Telangana

News August 24, 2024

నేడు మిడ్ మానేరు నుంచి ఎల్ఎండీకి నీటి విడుదల

image

రాజరాజేశ్వర జలాశయం(మిడ్ మానేరు) నుంచి శనివారం దిగువన ఎల్ఎండీకి నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జలాశయానికి ఎల్లంపల్లి నుంచి 6,300, మానేరు, మూలవాగు నుంచి 110 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి కుడి కాలువ, అన్నపూర్ణ జలాశయానికి నీటి తరలింపును నిలిపివేశారు. జలాశయం పూర్తి సామర్థ్యం 27.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17.78 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

News August 24, 2024

మహమ్మదాబాద్: బాలికపై అత్యాచారం.. వ్యక్తిపై కేసు

image

బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు అయిన ఘటన మహమ్మదాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. గత నెల మైనర్ బాలికపై మండల కేంద్రంలో నివాసం ఉంటున్న రమేశ్ రెడ్డి అనే వ్యక్తి అత్యాచారం చేశారని బాలిక తల్లిదండ్రులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. దీంతో అత్యాచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

News August 24, 2024

జనగామ: పుట్టింటికి వెళ్లిన భార్య.. భర్త సూసైడ్

image

పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. తరిగొప్పుల మండలం జాలూబాయి తండాకు చెందిన సభావత్ సుమన్(26) అదే తండాకు చెందిన ఓ యువతితో మూడు నెలల కిందట వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులకే ఇద్దరి మధ్య కలహాలు రాగా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన సుమన్ శుక్రవారం ఉదయం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేశారు.

News August 24, 2024

మెడికల్ కాలేజీ పనులు త్వరగా ప్రారంభించాలి: మంత్రి తుమ్మల

image

ఖమ్మంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి స్థలం కేటాయించిన నేపథ్యంతో నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. అలాగే, సీజనల్ వ్యాధులు ప్రబలుతుండడంతో వైద్యులు, నర్సులను పూర్తిస్థాయిలో నియమించి పీహెచ్సీలను బలోపేతం చేయాలని మంత్రి తుమ్మల కోరారు.

News August 24, 2024

MBNR: అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశాలకు చివరి తేదీ 31

image

డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2024-25 సంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు విశ్వవిద్యాలయ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.సుధారాణి పేర్కొన్నారు. ఆయా కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 31 చివరి తేదీ అని, అదనపు సమాచారం కోసం సమీప అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని, www.braouonline.in,/ www.braou.ac.in వెబ్ సైట్ లో చూడాలన్నారు.

News August 24, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్య అంశాలు

image

>ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
>వివిధ శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష
>ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
>బూర్గంపాడులో ఎమ్మెల్యే పాయం పర్యటన
>నేలకొండపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
>ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
>ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం

News August 24, 2024

నిజామాబాద్ జిల్లాలో పెరిగిన చిరుతల సంఖ్య

image

జిల్లాలో చిరుత పులుల సంచారం కలకలం రేపుతుంది. ఇటీవల పశువులు, జనాలపై చిరుతల దాడులు పెరిగాయి. NZB, ఇందల్వాయి, వర్ని, రేంజల్ పరిధిలో గడిచిన మూడేళ్లలో చిరుతల సంఖ్య 80 వరకు పెరిగింది. కాగా ఆ ప్రాంతం పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిరుతలు కనిపిస్తే అటవీ అధికారులకు సమాచారం అందించాలని సౌత్ రేంజ్ ఇన్‌ఛార్జ్ అధికారి రవిమోహన్ సూచించారు.

News August 24, 2024

పాతబస్తీ మెట్రో కోసం 1200 ఆస్తుల సేకరణ

image

పాతబస్తీ మార్గంలో మెట్రోరైలు కోసం రెండో విడత భూసేకరణ నోటిఫికేషన్‌ను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ జారీ చేశారు. సేకరించాల్సిన ఆస్తులను గుర్తించగానే విడతలవారీగా ప్రకటనలు ఇస్తున్నారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ. మార్గంలో మెట్రో కోసం 1200 ఆస్తులను సేకరించాల్సి ఉంటుందని హెచ్ఎఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శుక్రవారం వెల్లడించారు. 8 నెలల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించారు.

News August 24, 2024

పాతబస్తీ మెట్రో కోసం 1200 ఆస్తుల సేకరణ

image

పాతబస్తీ మార్గంలో మెట్రోరైలు కోసం రెండో విడత భూసేకరణ నోటిఫికేషన్‌ను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ జారీ చేశారు. సేకరించాల్సిన ఆస్తులను గుర్తించగానే విడతలవారీగా ప్రకటనలు ఇస్తున్నారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ. మార్గంలో మెట్రో కోసం 1200 ఆస్తులను సేకరించాల్సి ఉంటుందని హెచ్ఎఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శుక్రవారం వెల్లడించారు. 8 నెలల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించారు.

News August 24, 2024

కవ్వాల్ ప్రాంతంలో పెద్దపులి సంచారం 

image

కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం పరిధిలోని గోండు గూడ బీట్ జువ్విగూడా ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోంది. శుక్రవారం ఆ ప్రాంతంలో పులి అడుగులను అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో అటవీ సమీప ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరికైనా పులి కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు.