Telangana

News March 23, 2024

ADB: నేటితో ముగియనున్న గురుకులాల దరఖాస్తు ప్రక్రియ

image

తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 6, 7, 8, 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ కొరకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా గురుకుల విద్యాలయాల సెక్రటరీ సీతాలక్ష్మీ వెల్లడించారు. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News March 23, 2024

భువనగిరిపై వీడని పీటముడి!

image

కాంగ్రెస్‌ భువనగిరి ఎంపీ స్థానంపై పీటముడి ఇప్పట్లో వీడేల లేదు. ఇక్కడి నుంచి పోటీకి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు ఉన్నతస్థాయిలో చర్చలు సైతం పూర్తయ్యాయని విశ్వసనీయ సమాచారం. దీంతో ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కిరణ్‌కుమార్‌రెడ్డికి వస్తుందా? లేదా పార్టీలోని మరో ప్రజాప్రతినిధికి వస్తుందా? అన్నది తేలాల్సి ఉంది.

News March 23, 2024

సిద్దిపేట: పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలి: ఐజీ

image

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మల్టీ జోన్-I ఏ.వి రంగనాథ్ సూచించారు. కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీస్ అధికారులతో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించడానికి అధికారులందరూ సమష్టిగా విధులు నిర్వహించాలన్నారు.

News March 23, 2024

వరంగల్: కాంగ్రెస్, బీజేపీ ఎంపీ అభ్యర్థులపై సస్పెన్స్!

image

వరంగల్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపై సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీ మాత్రం తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. అయితే ఇక్కడ మాజీ MLA ఆరూరి రమేశ్‌ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. దీంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆసక్తిగా ఎదురుచూసున్నారు. మీ కామెంట్?

News March 23, 2024

ASF: ఈ నెల 19 మిస్సింగ్.. ప్రాజెక్ట్‌లో మృతదేహాం లభ్యం

image

ఆసిఫాబాద్‌లోని అడా ప్రాజెక్టులో ఈరోజు ఓ వ్యక్తి మృతదేహాం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. తెల్లారం కంచరగూడ గ్రామానికి చెందిన రాజ్ కుమార్(28) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 19న ఆటోలో బయటికి వెళ్లిన అతడు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అతడి తండ్రి రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా ఈరోజు అడా ప్రాజెక్టులలో మృతదేహాం లభ్యమైనట్లు వెల్లడించారు.

News March 23, 2024

HYD: బాలుడి ప్రాణం తీసిన వీధి కుక్క

image

HYDలో వీధి కుక్కలు మరో బాలుడి ప్రాణం తీశాయి. బాధితులు తెలిపిన వివరాలు.. HYD శామీర్‌పేట్ పరిధి పెద్దమ్మ కాలనీలో భవన నిర్మాణ మేస్త్రీ బాలు.. కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడి పెద్ద కుమారుడు ప్రవీణ్ (11) ఈనెల 18న ఇంటి ముందు ఉండగా ఓ వీధి కుక్క దాడి చేసి కరిచింది. బాలుడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు.

News March 23, 2024

HYD: బాలుడి ప్రాణం తీసిన వీధి కుక్క

image

HYDలో వీధి కుక్కలు మరో బాలుడి ప్రాణం తీశాయి. బాధితులు తెలిపిన వివరాలు.. HYD శామీర్‌పేట్ పరిధి పెద్దమ్మ కాలనీలో భవన నిర్మాణ మేస్త్రీ బాలు.. కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడి పెద్ద కుమారుడు ప్రవీణ్ (11) ఈనెల 18న ఇంటి ముందు ఉండగా ఓ వీధి కుక్క దాడి చేసి కరిచింది. బాలుడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు.

News March 23, 2024

భద్రాద్రి కంటే ఖమ్మంలోనే ఎక్కువ..

image

ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో పోలీసుశాఖ సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై నిఘాను కట్టుదిట్టం చేస్తోంది. ఖమ్మంలో 83, భద్రాద్రిలో 15 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలున్నాయి. అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు భద్రాద్రిలో 128 ఉండగా.. ఖమ్మంలో లేవు. రౌడీ షీటర్లు ఖమ్మంలో 244, భద్రాద్రిలో 236 మంది ఉండగా.. వారికి ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు.

News March 23, 2024

అచ్చంపేట : అధిక రక్తస్రావం.. బాలింత మృతి

image

ఓ బాలింత మృతిచెందిన సంఘటన అచ్చంపేటలో చోటుచేసుకుంది. బాధితుడి వివరాల ప్రకారం.. అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామానికి చెందిన కల్పన (29) ప్రసవం కోసం గురువారం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ ఓ వైద్యుడు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లమన్నాడు. డెలివరీ అనంతరం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నా.. బాలింతకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. జిల్లా ఆస్పత్రి నుంచి HYD గాంధీ ఆసుపత్రికి తరలించగా మరణించింది.

News March 23, 2024

నల్గొండ, భువనగిరిపై తర్జనభర్జన

image

నల్గొండ, భువనగిరి లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ తర్జనభర్జన పడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక బీఆర్ఎస్ కత్తిమీద సాములా మారింది. ఇప్పటివరకు విజయం సాధించని నల్గొండ స్థానంలో బలమైన అభ్యర్థిని బరిలో దింపేలా ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. రాజధాని ప్రాంతం కాకుండా అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్న స్థానాలు ఇక్కడివే కావడం గమనార్హం.