పెరిగిన వరద

image

జూరాలకు వరద భారీగా పెరుగుతోంది. జలాశయంలోకి 90వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. జలాశయం నుంచి జల విద్యుదుత్పత్తి 35వేల క్యూసెక్కులు, 16గేట్లు ఎత్తి 66వేల క్యూసెక్కులు మొత్తం 1.01లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయంలోకి 43వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. నారాయణ్ పూర్ జలాశయంలోకి 30వేల క్యూసెక్కుల వరద చేరుతోందని అధికారులు తెలిపారు.

News August 24, 2024

HYD: హైవేలపై నడక మార్గాలను పెంచాలి: మంత్రి పొన్నం

image

జాతీయ రహదారులపై రద్దీగా ఉండే ప్రాంతాల్లో పాదచారుల నడక మార్గాల సంఖ్యను పెంచడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. రహదారి భద్రతకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల అమలుపై శుక్రవారం హైదరాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో అత్యున్నత సమీక్షా సమావేశం జరిగింది. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించేందుకు అన్ని విభాగాలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు.

ఖమ్మం: 7,04,615 మంది కార్డుదారులకు లబ్ధి

image

‘చౌకదుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ’ హామీని జనవరి నుంచి అమలుచేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఈ పథకం అమలైతే.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 1,190 రేషన్‌ దుకాణాల పరిధిలో 7,04,615 మంది కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది. రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, డీలర్ షిప్ కూడా తొలగిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

News August 24, 2024

HYD: టీచర్‌గా మారిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

image

రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ కొద్దిసేపు టీచర్‌గా మారారు. విద్యార్థులకు పాఠాలు బోధించారు. అక్కడి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. రాజ్‌భవన్‌ ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థుల నైపుణ్యాలను గవర్నర్‌ స్వయంగా పరీక్షించారు. దృఢసంకల్పంతో తమ కలలను సాకారం చేసుకోవాలని, సమాజంపై బాధ్యతను పెంచుకోవాలని విద్యార్థులకు హితబోధ చేశారు.

News August 24, 2024

HYD: కొత్త రేషన్ కార్డులకు 2.8 లక్షల దరఖాస్తులు

image

కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుత కార్డుదారుల్లో మరణించినవారి వివరాలను తొలగించి.. కొత్త పేర్ల నమోదుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక్కో సర్కిల్‌లో సుమారు 20 వేల వరకు కొత్త పేర్ల నమోదుకు సంబంధించి అభ్యర్థనలు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం HYDలో 2.8 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే చేసి అర్హులను గుర్తించనున్నారు.