Telangana

News August 23, 2024

మంచిర్యాల: కొడుకును చూడటానికి వెళ్తూ తండ్రి మృతి

image

RTC బస్సు ఢీకొని పెద్దపల్లి జిల్లా ఓదెలలో సింగరేణి ఉద్యోగి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన రంజిత్‌కుమార్(39)కు 14 ఏళ్ల క్రితం ఓదెలకు చెందిన రజితతో పెళ్లయింది. వారికి నెల క్రితమే ఓ బాబు పుట్టాడు. అయితే సుల్తానాబాద్‌లో ఓ శుభకార్యానికి హాజరై.. అత్తగారింటి వద్ద ఉన్న భార్య, కొడుకును చూడటానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొని మృతి చెందాడు.

News August 23, 2024

NZB: మూడేళ్లలో మురుగుకాలువల్లో పడి ముగ్గురు మృతి

image

ఈ నెల 21న నిజామాబాద్‌లోని ఆనంద్‌నగర్ కాలనీలో మూడేళ్ల చిన్నారి అనన్య మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా గత మూడేళ్లలో కాలువలో పడి మృతి చెందిన వారి సంఖ్య మూడుకి చేరింది. 2023లో గౌతంనగర్‌లో 70 ఏళ్ల వృద్ధురాలు, 2022లో అదే కాలనీకి చెందిన 8 ఏళ్ల బాలుడు మురుగు కాలువలో పడి మృతి చెందాడు.

News August 23, 2024

వరంగల్: డ్రంక్ అండ్ డ్రైవ్.. 8 మందికి జరిమానా

image

మద్యం తాగి వాహనం నడిపిన కేసుల్లో 8 మంది వాహనదారులకు వరంగల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గుర్రపు వీరస్వామి జరిమానా విధించినట్లు వరంగల్ ట్రాఫిక్ సీఐ రామకృష్ణ గురువారం తెలిపారు. అలాగే మద్యం తాగి వాహనం నడిపి ట్రాఫిక్ పోలీసులకు పట్టుపడ్డ 8 మంది వాహనదారులకు రూ.17,800 జరిమానా విధించారు.

News August 23, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్ల సమీక్ష సమావేశం
∆} వైరాలో వృద్ధులకు ఉచిత వైద్య శిబిరం
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పర్యటన
∆} ముదిగొండలో ఇంటింటి ఓటర్ సర్వే

News August 23, 2024

టేక్మాల్: తల్లి మృతిని తట్టుకోలేక కూతురి సూసైడ్

image

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన టేక్మాల్ మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. పాపన్నపేట ASI సంగన్న వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్నకూతురు(14) 8వ తరగది చదుతోంది. కాగా, 9నెలల క్రితం తల్లి అనారోగ్యంతో మృతి చెందగా అప్పటి నుంచి తల్లిని గుర్తు చేసుకుంటూ బాధపడుతుండేది. బుధవారం మనస్తాపానికి గురై ఉరేసుకుంది. గురువారం తండ్రి ఫిర్యాదులో కేసు నమోదైంది.

News August 23, 2024

PDPL: కొడుకును చూడటానికి వెళ్తూ తండ్రి మృతి

image

RTC బస్సు ఢీకొని PDPL జిల్లా ఓదెల మండలంలో <<13918308>>సింగరేణి ఉద్యోగి మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. పోత్కపల్లి పోలీసుల ప్రకారం.. మంచిర్యాల జిల్లాకు చెందిన రంజిత్‌కుమార్(39)కు 14 ఏళ్ల క్రితం ఓదెల మండలానికి చెందిన రజితతో పెళ్లయింది. వీరికి నెల క్రితమే ఓ బాబు పుట్టాడు. అయితే సుల్తానాబాద్‌లో ఓ శుభకార్యానికి హాజరై.. అత్తగారింటి వద్ద ఉన్న భార్య, కొడుకును చూడటానికి వెళ్తుండగా బస్సును ఎదురుగా ఢీకొని మృతి చెందాడు.

News August 23, 2024

వరంగల్ నగరంలో దొంగల ముఠా: సీఐ గోపి

image

వరంగల్ నగరంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా ప్రవేశించినట్లు తెలిసిందని మట్టెవాడ సీఐ తుమ్మ గోపి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అనుమానిత అపరిచితులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపార్ట్‌మెంట్లలో నివసించే ప్రజలందరూ సీసీ కెమెరాల పనితీరును సరి చేసుకోవాలని సూచించారు. అనుమానంగా కనిపిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.

News August 23, 2024

రియాక్టర్ పేలుడు ఘటనలో భద్రాద్రి జిల్లా వాసి మృతి

image

ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం వద్ద గల ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ప్రమాద ఘటనలో అశ్వారావుపేట మండలం గంగారం గ్రామానికి చెందిన మార్ని సురేంద్ర(37) మృతి చెందడంతో స్వగ్రామంలో విషాదం నెలకొంది. సురేంద్ర గాజువాకలో నివాసం ఉంటూ తొమ్మిదేళ్లుగా అచ్యుతాపురంలో గల ఫార్మా సెజ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. రియాక్టర్ పేలుడు ప్రమాదంలో చిక్కుకుని దుర్మరణం చెందాడు.

News August 23, 2024

HYD: ఐఐటీహెచ్‌లో బాహుబలి డ్రోన్ తయారీ!

image

విపత్తుల సమయంలో బాధితులకు సాయం అందించడం సవాళ్లతో కూడుకున్న పని, చాలాసార్లు హెలికాప్టర్ వెళ్లలేని ప్రాంతాలు సైతం ఉంటాయి. ఇలాంటి పరిస్థితులను ధీటుగా ఎదుర్కొనేందుకు ఐఐటీ హైదరాబాద్ చేపట్టిన డ్రోన్ల తయారీ ప్రాజెక్టు తుది దశకు చేరింది. ఇప్పటికే 60 కిలోల బరువు తీసుకువెళ్లే డ్రోన్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశారు. తాజాగా 100 కిలోల బరువును అవలీలగా తరలించే ప్రాజెక్టు ప్రయోగ దశలో ఉంది.

News August 23, 2024

HYD: ఎంపాక్స్ ఎఫెక్ట్.. గాంధీలో ప్రత్యేక వార్డులు

image

ప్రపంచవ్యాప్తంగా ఎంపాక్స్ (మంకీపాక్స్) అలజడి రేకెత్తిస్తున్న నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే గాంధీ, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రులను సిద్ధం చేసింది. అక్కడ ప్రత్యేక వార్డులు నెలకొల్పింది. గాంధీలో 20 పడకలు కేటాయించారు. ఇందులో పురుషులకు, మహిళలకు పదేసి పడకలు కేటాయించినట్లు గాంధీ వైద్యులు పేర్కొన్నారు. ఫీవర్ ఆసుపత్రిలో ఆరు పడకలు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు.