India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా నగదు, ఇతర విలువైన వస్తువులు రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని కోదాడ రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి అన్నారు. మంగళవారం కోదాడ రామాపురం ఎక్స్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలో విజయవాడ నుంచి హైదరాబాదు వెళుతున్న కారులో రూ.4,76,900 నగదు పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకొని ఎస్ఎస్ టీం అధికారి వినయ్ కుమార్‌కు అప్పగించినట్లు తెలిపారు.
అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో కుక్కలను కాల్చి చంపిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. గ్రామంలో విచ్చలవిడిగా కుక్కలు స్వైర విహారం చేస్తున్నడంతో గ్రామానికి చెందిన పలువురు ఈనెల 15న దాదాపు 20 కుక్కలను కాల్చి చంపారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో నేడు నిందితులు నర్సింహారెడ్డి, తారిఖ్ అహ్మద్, మహమూద్ తాహీర్‌ను అరెస్ట్ చేశారు.
పార్లమెంట్ ఎన్నికలు సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సెక్టోరల్ అధికారులకు మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా ఎస్పీ గౌస్ ఆలం తో కలసి పాల్గొన్నారు. పూర్తి పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలని సిబ్బందికి కలెక్టర్ ఆదేశించారు. సెక్టోరల్ ఆఫీసర్ రిటర్నింగ్ అధికారులకు క్షేత్రస్థాయిలో జరిగే ఎన్నికల పక్రియను ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి పని చేయాలని అన్నారు.
తెలంగాణలో పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఇందులో ఉమ్మడి WGL జిల్లాకు చెందిన నలుగురికి ఛైర్మన్ పదవులు దక్కాయి. అయితే మంత్రులు కొండా సురేఖ, సీతక్కలు ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు, ములుగు నియోజకవర్గాల నుంచి నేతలెవరికీ నామినేటెడ్ పదవులు దక్కకపోవడం గమనార్హం. పదవుల కోసం పలువురు ప్రయత్నాలు చేసినప్పటికీ వారికి నిరాశే మిగిలింది.
తెలంగాణలో 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం HYD విద్యానగర్ బీసీ భవన్ వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీల్లో కేవలం 8 కార్పొరేషన్లు మాత్రమే ఇప్పటివరకు ప్రకటించారని, మిగతా కులాలన్నింటికీ కార్పొరేషన్లను ప్రకటించాలని కోరారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ఎన్‌ఫోర్స్ టీమ్స్ మంగళవారం రూ.16,43,300 నగదుతో పాటు రూ.10,250 విలువగల ఇతర వస్తువులు పట్టుకుని సీజ్ చేశారని HYD ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే పోలీస్, ఎస్.ఎస్.టీ, ఎఫ్.ఎస్.టీ టీమ్స్ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటనలో మిర్యాలగూడ మండలంలో సోమవారం జరిగింది. దామరచర్ల మండలం లావూరి భూక్య తండా గ్రామానికి చెందిన భూక్య నాగు తన స్నేహితుడు దావీదుతో కలిసి బైక్‌పై వెళ్తుండగా కిష్టాపురం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో నాగు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై మృతుడి బావ సైదులు ఫిర్యాదుతో నేడు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.
మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సురేందర్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి చిక్కాడు. ఓ ఇసుక ట్రాక్టర్ సీజ్ చేయగా మైనింగ్ శాఖ నుంచి రిలీజ్‌కు అనుమతిచ్చారు. స్టేషన్ నుంచి రిలీజ్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ సంగారెడ్డి డీఎస్పీ ఆయన ఆధ్వర్యంలో డబ్బులు డిమాండ్ చేసిన కానిస్టేబుల్‌ను పట్టుకుని విచారిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.