Telangana

News August 24, 2024

ఖమ్మం: 7,04,615 మంది కార్డుదారులకు లబ్ధి

image

‘చౌకదుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ’ హామీని జనవరి నుంచి అమలుచేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఈ పథకం అమలైతే.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 1,190 రేషన్‌ దుకాణాల పరిధిలో 7,04,615 మంది కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది. రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, డీలర్ షిప్ కూడా తొలగిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

News August 24, 2024

HYD: టీచర్‌గా మారిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

image

రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ కొద్దిసేపు టీచర్‌గా మారారు. విద్యార్థులకు పాఠాలు బోధించారు. అక్కడి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. రాజ్‌భవన్‌ ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థుల నైపుణ్యాలను గవర్నర్‌ స్వయంగా పరీక్షించారు. దృఢసంకల్పంతో తమ కలలను సాకారం చేసుకోవాలని, సమాజంపై బాధ్యతను పెంచుకోవాలని విద్యార్థులకు హితబోధ చేశారు.

News August 24, 2024

HYD: కొత్త రేషన్ కార్డులకు 2.8 లక్షల దరఖాస్తులు

image

కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుత కార్డుదారుల్లో మరణించినవారి వివరాలను తొలగించి.. కొత్త పేర్ల నమోదుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక్కో సర్కిల్‌లో సుమారు 20 వేల వరకు కొత్త పేర్ల నమోదుకు సంబంధించి అభ్యర్థనలు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం HYDలో 2.8 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే చేసి అర్హులను గుర్తించనున్నారు.

HYD: 20 మంది మాయగాళ్లు.. 900 కేసులు

image

పార్ట్ టైం జాబ్స్, షేర్ మార్కెట్, ఫెడెక్స్ కొరియర్‌తో బెదిరింపులు.. ఇలా గుజరాత్ ముఠాలు దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నాయి. తరచూ చిరునామా మార్చుతూ పోలీసులను ఏమార్చటం వీరి ప్రత్యేకత. సైబర్ క్రైమ్ పోలీసులు 7 బృందాలుగా ఏర్పడి గుజరాత్‌లో మకాం వేసి నేరస్థులను గుర్తించారు. 20 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిపై మన రాష్ట్రంలోనే 100కు పైగా కేసులు ఉన్నాయని తెలుస్తోంది.

సింగూరు ప్రాజెక్టుకు స్వల్ప వరద

image

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలంలోని సింగూరు ప్రాజెక్టులోకి స్వల్ప వరద వస్తోంది. శుక్రవారం ఇన్‌ఫ్లో 1907 క్యూసెక్కులు, అవుట్‌ ఫ్లో 391 క్యూసెక్కులు కొనసాగినట్లు అధికారులు తెలిపారు. తాలేల్మ లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు 31 క్యూసెక్కులు, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌కు 80 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథ కోసం 70 క్యూసెక్కులు, వృథాగా 210 క్యూసెక్కుల నీరు వెళ్తున్నట్లు తెలిపారు.

News August 24, 2024

HYD: చెత్త తొలగింపులో జీహెచ్ఎంసీ జాప్యం

image

నగరంలో చెత్త సేకరణ రోజురోజుకూ మందగిస్తోంది. 20 లక్షల ఇళ్ల నుంచి ఉత్పత్తయ్యే చెత్తను సేకరించడానికి బల్దియా 4,500 స్వచ్ఛ ఆటోలను ఏర్పాటు చేసిన, సరిగా చెత్త క్లియర్ చేయడం లేదు. దీంతో దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా బారిన పడుతున్నారు. గ్రేటర్ పరిధిలో ఈ సీజన్‌లో 1800 మంది డెంగ్యూ, 2220 మంది మలేరియాతో చికిత్స పొందుతున్నారు. దోమల నివారణకు జీహెచ్ఎంసీ రూ.10 కోట్లు ఖర్చు చేసిన ఫలితం లేకుండా పోతోంది.