Telangana

News August 23, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్

image

> MHBD: గంగారంలో చెట్టును ఢీ-కొట్టిన కారు
> JN: పెద్దపహాడ్ స్టేజి వద్ద రోడ్డు ప్రమాదం
> MHBD: కొడుకు శవాన్ని చూసి.. తల్లి మృతి
> JN: బైకు దొంగలు అరెస్ట్
> WGL: చింతల్ బ్రిడ్జిపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ
> MHBD: కుక్కలను తప్పించబోయి ఇద్దరికీ గాయాలు
> WGL: ఎంజీఎం వద్ద పారిశుద్ధ కార్మికుడికి దొరికిన తుపాకీ

News August 23, 2024

నిర్మల్: పుట్టినరోజు వేడుకలకు వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి

image

నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం లోలం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. నిర్మల్ నుంచి లోలంకి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు ప్రశాంత్ (20), సంజయ్ (20), నితిన్ వెళ్తుండగా వారి బైకు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రశాంత్, సంజయ్ అక్కడికక్కడే మృతి చెందారు. నితిన్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

News August 23, 2024

ADB: బాత్రూంకు వెళ్లొచ్చేలోపే బైక్, ఫోన్ మాయం

image

బాత్రూంకు వెళ్లొచ్చేలోపే బైక్, ఫోన్ మాయమైన ఘటన ఆదిలాబాద్‌లో చోటుచేసుకుంది. టూ టౌన్ ఎస్ఐ విష్ణు ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం.. దుర్వ రామ్ అనే వ్యక్తి శుక్రవారం బైక్ పై భీంసారి నుంచి గాంధీనగర్ వెళ్తుండగా మార్గ మధ్యలో బైకును పక్కన పెట్టి బాత్రూంకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ద్విచక్రవాహనం దొంగతనానికి గురైంది. వెంటనే బాధితుడు స్టేషన్ వెళ్లి వాహనంతో పాటు ఫోన్ పోయిందని ఫిర్యాదు చేశారు.

News August 23, 2024

HYD: ఉద్యమకారులకు ప్రభుత్వ సహకారం ఉంటుంది: కోదండ రామ్

image

తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమకారులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సమితి ఛైర్మన్ సుల్తాన్ యాదగిరి నేతృత్వంలో శుక్రవారం ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్‌ను తార్నాకలో కలిసి ఘనంగా సత్కరించి అభినందించారు. ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించే విధంగా తన వంతు కృషి చేస్తానని కోదండరాం హామీ ఇచ్చారు.

ఆర్ఓఆర్ 2024తో రైతులకు ఎంతో ఉపయోగకరం: గుత్తా

image

ప్రస్తుత 2020 రెవెన్యూ చట్టం వల్ల కలిగే ఇబ్బందులను తొలగించి రైతులకు ఉపయోగకరమైన చట్టాన్ని తీసుకొచ్చేందుకుగాను ప్రభుత్వం నూతన ఆర్ఓఆర్ 2024 చట్టం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం NLG కలెక్టరేట్లో “తెలంగాణ హక్కుల రికార్డు బిల్లు- 2024” ముసాయిదా పై ఏర్పాటు చేసిన సదస్సు, చర్చ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

News August 23, 2024

HYD: రేపు తెలుగు సంక్షేమ భవన్ ముట్టడి: వేముల రామకృష్ణ

image

విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 24వ తేదీన శనివారం వందలాది మంది విద్యార్థులతో మాసబ్ ట్యాంక్‌లోని తెలుగు సంక్షేమ భవన్‌ను ముట్టడిస్తున్నట్లు బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ తెలిపారు. శుక్రవారం కాచిగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ భవన్ ముట్టడి కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హాజరవుతారన్నారు.

కామారెడ్డి జిల్లాలో దొంగల బీభత్సం

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలో 9 ఇండ్లలో భారీ చోరీ జరిగింది. నిన్న అర్ధరాత్రి వివేకానంద కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీ, స్నేహపురి కాలనీలలో దొంగలు బీభత్సం సృష్టించారు, 9 ఇండ్లలో బంగారం, వెండి, నగదు అపహరించారు. బాధితుల ఫిర్యాదు వరకు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా ఇంటికి తాళం వేసి ఊరిలోకి వెళ్తే ఇంట్లో విలువైన వస్తువులు ఉంచవద్దని సూచించారు.

News August 23, 2024

రైతు రుణమాఫీపై మంత్రి తుమ్మల ఆరా

image

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ, కో-ఆపరేటివ్ అధికారులతో రుణమాఫీ పథకం గురించి క్షేత్రస్థాయిలో తలెత్తిన సమస్యలను పరిష్కరించే దిశగా చేపట్టిన చర్యలను గురించి ఆరాతీశారు. ఇప్పటికే 2 లక్షలలోపు కుటుంబ నిర్ధారణ జరిగిన కుటుంబాలన్నింటికీ మాఫీ చేసి నందున, 2 లక్షలలోపు కుటుంబ నిర్ధారణ లేని 4,24,873 ఖాతాదారుల సమాచారాన్ని సేకరించేందుకు వీలుగా, ఒక క్రొత్త యాప్ ను తీసుకువచ్చినట్లు చెప్పారు.