Telangana

News August 23, 2024

MGM వద్ద పారిశుద్ధ్య కార్మికుడికి దొరికిన తుపాకీ

image

వరంగల్ MGM కూడలిలో పారిశుద్ధ్య కార్మికుడికి తుపాకీ దొరికింది. కాగా, దాన్ని ఎస్‌ఎల్ఆర్ఎన్ గన్‌గా పోలీసులు గుర్తించారు. తుపాకీని నగరపాలక సంస్థ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేకి కార్మికుడు అప్పగించడంతో.. కమిషనర్ ఆ విషయాన్ని పోలీసులకు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 23, 2024

HYD: గాంధీ, ఈఎస్ఐసీని ప్రశంసించిన ఐసీఎంఆర్

image

కరోనా కష్టకాలంలో రోగులకు సేవలందించిన గాంధీ మెడికల్ కాలేజీ, సనత్ నగర్ ఈఎస్ఐసీ ఆస్పత్రులను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రశంసలతో ముంచెత్తింది. గురువారం ఢిల్లీ క్లినికల్ రిజిస్ట్రీ ఫర్ కొవిడ్-19 రిపోర్టు రిలీజ్ అండ్ డిస్సెమినేషన్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో గాంధీ ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు, ప్రొఫెసర్ త్రిలోక్ చందర్‌ను సన్మానించి, ప్రశంసాపత్రాలను అందజేశారు.

News August 23, 2024

HYD: గాంధీ, ఈఎస్ఐసీని ప్రశంసించిన ఐసీఎంఆర్

image

కరోనా కష్టకాలంలో రోగులకు సేవలందించిన గాంధీ మెడికల్ కాలేజీ, సనత్ నగర్ ఈఎస్ఐసీ ఆస్పత్రులను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రశంసలతో ముంచెత్తింది. గురువారం ఢిల్లీ క్లినికల్ రిజిస్ట్రీ ఫర్ కొవిడ్-19 రిపోర్టు రిలీజ్ అండ్ డిస్సెమినేషన్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో గాంధీ ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు, ప్రొఫెసర్ త్రిలోక్ చందర్‌ను సన్మానించి, ప్రశంసాపత్రాలను అందజేశారు.

News August 23, 2024

బాలాపూర్‌: బీటెక్ స్టూడెంట్ ప్రశాంత్ హత్య కేసులో పురోగతి

image

బాలాపూర్‌లో బీటెక్ స్టూడెంట్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో పక్కా ప్లాన్ చేసి మరీ ప్రశాంత్‌ని హత్య చేసినట్లు గుర్తించారు. హంతకులు అంతా ఒకే బస్తీకి చెందిన వారు అని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో దొరికిన సీసీ ఫుటేజ్ ద్వారా మూడు గంటల్లో నిందితులకు చెక్ పెట్టినట్లు పోలీసులు తెలిపారు.

News August 23, 2024

నిర్మల్: ఉపాధి కోసం వెళ్తే.. ఉసురు పోతోంది

image

నిర్మల్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు ఎక్కువగా వలస పోతుంటారు. అయితే నిరుద్యోగులుగా వెళ్తున్న కొందరు నిర్జీవంగా తిరిగివస్తున్నారు. జిల్లాలోని 19 మండలాల పరిధిలో సుమారుగా 40 వేల మంది ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టారు. కాగా ఈ ఏడాదిలోనే 20 మంది వివిధ కారణాలతో గల్ఫ్‌లో మరణించడంతో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇటీవల భైంసా మండలానికి చెందిన ఇద్దరు మరణించడం ఆందోళన కలిగిస్తోంది.

News August 23, 2024

కంది: ఐఐటీహెచ్ విన్నూత్న డ్రోన్ తయారీ

image

సంగారెడ్డి జిల్లా కంది IITHలోని ‘టీహాన్‌’ (టెక్నాలజీ ఇన్నోవేషన్‌ హబ్‌ ఇన్‌ అటానమస్‌ నావిగేషన్‌) విభాగం టెక్నాలజీ ఈ-ఫ్లాపింగ్‌ వింగ్స్‌ డ్రోన్లను ప్రయోగాత్మకంగా గాల్లోకి ఎగురవేసి పరీక్షించింది. ఇవి కొండలు, గుట్టలపై, అటవీ ప్రాంతాల్లో జీపీఎస్‌తో నిర్దేశిత లక్ష్యానికి చేరగలదు. వీటి మార్గంలో ఏవైనా అడ్డం వస్తే సెన్సార్లు పసిగడతాయి. ఆటోమేటిక్‌గా ఆ డ్రోన్‌ తిరిగి మళ్లీ ఆపరేటర్‌ దగ్గరకు వచ్చిచేరుతోంది.

News August 23, 2024

బీర్ బాటిల్‌తో ఆర్టీసీ బస్సుపై దాడి

image

గుంటూరు నుంచి భద్రాచలం వెళ్తున్న కొత్తగూడెం డిపోకి చెందిన డీలక్స్ బస్సుపైకి మందుబాబులు బీరు బాటిల్ విసిరారని ప్రయాణికులు తెలిపారు. V.M బంజార సమీపంలో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. బాటిల్ విండో గ్లాస్‌కు తగిలి సీట్లో కూర్చున్న మహిళ కంటికి గాయమైంది. ఆమెను V.M బంజార ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు V.M బంజర పోలీసులు తెలిపారు.

News August 23, 2024

KNR: శిలాఫలకంపై ఎంపీ పేరు ఏది!

image

మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ప్రారంభించిన జీడికే -5 ఓసీపీ సైట్ ఆఫీస్ భవన ప్రారంభోత్సవ శిలాఫలకంపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. శిలాఫలకం ప్రారంభించే వరకు అందులో ఎంపీ పేరులేదన్న విషయం ఎవరికీ తెలియలేదు. శిలాఫలకంపై తన పేరు లేకపోవడాన్ని గుర్తించిన ఎంపీ.. సింగరేణి అధికారులను ఆరాతీసినట్లు సమాచారం.

News August 23, 2024

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 51.02 టీఎంసీల నీరు నిలువ

image

ఎగువ కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ ప్రాజెక్టులో నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 1082.10 అడుగులు, 80.5 టీఎంసీలు ఉండగా ప్రాజెక్టులో 4,717 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. అవుట్ ఫ్లో 4,717 క్యూసెక్కులు కాగా.. ప్రస్తుతం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టులో 51.02 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వివిధ అవసరాల కోసం ప్రాజెక్ట్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

News August 23, 2024

NLG: హిజ్రాల ఆగడాలు.. పైసలివ్వకుంటే బూతులు

image

నల్గొండ జిల్లాలో హిజ్రాల ఆగడాలు శ్రుతి మించుతున్నాయి. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో టోల్ ప్లాజాల వద్ద హిజ్రాలు తిష్ట వేసి తమను బెదిరించి రూ.50 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే దుర్భాషలాడుతున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు స్పందించి వసూళ్లకు పాల్పడుతున్న హిజ్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.