India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనుమానాస్పదంగా యువకుడు మృతి చెందిన ఘటన పదర మండలం వంకేశ్వరం గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎల్కచేను స్వామి(26) మంగళవారం రాత్రి తమ సొంత పొలంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. బుధవారం ఉదయం గమనించిన గ్రామస్థులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అమ్రాబాద్ ఆసుపత్రిలో పంచనామా నిర్వహించారు.
జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా సంబంధిత అధికారులు చూడాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మైనింగ్ అనుమతులకు రెవెన్యూ అధికారుల ఎల్ఓసి తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
HYD ఖైరతాబాద్ రవాణా కార్యాలయంలో ఈరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. అంతర్జాతీయ లైసెన్స్ కోసం ఖైరతాబాద్ రవాణా కార్యాలయానికి అల్లు అర్జున్ వచ్చారు. లైసెన్స్ కోసం కావాల్సిన పత్రాలపై స్వయంగా సంతకాలు చేసి ఫొటోలు దిగారు. దీంతో అధికారులు, స్థానిక సిబ్బంది అల్లు అర్జున్‌తో ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. అల్లు అర్జున్ రాకతో కార్యాలయం వద్ద సందడి నెలకొంది.
HYD ఖైరతాబాద్ రవాణా కార్యాలయంలో ఈరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. అంతర్జాతీయ లైసెన్స్ కోసం ఖైరతాబాద్ రవాణా కార్యాలయానికి అల్లు అర్జున్ వచ్చారు. లైసెన్స్ కోసం కావాల్సిన పత్రాలపై స్వయంగా సంతకాలు చేసి ఫొటోలు దిగారు. దీంతో అధికారులు, స్థానిక సిబ్బంది అల్లు అర్జున్‌తో ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. అల్లు అర్జున్ రాకతో కార్యాలయం వద్ద సందడి నెలకొంది.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, కేజీబీవీ పాఠశాలలకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులన్నీ మార్చి 28వ తేదీ లోపల డ్రా చేసి ఖర్చు చేయాలని లేనిచో నిధులన్నీ వెనక్కి వెళ్తాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలిపారు. అదేవిధంగా దీనికి సంబందించిన యూసీలను సిద్దం చేసుకోవాలని సూచించారు.
>1996లో టీడీపీ తరఫున MBNR ఎంపీగా పోటీ చేసి ఓటమి
>2004లో సమాజ్ వాది పార్టీ నుంచి గద్వాల ఎమ్మెల్యేగా గెలుపు
>2009, 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి గద్వాల ఎమ్మెల్యేగా గెలుపు
>2018లో గద్వాల ఎమ్మెల్యేగా ఓటమి
>2019లో బీజేపీలో చేరి MBNR ఎంపీగా పోటీ చేసి ఓటమి
కీలక పదవులు:
>కాంగ్రెస్ ప్రభుత్వంలో పౌర సంబంధాలు, సమాచార శాఖ, చిన్న తరహా, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు
>ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా..
ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన బిచ్కుంద మండల ప్రజా పరిషత్ పాఠశాల సెకండరి గ్రేడ్ ఉపాధ్యాయురాలు కృష్ణవేణికి ఫైనల్ షోకాజ్ నోటిస్ జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి రాజు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్ 2, 2022 నుంచి ముందస్తు అనుమతులు లేకుండా విధులకు రావడం లేదని, 10 రోజుల్లోగా సమాధానం రాకపోతే సర్వీస్ నుంచి తొలగిస్తామని ఆయన పేర్కొన్నారు.
HYDలో RPF SI అంటూ నార్కెట్‌పల్లి యువతి మాళవిక అందరినీ నమ్మించగా ఆమెను పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే నిజంగా SIలానే ఆమె చేసేదని స్థానికులు తెలిపారు. అవగాహన కార్యక్రమాలు, మోటివేషన్ క్లాసులకు వెళ్లి స్పీచ్‌లు ఇస్తూ SIలానే ప్రవర్తించేదని చెప్పారు. ఏడాదిగా నకిలీ పోలీస్ యూనిఫాం వేసుకుని తిరుగుతున్నా ఎవరూ గమనించకపోవడం గమనార్హం. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన జరిగింది. మంగళవారం రాత్రి ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో పొలం గట్టుపై విద్యుత్ తీగలు పడ్డాయి. బుధవారం ఉదయం రైతు పొలం పనులకు వెళ్ళగా.. విద్యుత్ వైర్లు ప్రమాదవశాత్తు తగిలి రాజయ్య అక్కడికక్కడే మృతి చెందినట్టు గ్రామస్థులు తెలిపారు. ఘటనా స్థలానికి పొత్కపల్లి ఎస్సై చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
GWMC కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో రెవెన్యూ బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పన్ను వసూళ్ల పురోగతిపై సమర్థవంతంగా నిర్వహించుటకు అధికారులకు సూచనలు చేశారు. 2023- 24 ఆర్థిక సంవత్సరం లక్ష్యం రూ.97.66 కోట్లు కాగా ఇప్పటికి రూ.63.96 కోట్ల సేకరణ జరిగిందన్నారు. RIల వారీగా వసూళ్ల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం తగదన్నారు.
Sorry, no posts matched your criteria.