India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిన్న జరిగిన గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అంతకుముందు గవర్నర్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలపై చర్చించారు. ప్రభుత్వానికి సహకరించాలని భట్టి గవర్నర్‌ను కోరారు.

మహబూబ్‌నగర్ జిల్లా అడ్డకల్ మండల బైపాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. స్థానికుల సమాచారం.. బైపాస్ వద్ద రోడ్డు దాటుతున్న కాంగ్రెస్ నేత వెంకట్ రెడ్డి బైక్‌పై కారు ఢీకొట్టింది. ప్రమాదంలో వెంటక్ రెడ్డి తీవ్రంగా గాయడగా స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు చెప్పారు. వెంకట్ రెడ్డి మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు పరికరాలు పనిచేయకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక పరమైన సమస్యలతో బయోమెట్రిక్ హాజరును నమోదు చేయలేకపోతున్నామని బోధన, బోధనేతర సిబ్బంది పేర్కొంటున్నారు. బయోమెట్రిక్ యంత్రాల్లో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
మంగపేటలోని మల్లూరు లక్ష్మీనృసింహస్వామి ఆలయం పరిసరాల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్న 10మందిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుట్టపై కొంత కాలంగా అభివృద్ధి పనులు చేస్తున్న ఓ అధికారితో పాటు అతని సహాయకునిగా పనిచేస్తున్న వ్యక్తి, తాడ్వాయి మండలం కాటాపురానికి చెందిన మరో వ్యక్తి, పలు గ్రామాలకు చెందిన 10మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 23, 24, 25వ తేదీల్లో మార్కెట్ అధికారులు సెలవులు ప్రకటించారు. 23న వారాంతపు యార్డ్ బంద్, 24న సాధారణ సెలవు, 25న హోలీ పండుగ సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తిరిగి 26న మార్కెట్ పునఃప్రారంభమై క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా రైతు సోదరులు గమనించాలని పేర్కొన్నారు.
అన్ని అర్హతలు ఉండీ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లు రానివారి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని, ఆహారభద్రత వివరాలు తప్పుగా నమోదు వంటి కారణాల వల్ల అనేకమంది జీరో బిల్లుకు దూరమయ్యారు. ఇలాంటి వారు తమ వివరాలు సరిచేసుకునేందుకు మండల పరిషత్తు, మున్సిపల్, GHMC సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది.

ఘణపురం ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. పాలకుల నిరాదరణతో పూర్వ వైభవం కోల్పోయింది. నిజాం కాలంలో కళకళలాడిన ప్రాజెక్టు నేడు పూడికతో నిండిపోయింది. ప్రాజెక్టు నిండినా వారం రోజులు కూడా నీరు ఉండని పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ప్రభుత్వం 2016లో రూ. 43.64 కోట్లు మంజూరు చేసింది. పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ పూర్తి కాలేదు. నాలుగేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాటిగ్రామ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.