Telangana

News March 21, 2024

మెదక్-ఎల్కతుర్తి జాతీయ రహదారిపై 14 మంది దుర్మరణం

image

మెదక్-ఎల్కతుర్తి జాతీయ రహదారి పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. దీంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏడాదిన్నర వ్యవధిలో 14 మంది దుర్మరణం చెందారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గాన్ని నాలుగు వరుసలుగా విస్తరించాలని రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెండు ప్యాకేజీలుగా పనులు చేస్తున్నా, పనులు నెమ్మదిగా సాగడంతో పలు సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

News March 21, 2024

అమ్రాబాద్: యువకుడి సూసైడ్

image

అమ్రాబాద్ మండలానికి చెందిన ఎల్కచేను నీలమ్మ, నాగయ్య దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుమారైన స్వామి బుధవారం ఉదయం వ్యవసాయ పొలంలో టేకు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని గ్రామస్థులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని అమ్రాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News March 21, 2024

నేడు పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన!

image

పెద్దపల్లి కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిని నేడు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్‌ను ప్రకటించగా.. BJP అభ్యర్థిగా గోమాసే శ్రీనివాస్‌ బరిలో ఉన్నారు. ఇక్కడ బలమైన నాయకుడిని బరిలో నిలపాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. దీంతో తమ పార్టీ అభ్యర్థి ఎవరోనని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారో కామెంట్ చేయండి.

News March 21, 2024

వరంగల్: పత్తి క్వింటా ధర రూ.7,315

image

హమాలీ గుమస్తాల సంఘం విజ్ఞప్తి మేరకు వరంగల్ ఎనుమాముల మార్కెట్ బుధవారం బంద్ ఉండగా ఈరోజు ప్రారంభమైంది. నేడు మార్కెట్‌కు పత్తి తరలి రాగా.. ధర మొన్నటి కంటే రూ.15 పెరిగింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,300 పలకగా.. ఈరోజు రూ.7,315 పలికింది. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

News March 21, 2024

వరంగల్: పాఠశాల దుస్తుల బకాయి నిధుల విడుదల

image

పెండింగులో ఉన్న ప్రభుత్వ పాఠశాలల కుట్టు కూలీ బకాయి నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున కుట్టిన దర్జీల ఛార్జీల చెల్లింపు కోసం ఆరు నెలలుగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారుల ఖాతాల్లో నిధులను జమ చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 2,11,932 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.2.11 కోట్లను విడుదల చేసింది.

News March 21, 2024

HYD: UPDATE: లవ్‌లో కూతురు.. ఉరేసి చంపిన తల్లి జైలుకు

image

ఇబ్రహీంపట్నం మం. దండుమైలారంలో కూతురిని చంపిన తల్లికి పోలీసులు రిమాండ్‌‌ విధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బావను పెండ్లి చేసుకోవాలని పేరెంట్స్‌ భార్గవి(19) మీద ఒత్తిడి తెచ్చారు. ఇది ఆమెకు నచ్చలేదు. మంగళవారం శశి(ప్రియుడు)ని ఇంటికి పిలిచి మాట్లాడుతుండగా తల్లి జంగమ్మ చూసింది. కోపంతో కూతురిని కొట్టి, చీరతో ఉరేసి చంపేసింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జంగమ్మను అరెస్ట్ చేశారు.

News March 21, 2024

HYD: UPDATE: లవ్‌లో కూతురు.. ఉరేసి చంపిన తల్లి జైలుకు

image

ఇబ్రహీంపట్నం మం. దండుమైలారంలో కూతురిని చంపిన తల్లికి పోలీసులు రిమాండ్‌‌ విధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బావను పెండ్లి చేసుకోవాలని పేరెంట్స్‌ భార్గవి(19) మీద ఒత్తిడి తెచ్చారు. ఇది ఆమెకు నచ్చలేదు. మంగళవారం శశి(ప్రియుడు)ని ఇంటికి పిలిచి మాట్లాడుతుండగా తల్లి జంగమ్మ చూసింది. కోపంతో కూతురిని కొట్టి, చీరతో ఉరేసి చంపేసింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జంగమ్మను అరెస్ట్ చేశారు.

News March 21, 2024

భద్రాచలం బ్రిడ్జి పైనుంచి దూకి సూసైడ్

image

భద్రాచలం బ్రిడ్జి పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఈ ఉదయం జరిగింది. పాల్వంచ వనమా కాలనీకి చెందిన తంగెళ్ల శేషం రాజ్ బ్రిడ్జి పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News March 21, 2024

జనగామ: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

రైలు కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామలో బుధవారం జరిగింది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రమణారెడ్డి వివరాల ప్రకారం.. జనగామ రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ ఫారం సమీపంలో 50 ఏళ్ల వయసు ఉండే ఓ వ్యక్తి రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవన్నారు. తెలుపు రంగు చొక్కా, నలుపు రంగు పాయింట్ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు.

News March 21, 2024

ఆదిలాబాద్-మహారాష్ట్ర బార్డర్‌లో హై అలర్ట్ 

image

మహారాష్ట్ర గడ్చిరోలి ఎన్ కౌంటర్‎తో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల పోలీసులు అలర్ట్ అయ్యారు. గడ్చిరోలి ఎన్ కౌంటర్‎తో మావోలు ప్రాణహిత దాటి మహారాష్ట్ర నుంచి తెలంగాణాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో ప్రాణహిత తీరం వెంట హై అలర్ట్ ప్రకటించారు.
మహారాష్ట్రలోని అటవీప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు హతమవ్వగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై నిఘా పెంచారు.