Telangana

News August 23, 2024

ఉమ్మడి జిల్లాలో పంటల సాగు వివరాలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆగస్టుతో దాదాపు వరినాట్లు పూర్తవుతాయి. అయితే సాగుకు సంబంధించిన వివరాలను వ్యవసాయ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఆహార, వాణిజ్య పంటలసాగు 12,35,875 ఎకరాలు, ఉద్యాన పంటల సాగువిస్తీర్ణం 1,96,204 ఎకరాలు, అటవీభూమి విస్తీర్ణం 6,26,025 ఎకరాలు, మొత్తం రైతులు 6,41,612 ఉన్నట్లు తెలిపారు.

News August 23, 2024

ఈనెల 27న కోటగుళ్లను సందర్శించనున్న గవర్నర్

image

ఈనెల 27న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండల కేంద్రంలోని భవానీ సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లను సందర్శించనున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా 3 రోజులపాటు చారిత్రక కట్టడాలను సందర్శించనున్నారు. ఆ రోజున మధ్యాహ్నం 3 గంటల నుంచి జయశంకర్ జిల్లా గణపురం మండలం కోటగుళ్లలో గవర్నర్ పర్యటన కొనసాగనుంది.

News August 23, 2024

HYD: ఆయన జీవితం స్ఫూర్తిదాయకం: మాజీ ఉప రాష్ట్రపతి

image

స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి సందర్భంగా HYDలోని శాసనసభ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుష్పాంజలి ఘటించారు. సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో ఆంగ్లేయ సాయుధ బలగాలకు గుండెలు చూపిస్తూ ధైర్యం ఉంటే కాల్చుకోండి అని సింహంలా గర్జించి ఆంధ్ర కేసరిగా సుప్రసిద్ధులైన శ్రీ ప్రకాశం పంతులు జీవితం స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు.

కేసముద్రం వ్యవసాయ మార్కెట్ లో ఈరోజు ధరలు

image

కేసముద్రం వ్యవసాయ మార్కెట్ లో శుక్రవారం ఉత్పత్తుల ధరలు క్రింది విధంగా ఉన్నాయి.
✓ ధాన్యం(JSR): గరిష్ఠం: 3414. కనిష్ఠం: 2721.
✓ ధాన్యం(RNR): గరిష్ఠం: 2678. కనిష్ఠం: 2459.
✓ పత్తి: గరిష్ఠం: 7361. కనిష్ఠం: 4000.
✓ పేసర్లు: గరిష్ఠం: 6689. కనిష్ఠం: 3465.
✓ మక్కలు: గరిష్ఠం: 2406. కనిష్ఠం: 2406.
✓ పసుపు(గోల): గరిష్ఠం: 12,213. కనిష్ఠం: 12,213.
✓ పల్లికాయ: గరిష్ఠం: 2911. కనిష్ఠం: 2911.

News August 23, 2024

HYD: PPP పద్ధతిలో మెట్రో కట్టడం అసాధ్యం: MD

image

అభ్యుదయ కవి, తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ 70వ జన్మదినోత్సవం సందర్భంగా తెలుగు యూనివర్సిటీలో జరిగిన సభలో HYD మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రసంగించారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో మెట్రో ప్రాజెక్టు కట్టడం అసాధ్యం అన్నట్లుగా HMRL అధికారులు X వేదికగా తెలియజేశారు.

News August 23, 2024

BREAKING: HYD: ఏసీబీ వలకు చిక్కిన మరో అధికారిణి..!

image

HYDలో ACB ఆకస్మిక దాడులు కొనసాగిస్తోంది. నేడు నారాయణగూడ సర్కిల్ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారిణి బి.వసంత ఇందిరా రూ.35,000 లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కారు. ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు, నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. అకౌంట్లకు సంబంధించిన ఓ విషయమై ఆమె లంచం తీసుకున్నట్లుగా ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

వరంగల్ మార్కెట్‌కి 3 రోజుల సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వరుసగా 3 రోజుల సెలవులు రానున్నాయి. శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి 3 రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి మంగళవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.

News August 23, 2024

HYD: రూ.1,450తో మెట్రో డీలక్స్ నెలవారి బస్ పాస్

image

ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు మరోసారి మెట్రో డీలక్స్ నెలవారి బస్సు పాసు ప్రవేశపెట్టినట్లు గ్రేటర్ RTC ఈడీ వెంకటేశ్వర్లు ఈరోజు తెలిపారు. రూ.1450 చెల్లించి మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ మెట్రో ఎక్స్‌ప్రెస్(నాన్ఏసీ), ఆర్డినరీ బస్సుల్లో ప్రయాణించవచ్చన్నారు. రూ.5000తో పుష్పక్ ఏసీ,రూ.1900తో గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ,రూ.1300తో మెట్రో ఎక్స్‌ప్రెస్, రూ.1150తో సిటీ ఆర్డినరీ బస్ పాసులు ఉంటాయన్నారు.