Telangana

News August 24, 2024

NRPT: ‘సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చర్యలు’

image

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు. విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే పోస్టులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్స్‌అప్ తదితర సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని అన్నారు. సోషల్ మీడియాపై ఐటి సెల్ విభాగం 24 గంటల నిఘా పెడుతుందని అన్నారు.

News August 24, 2024

ఖమ్మం జిల్లాలో హైడ్రా ఏర్పాటు దిశగా అడుగులు..!

image

ఇప్పుడు ఎక్కడ చూసిన హైడ్రా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే HYDలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చి వేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఖమ్మం జిల్లాలో కూడా హైడ్రా ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ భూములు, చెరువులు, కొలనులు, డ్రైనేజి కాలువలను ఆక్రమించి నిర్మాణం చేపట్టిన భవనాలపై చర్యలు తీసుకుంటుందని సమాచారం. దీంతో అక్రమార్కులు భయాందోళనకు గురవుతున్నారు.

News August 24, 2024

కడెం ప్రాజెక్టును సందర్శించిన అధికారులు

image

కడెం ప్రాజెక్టును మెకానికల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విద్యానంద్, డీఈ కరుణాకర్ శుక్రవారం సందర్శించారు. ప్రాజెక్టు వరద గేట్ల స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పలు గేట్లను ఎత్తి చూసి ప్రాజెక్ట్ అధికారులకు గేట్లు ఎత్తే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. అనంతరం మెకానికల్ విభాగంలో ఉన్న పలు పరికరాలను పరిశీలించారు.

News August 24, 2024

భూ సేకరణ ప్రతిపాదనలు పంపించాలని ఆదేశం

image

ఎత్తిపోతల పథకాలకు అవసరమైన భూములకై వెంటనే భూసేకరణ ప్రతిపాదనలను పంపించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అయన లిఫ్ట్ ఇరిగేషన్ల భూసేకరణపై నీటిపారుదల, రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని అన్ని డివిజన్ల పరిధిలో చేపట్టనున్న లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించి అవసరమయ్యే భూముల పూర్తి వివరాలతో ప్రతిపాదనలు పంపించాలన్నారు.

News August 24, 2024

NZB: DSP రీజినల్ ఇన్‌ఛార్జ్‌గా సుమన్‌కు బాధ్యతలు

image

ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల రీజినల్ ఇన్‌ఛార్జ్‌గా కండెల సుమన్‌ను నియమిస్తూ ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ లేఖలో వెల్లడించారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం రీజియన్‌లో పార్టీ నిర్మాణ కార్యక్రమాలను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ఆయన సూచించారు. ఇంతటి బాధ్యతలు అప్పగించినందుకు విశారధన్ మహారాజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

News August 23, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి TOP NEWS

image

✓విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించాలి:రామకృష్ణ
✓KPHB: యూట్యూబర్ వంశీ అరెస్ట్
✓బాచుపల్లి: రూ.4 లక్షలు.. చెల్లించినందుకు శివశంకర్ రెడ్డి అరెస్ట్
✓ఉప్పల్ ప్రాంతానికి మరో రూ.6 కోట్లు
✓తార్నాక: ఉద్యమకారులకు సహకారం ఉంటుంది: కోదండరాం
✓కొండారెడ్డిపల్లి ఘటనపై డీజీపీకి మహిళా జర్నలిస్టుల ఫిర్యాదు
✓రాచకొండ: 15 రోజుల్లో 122 మంది పోకిరీలు చిక్కారు.

News August 23, 2024

HYD: ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆరోగ్యం విషమం

image

తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ పోరాటంలో ఆయన తన వంతు కృషి చేశారని పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వారి మిత్రులు తెలిపారు.

News August 23, 2024

HYD: ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆరోగ్యం విషమం

image

తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ పోరాటంలో ఆయన తన వంతు కృషి చేశారని పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వారి మిత్రులు తెలిపారు.

News August 23, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి ముఖ్యంశాలు

image

☆ కేటీఆర్ కు మంత్రి పొంగులేటి సవాల్
☆ కొత్తగూడెంలో బాలికలపై ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన
☆ రుణమాఫీ కాని రైతుల దరఖాస్తులు అప్డేట్ చేశాం: భద్రాద్రి కలెక్టర్
☆ నిండు ప్రాణాల్ని మావోయిస్టులు బలి తీసుకున్నారు: ఎస్పీ
☆ చంద్రుగొండ లో కుక్కల దాడిలో దుప్పికి గాయలు
☆ ఖమ్మం జిల్లాలో పశుగణన పకడ్బందీగా చేపట్టాలి: అదనపు కలెక్టర్
☆ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన తెలుగు టీచర్ సస్పెండ్

News August 23, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో టాప్ న్యూస్..

image

> WGL: మార్కెట్ కు మూడు రోజులు సెలవులు
> HNK: మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యతను ఇవ్వండి: సీపీ
> HNK: అదానీ లేకపోతే మోడీ లేడు: సీపీఐ జాతీయ కార్యదర్శి
> WGL: భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు
> BHPL: 27వ తేదీన కోటగుళ్లను సందర్శించనున్న గవర్నర్
> JN: ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం
> WGL: గురుకులాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
> JN: విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే కడియం