Telangana

News August 23, 2024

సంగారెడ్డి: ‘సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలి’

image

సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్పీ రూపేష్ పోలీసు అధికారులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి గురువారం పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలకు గురైనప్పుడు డబ్బు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారానే సైబర్ నేరాలకు గురికాకుండా అడ్డుకట్ట వేయవచ్చని చెప్పారు. అదనపు ఎస్పీ సంజీవరావు పాల్గొన్నారు.

News August 23, 2024

NRPT: ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: పట్నాయక్

image

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్లో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులతో ప్రజావాణి సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారిగా పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణిలో విద్య శాఖకు సంబంధించి అత్యధికంగా ఫిర్యాదులు అందుతున్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని అన్నారు.

News August 23, 2024

త్రిపుర గవర్నర్‌ను కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే

image

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి హైదరాబాద్ నగరంలో త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పలు అంశాల గురించి చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట ఆర్మూర్ ప్రాంతానికి చెందిన కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పెద్దోళ్ల గంగారెడ్డి, తదితరులు ఉన్నారు.

News August 23, 2024

HYD: వినికిడి సమస్య ఉందా..? ENT వెళ్లండి!

image

కోఠి ENT ఆసుప‌త్రిలో వినికిడి సమస్య సంబంధించిన స‌ర్జ‌రీలు ఇటీవ‌ల పెద్ద సంఖ్య‌లో జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఖ‌రీదైన వినికిడి యంత్రాలు, స‌ర్జ‌రీలు చేయించుకున్న‌ వారికి LOC, CMRF ద్వారా ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తోంది. చికిత్స‌ల అనంత‌రం ఉచితంగా వినికిడి యంత్రాల‌తో పాటు, ఏడాది పాటు AVT( Auditions Verbal Therapy) అందిస్తారు.

News August 23, 2024

HYD: వినికిడి సమస్య ఉందా..? ENT వెళ్లండి!

image

కోఠి ENT ఆసుప‌త్రిలో వినికిడి సమస్య సంబంధించిన స‌ర్జ‌రీలు ఇటీవ‌ల పెద్ద సంఖ్య‌లో జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఖ‌రీదైన వినికిడి యంత్రాలు, స‌ర్జ‌రీలు చేయించుకున్న‌ వారికి LOC, CMRF ద్వారా ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తోంది. చికిత్స‌ల అనంత‌రం ఉచితంగా వినికిడి యంత్రాల‌తో పాటు, ఏడాది పాటు AVT( Auditions Verbal Therapy) అందిస్తారు.

News August 22, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.2 లక్షలు రుణమాఫీ చేయాలి: KTR
✓సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారు: సబిత
✓ఆదాని, మోడీ తీరుపై HYD నగరంలో కాంగ్రెస్ నేతల నిరసన
✓ఉప్పల్: నంబర్ ప్లేట్లు లేని వాహనాలకు చలాన్లు
✓బాలాపూర్లో మరో మర్డర్
✓కోకాపేట: బాలిక పై సెక్యూరిటీ గార్డ్ అసభ్య ప్రవర్తన
✓HYD నగరంలో పెరుగుతున్న కాలుష్యం

News August 22, 2024

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

*నిజామాబాద్‌లో గల్లంతైన చిన్నారి అనన్య మృతదేహం లభ్యం
*ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతు రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ నాయకుల ధర్నా
*బోధన్:కొడుకు మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి
*కామారెడ్డి: రైలు కింద పడి యువకుడి మృతి
*HYD ఈడీ కార్యాలయం ముందు నిరసనలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే
*రేవంత్ రెడ్డిని కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే
*బాన్సువాడ, బోధన్‌కు సబ్ కలెక్టర్ల నియామకం

News August 22, 2024

గచ్చిబౌలి: రేపు IITHలో నేషనల్ స్పేస్ డే

image

IIT HYD విద్యాసంస్థలో రేపు నేషనల్ స్పేస్ డే నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇది కొనసాగుతుందని, ISRO సైంటిస్టుల ఆధ్వర్యంలో ఆస్ట్రానమీ సహ వివిధ అంశాలపై లెక్చర్ ఉంటుందన్నారు. ఆసక్తిగల విద్యార్థులు విద్యా సంస్థకు వచ్చి పాల్గొనాలని అధికారులు పిలుపునిచ్చారు.

News August 22, 2024

HYD: అదంతా ఫేక్..ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి!

image

కేంద్ర హోం అఫైర్స్ మినిస్ట్రీ నుంచి ఈ లెటర్ వచ్చినట్లుగా సోషల్ మీడియాలో వైర్లు అవుతుందని HYD సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. అది ఫేక్ లెటర్ అని పేర్కొన్నారు. మీ ఇంటర్నెట్లో చైల్డ్ పోర్నోగఫీ, సైబర్ పోర్నోగ్రఫీ, గ్రూమింగ్ లాంటివి సెర్చ్ చేసినట్లు తెలిసిందని దీనికి సంబంధించి కేసులు పెడతామని బెదిరిస్తే ఎట్టి పరిస్థితుల్లో నమోద్దన్నారు. ఫేక్ లెటర్ లాంటివి పంపిస్తే 1930కు ఫిర్యాదు చేయాలన్నారు.

News August 22, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!

image

✒ఆదాని కుంభకోణంపై విచారణ చేపట్టాలి: జూపల్లి
✒కలకత్తాలో ఘటన.. పలుచోట్ల వైద్య విద్యార్థుల నిరసన
✒జడ్చర్ల: రోడ్డు ప్రమాదం.. తల్లీకూతురి మృతి
✒ఒకే దఫాలో రైతులకు రుణమాఫీ చేయాలి:BRS
✒NGKL: జీతాలు ఇవ్వడం లేదంటూ కార్మికుల ఆందోళన
✒GDWL:రోడ్డు ప్రమాదం.. పలువురికి తీవ్ర గాయాలు
✒రేపు ఖోఖో సంఘం ఉమ్మడి జిల్లా ఎన్నికలు
✒KGBVలో బదిలీలు.. దరఖాస్తు చేసుకోండి:DEOలు
✒ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుల ఆహ్వానం