Telangana

News August 23, 2024

వరంగల్ మార్కెట్లో క్వింటా మక్కలు రూ.2,805

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మక్కలకు అధిక ధర పలుకుతూనే ఉంది. మొన్న క్వింటా మక్కలు రూ.2,805 పలకగా.. గురువారం రూ.2,820 పలికి రికార్డు నమోదు చేసింది. అయితే ఈరోజు మళ్లీ స్వల్పంగా తగ్గి, రూ.2,805కి చేరిందని మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు. కాగా, మార్కెట్‌కు మొక్కజొన్న తీసుకొచ్చిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News August 23, 2024

ADB: ఈనెల 24న ఉమ్మడి జిల్లా టేబుల్ టెన్నిస్ పోటీలు

image

పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 24న అండర్-19 విభాగంలో బాలబాలికలకు ఉమ్మడి జిల్లా టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి బాబురావు తెలిపారు. జైపూర్ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఉదయం 10 గంటలకు పోటీలు ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు పోటీలకు హాజరు కావాలని, 1-1-2006 తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు.

News August 23, 2024

NZB: సెప్టెంబర్ 9లోగా దరఖాస్తు చేసుకోండి: DEO

image

జవహర్ నవోదయ విద్యాలయ నిజాంసాగర్‌లో 6వ తరగతిలో సీట్లకు ప్రవేశ పరీక్షల కోసం సెప్టెంబర్ 9లోగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నిజామాబాద్ DEO దుర్గాప్రసాద్ తెలిపారు. దరఖాస్తులను www.navodaya.gov.in, www.nvsadmission classnine.in వెబ్ సైట్ ద్వారా సమర్పించాలన్నారు. ఇతర వివరాల కోసం పాఠశాలలో సంప్రదించాలని సూచించారు.

News August 23, 2024

శాస్త్రవేత్తలు భారతదేశ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేయాలి : జూపల్లి

image

భవిష్యత్తులో ఇస్రో శాస్త్రవేత్తలు మరిన్ని ప్రయోగాలు చేసి దేశ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకాక్షించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవంగా సందర్భంగా పట్టణంలోని ఆయన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్ -3మిషన్ విజయం సందర్భంగా భారత ప్రభుత్వం ఆగస్టు 23ను జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించిన సంగతీ తెలిసిందే

News August 23, 2024

అధికారులు మీకు లంచం డిమాండ్ చేస్తే ఇలా చేయండి.!

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ప్రభుత్వ అధికారులు ఏమైనా పని కోసం లంచం అడిగితే వెంటనే ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు. డీఎస్పీ నెంబర్: 9154388981, అటు ఏసీబీ ఇన్స్పెక్టర్ ల నెంబర్లు: 9154388984, 9154388986, 915488987, టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేసి పిర్యాదు చేయాలన్నారు. పిర్యాదుదారుని వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు.

News August 23, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కొత్త నమూనా

image

ప్రధాన మార్కెట్లో ఒకటి ఖమ్మం వ్యవసాయ మార్కెట్. 1954లో 15.28 ఎకరాల్లో ఈ మార్కెట్‌ను ప్రారంభించారు. పెరిగిన క్రయవిక్రయాలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సౌకర్యాలతో, విశాలమైన షెడ్లు, గోదాములు, శీతల గిడ్డంగులతో దేశంలోనే అతిపెద్ద హరిత మార్కెట్‌‌గా త్వరలోనే నిర్మాణం చేపట్టనుండగా మార్కెట్ నమూనా బయటకొచ్చింది. రూ.148 కోట్ల అంచనాతో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

News August 23, 2024

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నేటి వర్షపాతం వివరాలు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా… అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా అడ్డాకులలో 70.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా పెబ్బేరులో 59.0 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా బీచుపల్లి 40.1 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా గుండుమల్లో 38.3 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లా పెద్దముద్దునూరు 35.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News August 23, 2024

HYD: వరద నీటికి అడ్డుకట్ట.. ఈ ప్రాంతాల్లో సంపులు!

image

HYD నగరంలో వరద నీటికి అడ్డుకట్ట వేసేందుకు GHMC రోడ్ల పరిసరాల్లో సంపుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. PVNR పిల్లర్ నంబర్-264, నేతాజీ నగర్, రంగ మహల్ జంక్షన్, సోమాజిగూడ ఇమేజ్ ఆసుపత్రి, సోమాజిగూడ జోయ్ ఆలుకాస్, రాజీవ్ గాంధీ విగ్రహం, లక్డీకపూల్ ద్వారక హోటల్, ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్, అయ్యప్ప సోసైటీ చెక్ పోస్ట్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్, ఓల్డ్ కేసీపీ ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు.

News August 23, 2024

HYD: వరద నీటికి అడ్డుకట్ట.. ఈ ప్రాంతాల్లో సంపులు!

image

HYD నగరంలో వరద నీటికి అడ్డుకట్ట వేసేందుకు GHMC రోడ్ల పరిసరాల్లో సంపుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. PVNR పిల్లర్ నంబర్-264, నేతాజీ నగర్, రంగ మహల్ జంక్షన్, సోమాజిగూడ ఇమేజ్ ఆసుపత్రి, సోమాజిగూడ జోయ్ ఆలుకాస్, రాజీవ్ గాంధీ విగ్రహం, లక్డీకపూల్ ద్వారక హోటల్, ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్, అయ్యప్ప సోసైటీ చెక్ పోస్ట్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్, ఓల్డ్ కేసీపీ ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు.

News August 23, 2024

పెద్దపల్లి: ప్రతి ఇంట్లో పేషంట్లే!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో చికున్ గున్యా పంజా విసురుతోంది. ఇంట్లో ఒకరికి వచ్చిందంటే మిగతా వాళ్లందరికీ జ్వరం వస్తోంది. కీళ్ల నొప్పులతో మంచం పట్టి, లేవలేని పరిస్థితి. ప్రతి ఇంట్లో జ్వర పీడితులు ఉన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆసుపత్రిలో ప్రతిరోజూ 60 నుంచి 70 మందికి రక్త పరీక్షలు చేస్తున్నారు.