Telangana

News August 23, 2024

మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి: సీపీ

image

మహిళలు, చిన్నారుల భద్రతకు అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నేరాల నియంత్రణకు ఉన్నతాధికారులు సైతం రాత్రుళ్లు పెట్రోలింగ్‌ నిర్వహిస్తు కింది స్థాయి సిబ్బంది పనితీరు పర్యవేక్షించాలని సీపీ తెలిపారు.

News August 23, 2024

వరంగల్ మార్కెట్లో చిరుధాన్యాల ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ ధర నిన్న రూ.5,850 పలకగా.. నేడు రూ.5910 పలికింది. నిన్న పచ్చి పల్లికాయ ధర రూ.4,250 ఉంటే.. నేడు రూ.3,900కి పడిపోయింది. మరోవైపు 5531 రకం మిర్చికి నిన్న రూ.12 వేల ధర రాగా, నేడు రూ. 500 పెరిగి, రూ.12,500 అయినట్లు వ్యాపారులు తెలిపారు.

News August 23, 2024

ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే చర్యలే: CP

image

U/S 163 BNSS ప్రకారం ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే చర్యలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ హెచ్చరించారు. రేపు ఛలో ఆర్మూర్ పేరిట రైతుల ఆందోళన నేపథ్యంలో CP శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆర్మూర్ డివిజన్ పరిధిలో సంబంధిత అధికారి నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే ప్రజలు ఏదైనా చట్టబద్ధమైన సమావేశాన్ని నిర్వహించాలన్నారు. ఈ ఉత్తర్వులు 25వ తేదీ ఉదయం వరకు అమల్లో ఉంటాయన్నారు.

News August 23, 2024

WGL: కొడుకు శవాన్ని చూసి.. తల్లి మృతి

image

కుమారుడు మృతిని తట్టుకోలేక పెంపుడు తల్లి మరణించిన ఘటన మహబూబాబాద్‌లో కంటతడి పెట్టించింది. స్థానికుల వివరాల ప్రకారం.. మున్సిపాలిటీలోని శనిగపురంలో మంద రవి(30) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. మృతిచెందాడు. కాగా అతని మృతదేహాన్ని చూసిన పెంపుడు తల్లి జ్యోతి గుండెపోటుతో మృతిచెందారు. తల్లి, కుమారుడు మరణవార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News August 23, 2024

HYDలో హత్యకు గురైన ఎర్రుపాలెం యువకుడు

image

ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెంకి చెందిన ఓ యువకుడు HYDలో దారుణ హత్యకు గురయ్యాడు. యువతి ప్రేమ విషయంలో ప్రశాంత్‌ను దుండగులు హత్య చేశారు. HYDబాలాపూర్‌లో మండి 37 హోటల్ వద్ద ప్రశాంత్‌ను కత్తితో పొడిచి దారుణంగా హతమార్చారు. కాగా హత్య చేసి పరారైన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో తల్లి గుండెలు పగిలేలా రోదించింది.

News August 23, 2024

వరంగల్ మార్కెట్లో క్వింటా మక్కలు రూ.2,805

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మక్కలకు అధిక ధర పలుకుతూనే ఉంది. మొన్న క్వింటా మక్కలు రూ.2,805 పలకగా.. గురువారం రూ.2,820 పలికి రికార్డు నమోదు చేసింది. అయితే ఈరోజు మళ్లీ స్వల్పంగా తగ్గి, రూ.2,805కి చేరిందని మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు. కాగా, మార్కెట్‌కు మొక్కజొన్న తీసుకొచ్చిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News August 23, 2024

ADB: ఈనెల 24న ఉమ్మడి జిల్లా టేబుల్ టెన్నిస్ పోటీలు

image

పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 24న అండర్-19 విభాగంలో బాలబాలికలకు ఉమ్మడి జిల్లా టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి బాబురావు తెలిపారు. జైపూర్ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఉదయం 10 గంటలకు పోటీలు ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు పోటీలకు హాజరు కావాలని, 1-1-2006 తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు.

News August 23, 2024

NZB: సెప్టెంబర్ 9లోగా దరఖాస్తు చేసుకోండి: DEO

image

జవహర్ నవోదయ విద్యాలయ నిజాంసాగర్‌లో 6వ తరగతిలో సీట్లకు ప్రవేశ పరీక్షల కోసం సెప్టెంబర్ 9లోగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నిజామాబాద్ DEO దుర్గాప్రసాద్ తెలిపారు. దరఖాస్తులను www.navodaya.gov.in, www.nvsadmission classnine.in వెబ్ సైట్ ద్వారా సమర్పించాలన్నారు. ఇతర వివరాల కోసం పాఠశాలలో సంప్రదించాలని సూచించారు.

News August 23, 2024

శాస్త్రవేత్తలు భారతదేశ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేయాలి : జూపల్లి

image

భవిష్యత్తులో ఇస్రో శాస్త్రవేత్తలు మరిన్ని ప్రయోగాలు చేసి దేశ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకాక్షించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవంగా సందర్భంగా పట్టణంలోని ఆయన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్ -3మిషన్ విజయం సందర్భంగా భారత ప్రభుత్వం ఆగస్టు 23ను జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించిన సంగతీ తెలిసిందే

News August 23, 2024

అధికారులు మీకు లంచం డిమాండ్ చేస్తే ఇలా చేయండి.!

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ప్రభుత్వ అధికారులు ఏమైనా పని కోసం లంచం అడిగితే వెంటనే ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు. డీఎస్పీ నెంబర్: 9154388981, అటు ఏసీబీ ఇన్స్పెక్టర్ ల నెంబర్లు: 9154388984, 9154388986, 915488987, టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేసి పిర్యాదు చేయాలన్నారు. పిర్యాదుదారుని వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు.