Telangana

News March 24, 2024

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు ఛాయలు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. సాగు నీరు లేక ఇప్పటికే లక్ష ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయాయి. నేలలు నెర్ర బారగా.. వరి పంట పశుగ్రాసంగా మారింది. సాగర్ లో నీటి లభ్యత లేకపోవడంతో ఆయకట్టు అంతా ఇదే పరిస్థితి నెలకొంది. భూగర్భ జలాలు పడిపోవడంతో బోరుబావులు అడగంటాయి. దీంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

News March 24, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} భద్రాచలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం పర్యటన
∆} సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన

News March 24, 2024

మహబూబ్ నగర్: విస్తరిస్తున్న క్షయ మహమ్మారి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా క్షయ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. 2022లో  జిల్లాలో క్షయ బాధితులు 7,187 మంది ఉండగా.. 2024లో ఇప్పటి వరకు 8,612 మంది రోగులు నమోదయ్యారు. ఒక్క ఏడాదిలోనే వారి సంఖ్య 1,425 మంది పెరిగింది. ప్రభుత్వాసుపత్రుల్లో 80 శాతం కేసులు వస్తుండగా,  ప్రైవేట్ ఆసుపత్రుల్లో 20 శాతం మంది చికిత్స పొందుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 క్షయ యూనిట్ల ఆసుపత్రులు ఉన్నాయి.

News March 24, 2024

KTDM: ప్రేమ వివాహం చేసుకుందని బ్లేడుతో దాడి

image

కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెపై తండ్రి దాడి చేసిన ఘటనపై బూర్గంపాడు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించి ఈనెల 11న కులాంతర వివాహం చేసుకుంది. ఈ క్రమంలో యువతి తండ్రి కుమార్తెను చూడడానికి వెళ్లి ఒక్కసారిగా తనతో తెచ్చుకున్న బ్లేడుతో దాడి చేశాడు. గాయపడిన బాధితురాలు పోలీసుల ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేశారు.

News March 24, 2024

జగిత్యాల: అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష

image

గొల్లపల్లి మండలం దట్నూరుకు చెందిన హరికృష్ణ A/S హరీష్ కిరాణం నిర్వహిస్తుండేవాడు. సరుకుల కోసం వచ్చే బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పగా 2022 ఏప్రిల్ 7న పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. శనివారం నేరం రుజువు కావడంతో JGL న్యాయమూర్తి నీలిమ ఒక్కోకేసులో 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమానా, ముగ్గురు బాలికలకు 5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పారు.

News March 24, 2024

వరంగల్: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పర్వతగిరి మండలం ముంజలకుంటతండాకి చెందిన రమావత్ వెంకన్న కొత్త ఇంటికి అవసరం నిమిత్తం శనివారం మోటార్‌ను బిగిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కరెంటు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకన్న భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకన్న కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం MGMకు తరలించారు.

News March 24, 2024

HYD: పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.70 లక్షల టోకరా

image

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ వద్ద నుంచి రూ.70 లక్షలు వసూలు చేసి మోసగించిన వ్యక్తిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లాకు చెందిన ద్రొనదుల రాజేశ్‌(40) ఆన్‌లైన్‌ ట్రేడర్‌. మ్యాట్రిమోని ద్వారా ఓ మహిళను పరిచయం చేసుకున్న ఇతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.70 లక్షలు తీసుకొని ముఖం చాటేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.

News March 24, 2024

HYD: పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.70 లక్షల టోకరా

image

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ వద్ద నుంచి రూ.70 లక్షలు వసూలు చేసి మోసగించిన వ్యక్తిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లాకు చెందిన ద్రొనదుల రాజేశ్‌(40) ఆన్‌లైన్‌ ట్రేడర్‌. మ్యాట్రిమోని ద్వారా ఓ మహిళను పరిచయం చేసుకున్న ఇతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.70 లక్షలు తీసుకొని ముఖం చాటేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.

News March 24, 2024

నాగర్ కర్నూల్: సీసీటీవీ ఫుటేజీతో.. హత్య కేసును ఛేదించిన పోలీసులు

image

ఓ మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. SP వివరాల ప్రకారం.. తెల్కపల్లి మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన లలిత(40) భర్త చనిపోయి ఒంటరిగా ఉంటుంది. లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన శివుడుతో పరిచయం ఏర్పడింది. ఈనెల 13న బల్మూరు మండలం మైలారం గ్రామ శివారులో ఇద్దరు కలిసి మద్యం తాగారు. శివుడు తాగిన మైకంలో ఆమెను హత్య చేసి నగలు దోచుకెళ్లాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు నిందితుడిని గుర్తించారు.

News March 24, 2024

NZB: పట్టపగలే పోలీస్ ఇంట్లో చోరీ

image

నిజామాబాద్‌లో దొంగలు ఏకంగా ఓ పోలీసు ఇంటికే కన్నం వేశారు. ఎనిమిది తులాల బంగారు నగలు దోచుకెళ్లారు. కమిషనరేట్‌లోని ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న సాయన్న గూపన్ పల్లిలో నివాసం ఉంటున్నారు. ఆయన ఉదయం విధులకు వెళ్లగా.. కుటుంబీకులు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంట్లోకి చొరబడి ఎనిమిది తులాల బంగారు గొలుసు లను అపహరించుకు వెళ్లారు. రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.