India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశ్రాంత ఉద్యోగులకు జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్ త్వరితగతిన చెల్లించాలని ఎస్టీయూ నాయకులు జిల్లా ట్రెజరీ అధికారి నాగరాజును కోరారు. ఈమేరకు సోమవారం ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పిన్నింటి తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కోట శ్యామ్‌కుమార్ డీటీఓను కలిసి విన్నవించారు. అలాగే కులగణన సర్వేలో పాల్గొన్న సిబ్బంది డబ్బులు కూడా సకాలంలో చెల్లించాలని వారు కోరారు.

సమాజంలోని రుగ్మతలను ప్రశ్నించడానికి కార్టూన్ ఒక శక్తివంతమైన మాధ్యమమని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. సోమవారం ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన రెండు రోజుల వ్యంగ్య చిత్ర కళా శిక్షణను ఆమె ప్రారంభించారు. వేగవంతమైన ఈ ప్రపంచంలో తక్కువ సమయంలోనే లోతైన ప్రభావం చూపే శక్తి కార్టూన్లకు ఉందని, విద్యార్థులు ఈ కళను నేర్చుకోవాలని కలెక్టర్ సూచించారు.

రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీఐఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ డా. అవ్వారు వేణు కుమార్ డిమాండ్ చేశారు. మెదక్ పట్టణంలోని కేవల్ కిషన్ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల వాటా, ఆత్మగౌరవం కోసం పోరాడుతామన్నారు. త్వరలోనే మెదక్‌లో ఉమ్మడి జిల్లా స్థాయి ‘సామాజిక న్యాయ సభ’ను భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.

మెదక్ పట్టణంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ జరిగింది. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొని 346 సంఘాలకు రూ. 90.24 లక్షల చెక్కులతో పాటు చీరలను అందజేశారు. మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ రుణాలను చిన్న వ్యాపారాలు, పిల్లల చదువుల కోసం వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

సిటీ కుర్రాళ్ల సోషల్ లైఫ్ ఇప్పుడు రూటు మార్చింది. వీకెండ్ వస్తే కేవలం డాన్స్ ఫ్లోర్ల మీద స్టెప్పులేయడమే కాదు.. చేతిలో బీర్ గ్లాసు పట్టుకొని ‘స్ట్రింగ్ థియరీ’ వంటి కఠినమైన సైన్స్ ముచ్చట్లు వినడం ఇప్పుడు GEN-Zలో కొత్త క్రేజ్. ‘పింట్ ఆఫ్ వ్యూ’ వంటి ఈవెంట్లే దీనికి సాక్ష్యం. సైన్స్, హిస్టరీ, క్వాంటం ఫిజిక్స్ వంటి సీరియస్ విషయాలను చిల్ అవుతూ నేర్చుకోవడానికి మన HYD కుర్రాళ్లు బాగా ఇష్టపడుతున్నారు.

నల్గొండ జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల పరిధిలో మహిళా సంఘాలకు రూ.11.38 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసినట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా రుణాల పంపిణీ, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని కలెక్టర్ వివరించారు.

నల్గొండ జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సైన్స్ ప్రాక్టికల్ పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక్కో కళాశాలకు రూ.50,000 చొప్పున మొత్తం రూ.6.50 లక్షలను కేటాయించింది. ఈ పరికరాల సరఫరా కోసం అర్హులైన సంస్థల నుండి కొటేషన్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి తెలిపారు. ఆసక్తి గల వారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

వీణవంక మండలం చల్లూరులో అనుమతి పొంది, ఇప్పలపల్లి గ్రామ పరిధిలో ఇసుక తవ్వుతున్నారన్న ఆరోపణలు వాస్తవం కాదని విచారణ కమిటీ తేల్చింది. కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలతో ఏడుగురు సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. డీజీపీఎస్ సర్వే ప్రకారం చల్లూరు పరిధిలోనే మైనింగ్ జరిగిందని, ఇప్పలపల్లిలో అక్రమ తవ్వకాలు జరగలేదని నిర్ధారించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బావులను తొలగించారని, నిబంధనలు పాటించాలన్నారు.

మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.35,77,912 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాసరాజు, గ్రంథాలయ ఛైర్మన్ మల్లు నరసింహారెడ్డి, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

రిపబ్లిక్ డే ఏర్పాట్ల నేపథ్యంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను వాయిదా వేయాలని డీఈఓ కార్యాలయ ఏడీ అనురాధకు టీఎస్‌యూటీఎఫ్ (TSUTF) నాయకులు వినతిపత్రం ఇచ్చారు. దీనికి సానుకూలంగా స్పందించిన అధికారులు, వేడుకల అనంతరం సమావేశాలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం పట్ల యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, వెంకటేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.