India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తల్లిదండ్రులు మందలించారని ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన NGKL జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. తెల్కపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మార్కులు ముఖ్యం కాదని విద్యార్థులకు తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలని నిపుణులు చెబుతున్నారు.
కరీంనగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా తిమ్మాపూర్ మండలంలో 44.7°C నమోదు కాగా, మానకొండూర్ 44.6, జమ్మికుంట 44.5, రామడుగు 44.4, చొప్పదండి 44.2, కరీంనగర్ 44.1, చిగురుమామిడి, కరీంనగర్ రూరల్ 44.0, వీణవంక, గంగాధర 43.9, శంకరపట్నం 43.4, గన్నేరువరం 43.3, కొత్తపల్లి, ఇల్లందకుంట 43.1, హుజూరాబాద్ 42.4, సైదాపూర్ 41.9°C గా నమోదైంది.
ఉమ్మడి ADB జిల్లాలో ఏప్రిల్ చివరి వారంలోనే సుమారు 40 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే 3 రోజులపాటు తీవ్ర వడగాలులతో పాటు ఉక్కపోత ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ADB, NRML, MNCL, ASF జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చేసుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. మేలో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండండి.
నారాయణఖేడ్ మండలం జి.హుక్రానాలో బుధవారం విద్యుత్ షాక్‌తో మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హనుమారెడ్డి భార్య రావుల స్వప్న (40) బట్టలు ఉతికి ఆరేస్తున్న సమయంలో విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురైంది. దీంతో తీవ్ర గాయాల పాలైన స్వప్నను నారాయణఖేడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
వరంగల్ సభను బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈనెల 27న జరిగే పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు ఉమ్మడి జిల్లా నుంచి లక్ష మందిని తరలించేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. వరంగల్‌కు సమీప నియోజకవర్గాలైన ఆలేరు, భువనగిరి, సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాల నుంచి 12,500 మంది చొప్పున 50 వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పార్టీ నేతలు తెలిపారు.
భానుడి భగభగలతో ఉమ్మడి జిల్లా నిప్పుల కుంపటిలా మారింది. రోజురోజుకు ఎండల తీవ్రత అధికమవుతోంది. వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా చిలుకూరులో ఉపాధి కూలీ కొడారు కోటయ్య (62) మృతి చెందారు. ఇటీవల పానగల్‌కు చెందిన కస్పరాలు కనకయ్య, కేతేపల్లి మండలం తుంగతుర్తి వాసి గుంటి వెంకటరమణ వడదెబ్బతో మృతిచెందారు. ఎండలకు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి వచ్చిన ఓ వ్యక్తి సంపులో పడి మృతిచెందాడు. కాచిగూడకు చెందిన బి.బాలాజీ (48) కుటుంబ సభ్యులతో కలిసి ఎల్లమ్మ ఆలయానికి వచ్చాడు. అక్కడ నీటి సంపులో ఫోన్ పడిపోయింది. ఫోన్ తీసేందుకు యత్నించి సంపులో పడిపోయాడు. సిబ్బంది నిచ్చెన సాయంతో బాలాజీని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రోజురోజుకు ఎండలు భగ్గుమంటున్నాయి. తొలిసారి ఏప్రిల్ నెలలోనే అత్యధికంగా 43 డిగ్రీలపైగా ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న వనపర్తి, గద్వాల జిల్లాల్లో 43 డిగ్రీలు, నారాయణపేట 42.4, నాగర్ కర్నూల్ 42.1, మహబూబ్‌నగర్‌లో 42 డిగ్రీలు నమోదైంది. మున్నుందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని, జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది.
KNR, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో రికార్డు స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే 3 రోజులపాటు తీవ్ర వడగాలులతోపాటు ఉక్కపోత ఉంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చేసుకోవాలని ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు సూచన చేస్తున్నారు. మే నెలలో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
HNK ఆర్ట్స్ కాలేజీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతిచెందాడు. పోలీసుల ప్రకారం.. హసన్‌పర్తి(M) కోమటిపల్లికి చెందిన అభిషేక్(18) ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి, కారులో స్నేహితులతో బయటికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బుధవారం తెల్లవారుజామున కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో అభిషేక్ స్పాట్‌లోనే మృతిచెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి.
Sorry, no posts matched your criteria.