Telangana

News August 23, 2024

సికింద్రాబాద్: ప్రజలతో మర్యాదగా మెలగండి: డీజీపీ

image

ప్రజలతో మర్యాదపూర్వకంగా, బాధితులపై సానుభూతితో వ్యవహరించాలని ట్రైనీ ఎస్ఐలకు డీజీపీ జితేందర్ సూచించారు. అకాడమీలో అందుతున్న శిక్షణ, కల్పిస్తున్న మౌలిక వసతులు తదితర అంశాలను డీజీపీ జితేందర్, అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ బుధవారం కలిసి పరిశీలించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 547 మంది ట్రైనీ ఎస్ఐలతో కాసేపు మాట్లాడారు. శిక్షణపై ట్రైనీ ఎస్ఐలు సంతృప్తి వ్యక్తం చేశారు.

News August 23, 2024

హైదరాబాద్ నుంచి పలు రైళ్లు రద్దు

image

హైదరాబాద్, సికింద్రాబాద్ల నుంచి ట్రైన్ ప్రయాణాలు సాగించేవారిని సౌత్ సెంట్రల్ అలర్ట్ చేసింది. ట్రాక్ మరమ్మతుల కారణంగా ఈ రైల్వే డివిజన్ల పరిధిలో పలు ట్రైన్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటన విడుదల చేసింది. సికింద్రాబాద్ నుంచి వరంగల్, హైదరాబాద్, కాజీపేట నుంచి బల్లార్ష వెళ్లే ట్రైన్లు సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

News August 23, 2024

HYD: IIRR శాస్త్రవేత్తకు విజ్ఞాన్ యువ అవార్డు

image

HYD రాజేంద్రనగర్‌లోని IIRR (ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్) విద్యా సంస్థలు, అగ్రికల్చర్ సైంటిస్ట్ డా.కృష్ణమూర్తి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజ్ఞాన్ యువ అవార్డు పొందారు. అవార్డు పొందడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని పరిశోధనలకు నాంది పలుకుతామని తెలిపారు.

News August 23, 2024

దేశ సంపదనంతా అదానీకి అంటగడుతోంది: పొంగులేటి

image

అదానీ గ్రూప్స్ సంస్థల విషయంలో కేంద్రంలోని బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీజేపీ దొంగచాటుగా అదానీ గ్రూప్ ను కాపాడుతుందని, దేశ సంపదనంతా అదానీకి అంటగడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.

News August 23, 2024

యాదాద్రి క్షేత్రంలో నేడు చండీ హోమం

image

యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉ.9గం లకు మహా చండీ హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. హోమంలో రూ.1250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డు, శాల్ల, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.

News August 23, 2024

ఆర్ఓఆర్ చట్టం 2024పై ప్రజాభిప్రాయ సేకరణ: కలెక్టర్ తేజస్ నంద్ లాల్

image

నూతన రెవెన్యూ చట్టం ఆర్వోఆర్– 2024 ముసాయిదా అమలుపై ఇవాళ కలెక్టరేట్ కార్యాలయంలో చర్చ వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గురువారం తెలిపారు. అన్నీ వర్గాల నుంచి విస్తృత అభిప్రాయాలు స్వీకరించాలనే లక్ష్యంతో చర్చ కార్యక్రమం నిర్వహణ చేపట్టనున్నట్ల పేర్కొన్నారు. ప్రజా ప్రతినిదులు, న్యాయవాదులు సీనియర్ పాత్రికేయులు సూచనలు అందించాలని తెలిపారు.

News August 23, 2024

వ్యవసాయ అధికారులతో జగిత్యాల కలెక్టర్ సమీక్ష

image

జగిత్యాల జిల్లా కేంద్రంలో మండల వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. రుణమాఫీపై నిర్వహించే స్పెషల్ డ్రైవ్‌లో రైతుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు ఫిర్యాదులను పరిష్కరిస్తారన్నారు. మండలంలోని అన్ని బ్యాంకుల అధికారులతో వ్యవసాయ అధికారులు సమన్వయం చేసి రుణమాఫీపై స్పష్టమైన నివేదికను తయారు చేయాలన్నారు. రైతులకు సందేహాలు ఉంటే పరిష్కారం చేయాలన్నారు.

News August 23, 2024

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు: కడియం

image

అధికారులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని MLA కడియం శ్రీహరి అన్నారు. చింతగట్టు క్యాంపులో గల నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీరింగ్ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఏడాదిలోపు ఘనపూర్ నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని MLA ఆదేశించారు.

News August 23, 2024

సంగారెడ్డి: ‘సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలి’

image

సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్పీ రూపేష్ పోలీసు అధికారులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి గురువారం పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలకు గురైనప్పుడు డబ్బు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారానే సైబర్ నేరాలకు గురికాకుండా అడ్డుకట్ట వేయవచ్చని చెప్పారు. అదనపు ఎస్పీ సంజీవరావు పాల్గొన్నారు.

News August 23, 2024

NRPT: ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: పట్నాయక్

image

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్లో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులతో ప్రజావాణి సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారిగా పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణిలో విద్య శాఖకు సంబంధించి అత్యధికంగా ఫిర్యాదులు అందుతున్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని అన్నారు.