Telangana

News August 23, 2024

HYD: ఎంపాక్స్ ఎఫెక్ట్.. గాంధీలో ప్రత్యేక వార్డులు

image

ప్రపంచవ్యాప్తంగా ఎంపాక్స్ (మంకీపాక్స్) అలజడి రేకెత్తిస్తున్న నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే గాంధీ, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రులను సిద్ధం చేసింది. అక్కడ ప్రత్యేక వార్డులు నెలకొల్పింది. గాంధీలో 20 పడకలు కేటాయించారు. ఇందులో పురుషులకు, మహిళలకు పదేసి పడకలు కేటాయించినట్లు గాంధీ వైద్యులు పేర్కొన్నారు. ఫీవర్ ఆసుపత్రిలో ఆరు పడకలు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు.

News August 23, 2024

బండిని విమర్శించిన హరీశ్.. నేడు యాదగిరికి ఎందుకు వెళ్లాడు: ఎంపీ 

image

మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ యాదగిరిగుట్టకు పోదామని హరీశ్ రావుకు సవాల్ విసిరితే వంకరగా మాట్లాడిన ఆయన నేడు యాదాద్రికి ఎందుకు వెళ్లాడని మెదక్ MP రఘునందన్ రావు ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. హరీశ్ రావు తీరును ఎండగట్టారు. అధికారం కోల్పోయి, పదవి ఊడిపోవడంతో ఇప్పుడు ఆయనకు దేవుళ్లు గుర్తొస్తున్నారా అని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు.

News August 23, 2024

మెదక్: గృహలక్ష్మికి మరో అవకాశం

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో మండల గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిందని అధికారులు తెలిపారు. కరెంట్ బిల్లు, ప్రజాపాలన దరఖాస్తు రసీదు, రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డులతో మండల పరిషత్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 

News August 23, 2024

కామారెడ్డి జిల్లాలో 12,603 కుక్కలు 

image

ఈ మధ్య కాలంలో జిల్లాలో వీధి కుక్కల దాడులు ఎక్కువవుతున్న నేపథ్యంలో జిల్లాలోని 526 గ్రామపంచాయతీల్లో అధికారులు సర్వే నిర్వహించి కుక్కలను లెక్కించారు. పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ సర్వేలో పాల్గొన్నారు. 22 మండలాల్లో 12,603 కుక్కలు ఉన్నట్లు గుర్తించారు. సంతాన నిరోధానికి ఆడ కుక్కలకు శస్త్ర చికిత్సలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

News August 23, 2024

ఆదిలాబాద్ జిల్లాలో మహిళలపై పెరుగుతున్న దాడులు

image

ఆదిలాబాద్ జిల్లాలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారం, వేధింపుల కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. జిల్లాలో ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. మహిళలపై వేధింపులకు సంబంధించి ఈఏడాది ఇప్పటి వరకు 160 వరకు కేసులు నమోదయ్యాయి. గతేడాది 14 కేసుల్లో, ఈయేడు మూడు కేసులకు సంబంధించి నిందితులకు కోర్టు శిక్ష విధించింది.

News August 23, 2024

ఖమ్మం: 1,73,329 మందికి రుణామాఫీ

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 1,73,329 మందికి రుణామాఫీ జరిగింది. ఖమ్మం జిల్లాలో 1,15,346మందికి, భద్రాద్రి జిల్లాలో 57,983 మంది రైతులకు రుణం మాఫీ అయింది. ఉమ్మడి జిల్లాలో ఇంకా 8వేల మందికి పైగా అర్హత ఉన్నా రుణమాఫీ జరగలేదు. కొత్త రుణాల జారీ ప్రక్రియలో తీవ్ర జాప్యం ఉంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News August 23, 2024

వసతి గృహాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ 

image

వసతిగృహాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో అధికారులను ఆదేశించారు. ఈమేరకు గురువారం జిల్లా కలెక్టరేట్లో అధికారులతో విషజ్వరాలు, వసతిగృహాల పరిశుభ్రత, శానిటేషన్‌పై సమీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. జిల్లాలో 4 మున్సిపల్ పరిధి, గ్రామ స్థాయిలలో విషజ్వరాలు డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా అధికారులంతా సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకోవాలన్నారు.

News August 23, 2024

MLA చొరవతో అభివృద్ధికి నిధులు మంజూరు: మేయర్

image

MLA రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ చొరవతో రామగుండం అభివృద్ధికి నిధులు విడుదల అయ్యాయని నగర మేయర్ డా.బంగి అనిల్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిధులు రాక పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయని పేర్కొన్నారు. నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు సహకరించాలని అన్నారు. వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేసుకోవడం సరైంది కాదన్నారు.

News August 23, 2024

HYD: ధరణి సమస్య.. తలకిందులుగా నిరసన చేసిన బాధితుడు

image

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహశీల్దార్ కార్యాలయంలో ఓ వ్యక్తి తన భూమికి సంబంధించి ధరణి సమస్య పరిష్కారం కాకపోవడంతో తలకిందులుగా నిరసన చేశాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాధితుడు చేసిన పనికి తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు, కార్యాలయ అధికారులు అవాక్కయ్యారు.

News August 23, 2024

నల్గొండ: భారీగా పెరుగుతోన్న వైరల్ ఫీవర్స్

image

వాతావరణంలో మార్పులు, అధ్వానపు పారిశుద్ధ్య పరిస్థితులతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నల్గొండ, సూర్యాపేటల్లోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రులు, భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో ఈ ఏడాది 416 డెంగ్యూ కేసులు నమోదు కాగా.. నల్గొండ జిల్లాలో 340 కేసులు నమోదైనట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.