Telangana

News August 22, 2024

అర్హులందరికీ అందేదాకా రుణమాఫీ: మంత్రి తుమ్మల

image

రుణమాఫీ విషయంలో అన్నదాతలు ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ రుణమాఫీ చేసి తీరుతామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు రైతులను గందరగోళంలో పడేసే మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. ఏనాడూ రైతుల గురించి మాట్లాడని వారు ఇప్పుడు రైతు జపం చేస్తున్నారని, వారి మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని పేర్కొన్నారు.

News August 22, 2024

BREAKING: HYD: బాలాపూర్‌లో మరో హత్య..!

image

HYD బాలాపూర్ PS పరిధిలో మరో దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రౌడీషీటర్ రియాజ్ హత్య మరువక ముందే మరో యువకుడిని గుర్తు తెలియని దుండగులు వెంటపడి మరీ కత్తులతో పొడిచి హత్య చేశారు. బాలాపూర్ గణేశ్ చౌక్ వద్ద ఉన్న ఓ హోటల్ ఎదుట జనం చూస్తుండగానే హత్య జరిగింది. మృతుడి ఎంవీఎస్ఆర్ మాజీ స్టూడెంట్ ప్రశాంత్‌గా గుర్తించారు. ఘటనా స్థలానికి DCP సునీతారెడ్డి చేరుకుని, కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

News August 22, 2024

BREAKING: HYD: బాలాపూర్‌లో మరో హత్య..! 

image

HYD బాలాపూర్ PS పరిధిలో మరో దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రౌడీషీటర్ రియాజ్ హత్య మరువక ముందే మరో యువకుడిని గుర్తు తెలియని దుండగులు వెంటపడి మరీ కత్తులతో పొడిచి హత్య చేశారు. బాలాపూర్ గణేశ్ చౌక్ వద్ద ఉన్న ఓ హోటల్ ఎదుట జనం చూస్తుండగానే హత్య జరిగింది. మృతుడి ఎంవీఎస్ఆర్ మాజీ స్టూడెంట్ ప్రశాంత్‌గా గుర్తించారు. ఘటనా స్థలానికి DCP సునీతారెడ్డి చేరుకుని, కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

News August 22, 2024

కమ్మర్‌పల్లి ఫారెస్ట్‌లో చిరుత మృతి

image

కమ్మర్‌పల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో చిరుతపులి మృతి చెందిన ఘటన గురువారం వెలుగు చూసింది. ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ సమీపంలో చిరుతపులి చనిపోయి ఉందని పశువుల కాపరి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. చిరుత పులి 2 రోజుల క్రితం చనిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతంలోని చెరువు వద్ద అది 2 కూనలతో సంచరించినట్లు కాపరులు తెలిపారు.

News August 22, 2024

వన మహోత్సవ లక్ష్యాన్ని చేరుకోవాలి: కలెక్టర్ రాహుల్ శర్మ

image

రానున్న వారం రోజుల్లో వనమహోత్సవ లక్ష్యాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. వన మహోత్సవంపై జిల్లా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సంవత్సరం 26 లక్షల 130 మొక్కలు నాటాలని లక్ష్యం కేటాయించగా.. ఇప్పటి వరకు 21 లక్షల 721 మొక్కలు నాటారని, మిగిలిన లక్ష్యాన్ని వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపల్ పరిధిలో ప్రతి ఇంటికి 6 మొక్కలు నాటేందుకు పంపిణీ చేయాలన్నారు.

News August 22, 2024

కల్యాణ లక్ష్మి పథకానికి నిధులు విడుదల: మంత్రి పొన్నం

image

బీసీ, ఈబీసీ కళ్యాణలక్ష్మి పథకానికి TG ప్రభుత్వం తాజాగా రూ.1225.43 కోట్లు విడుదల చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2024-25 బడ్జెట్‌లో కళ్యాణలక్ష్మి పథకానికి రూ.2175 కోట్లు కేటాయించింది. మొదటిదశలో రూ.1225.43 కోట్లు విడుదల చేసింది. పెండింగ్ దరఖాస్తులతో పాటు తాజాగా అప్లై చేసుకున్న వారికి నిధులు విడుదల చేసినందుకుగాను సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు.

News August 22, 2024

ఇరాక్‌లో జన్నారం వాసి మృతి 

image

జన్నారం మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన రాజమల్లు(35)బుధవారం ఇరాక్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. రాజమల్లు 7 సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం ఇరాక్ దేశం వెళ్లాడు. కాగా ప్రమాదవశాత్తు బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు వెల్లడించారు.

News August 22, 2024

వరంగల్: నేను బతికే ఉన్నా.. ఓ భర్త ఆవేదన

image

భర్త ఉండగానే డెత్ సర్టిఫికెట్ తీసుకుని ఆ తర్వాత 498a కేసు నమోదు చేసిన ఘటన సంచలనం సృష్టించింది. వరంగల్ కాజీపేటకు చెందిన వినోద్‌కు 2008లో నిర్మలతో వివాహం జరిగింది. వీరిమధ్య చిన్న చిన్న గొడవలు జరగడంతో 2013 సెప్టెంబర్‌లో 498ఏ కేసు నమోదు చేసింది. తన నకిలీ డెత్ సర్టిఫికెట్ తీసుకున్న భార్యపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకొని, తనకి న్యాయం చేయాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు.

News August 22, 2024

NLG: పంచాయతీ పోరుకు పల్లెలు సై

image

పంచాయతీ పోరుకు పల్లెలు సై అంటున్నాయి. అసెంబ్లీ ఓటరు జాబితాను జీపీకి కన్వర్ట్ చేయాలని సర్కారు ఆదేశాలతో సర్పంచ్ బరిలో నిలిచే ఆశావహులు తెరపైకి వస్తున్నారు. సేవా కార్యక్రమాలతో ప్రజల మధ్యలో ఉంటున్నారు. రిజర్వేషన్ల లెక్క తేలక ముందే.. బరిగీసి కొట్లాడేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఆపద సమయంలో నేనున్నానంటూ ఆర్థిక సాయం చేస్తూ పోటీదారులతో బలాబలాలు తేల్చుకునే పనిలో నిమగ్నమవుతున్నారు.

News August 22, 2024

తాడ్వాయి: బస్సుల కోసం రోడ్డుపై రాస్తారోకో చేసిన విద్యార్థులు

image

తాడ్వాయి మండలంలో బస్సుల కొరత, సమయానికి సరిపడా బస్సులు రాక ఇబ్బంది పడుతున్నారని విద్యార్థులు వాపోయారు. ఉదయం వచ్చే బస్సులు సైతం రద్దిగా ఉండడంతో అర్గోండ గ్రామానికి చెందిన విద్యార్థులకు కామారెడ్డికి వెళ్లాలంటే ఇబ్బందులు తప్పడంలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు.