Telangana

News August 22, 2024

బాన్సువాడ, బోధన్‌కు నూతన సబ్ కలెక్టర్లు

image

ఇటీవల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన పలు సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో 2022 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్‌లను సబ్ కలెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ సబ్ కలెక్టర్‌గా కిరణ్మయి కొప్పిశెట్టి, నిజామాబాద్ జిల్లాలోని బోధన్ సబ్ కలెక్టర్‌గా వికాస్ మహతో నియమితులయ్యారు.

News August 22, 2024

చదువులో వెనుకబడిన వారిపై శ్రద్ధ చూపండి: DEO

image

బూసిగూడెం గిరిజన సంక్షేమ పాఠశాలను ఏజెన్సీ DEO మల్లేశ్వరావు గురువారం తనిఖీ చేశారు. విద్యార్థుల పఠనాశక్తిని పరిశీలించారు. 20 శాతం విద్యార్థులు చదువులో వెనుకబడి ఉన్నారని, వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని టీచర్లను ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం ఇవ్వాలని, పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

News August 22, 2024

యాదాద్రిలో పూజలు, హరీశ్ రావుపై పోలీసులకు ఫిర్యాదు 

image

యాదగిరిగుట్ట ఆలయంపైన మాడవీధుల్లో మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎమ్మెల్యే లు పూజలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆలయ ఈవో భాస్కరరావు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అనుమతి లేని ప్రదేశంలో బీఆర్ఎస్ నేతలు బయటి పూజారులతో మాడవీధుల్లో పూజలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెక్షన్ 7 రిలీజియన్ యాక్ట్- 1988 ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు.

News August 22, 2024

బోధన్: కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి మృతి

image

కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి మృతి చెందిన ఘటన బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాయికుమార్ (22) ఐదు రోజుల క్రితం రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందకుర్తి గోదావరిలో ఈతకు వెళ్లి మృతి చెందడు. అయితే కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి దేవర్ల వెంకటేశ్(54) గురువారం గుండెపోటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. 

News August 22, 2024

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

image

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. శుక్రవారం ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ ఫ్లో 1,24,153 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. అవుట్ ఫ్లో 42,898 ఉండగా పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 883. 50 ఉంది. ప్రాజెక్టు పరిధిలోని కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగిస్తున్నారు.

News August 22, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.87,793 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.59,182, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ26,750, అన్నదానం రూ.10,861 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.

News August 22, 2024

వరంగల్ మార్కెట్లో పెరిగిన చిరుధాన్యాల ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పసుపు ధర పెరిగింది. నిన్న క్వింటాకు రూ.12,273 పలికిన పసుపు నేడు రూ.13,516 పలికింది. అలాగే సూక పల్లికాయ ధర నిన్న రూ.6,260 పలకగా.. నేడు రూ.5850 పలికింది. నిన్న పచ్చి పల్లికాయ ధర రూ.4,200 రాగా నేడు రూ.4250కి చేరింది. మరోవైపు 5531 రకం మిర్చికి నిన్నటిలాగే రూ.12 వేల ధర వచ్చినట్లు మార్కెట్ వ్యాపారులు తెలిపారు.

News August 22, 2024

ADB: స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

నాన్ రెసిడెన్షియల్ ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను LG హోప్ టెక్నికల్ స్కిల్ అకాడమీ ద్వారా అభ్యర్థులకు హైదరాబాద్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు ADB బీసీ సంక్షేమ అధికారి రాజలింగు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. 18నుంచి 25 సంవత్సరాల మధ్య వయసున్న వారు శిక్షణకు అర్హులన్నారు. ఈ నెల 24 వరకు tgbcstudycircle.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News August 22, 2024

అర్హులందరికీ అందేదాకా రుణమాఫీ: మంత్రి తుమ్మల

image

రుణమాఫీ విషయంలో అన్నదాతలు ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ రుణమాఫీ చేసి తీరుతామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు రైతులను గందరగోళంలో పడేసే మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. ఏనాడూ రైతుల గురించి మాట్లాడని వారు ఇప్పుడు రైతు జపం చేస్తున్నారని, వారి మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని పేర్కొన్నారు.

News August 22, 2024

BREAKING: HYD: బాలాపూర్‌లో మరో హత్య..!

image

HYD బాలాపూర్ PS పరిధిలో మరో దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రౌడీషీటర్ రియాజ్ హత్య మరువక ముందే మరో యువకుడిని గుర్తు తెలియని దుండగులు వెంటపడి మరీ కత్తులతో పొడిచి హత్య చేశారు. బాలాపూర్ గణేశ్ చౌక్ వద్ద ఉన్న ఓ హోటల్ ఎదుట జనం చూస్తుండగానే హత్య జరిగింది. మృతుడి ఎంవీఎస్ఆర్ మాజీ స్టూడెంట్ ప్రశాంత్‌గా గుర్తించారు. ఘటనా స్థలానికి DCP సునీతారెడ్డి చేరుకుని, కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.