Telangana

News August 22, 2024

ఆదాని కుంభకోణంపై విచారణ చేపట్టాలి: జూపల్లి

image

ఆదాని కుంభకోణంపై విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇవాళ టిపిసిసి ఆధ్వర్యంలో HYD ఈడి ఆఫీస్ ముందు చేపట్టిన నిరసనలో జూపల్లి పాల్గొని మాట్లాడారు. ప్రజల సొమ్మును ప్రధాని మోదీ ఆదానికి దోచిపెడుతున్నారన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి లోతుగా దర్యాప్తు చేసి వాస్తవాలను బయటకు తీయాలని మంత్రి డిమాండ్ చేశారు.

News August 22, 2024

ADB: డెంగ్యూ కేసులను నియంత్రించేందుకు పటిష్ఠ చర్యలు: కలెక్టర్

image

డెంగ్యూ కేసులను నియంత్రించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. పట్టణంలోని బాలాజీ నగర్‌లో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలకు పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై, సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమలు వృద్ధి కాకుండా చూడాలన్నారు. ఆయనతో పాటు డీఎంహెచ్ఓ కృష్ణ, మున్సిపల్ కమిషనర్ ఖమర్, తదితరులున్నారు.

News August 22, 2024

MHBD: నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే

image

అదానీపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ పాల్గొన్నారు. కమిటీతో వెంటనే విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ బలరాం నాయక్ డిమాండ్ చేశారు.

News August 22, 2024

స్వామివారిని దర్శించుకున్న MLA నాయిని

image

హనుమకొండ జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి నీలిమ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా హనుమకొండ అదాలత్ జంక్షన్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారిని వేదమంత్రాలతో ఆశీర్వదించారు.

News August 22, 2024

KNR: బతుకమ్మ చీరల పంపిణీ ఉన్నట్టా? లేనట్టా?

image

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం మహిళలకు ఉచితంగా పంపిణీ చేసే చీరల పంపిణీపై ఇంకా స్పష్టత లేదు. బతుకమ్మ ప్రారంభం కావడానికి 40 రోజుల సమయం మాత్రమే ఉన్న చీరల పంపిణీ గురించి ఎలాంటి హడావిడి లేదు. గతేడాది కరీంనగర్ జిల్లాలో 3,53,707 మంది మహిళలకు పంపిణీ చేశారు. 2017 నుంచి ఏటా 18 ఏళ్లు నిండిన ఆడపడుచులందరికీ గత ప్రభుత్వం ఉచితంగా అందించింది.

News August 22, 2024

గన్ పార్క్ వద్ద ధర్నాలో పాల్గొన్న ఎంపీ మల్లు రవి

image

అదానీకి వ్యతిరేకంగా గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ధర్నాలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి పాల్గొని మాట్లాడారు. ఈ దేశ ప్రధానమంత్రి పెద్ద పారిశ్రామికవేత్తలకు దేశాన్ని తాకట్టు పెడుతున్నాడని విమర్శించారు. అదానీపై ఉన్న ప్రేమ ఈ దేశ పేద ప్రజలపై లేదని తెలిపాడు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News August 22, 2024

మక్తల్: రుణమాఫీపై నెలకొన్న గందరగోళం

image

ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల రుణమాఫీ కానీ రైతుల పట్ల గందరగోళ పరిస్థితి నెలకొంది. మక్తల్ మండల పరిసర గ్రామాల్లోనీ రైతులకు, బ్యాంకు అధికారులు ఒకలా, వ్యవసాయ అధికారులు మరొక లాగా చెప్పడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని బాధిత రైతులు కోరుతున్నారు.

News August 22, 2024

HYDలో పీల్చే గాలి చంపేస్తోంది!

image

HYDలో కాలుష్యం పెరుగుతోంది. క్రమక్రమంగా విషవాయువులు పీలుస్తున్న జనాలు అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. ‘స్టేటస్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్’ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2000 నుంచి 2019 వరకు నగరంలో పీఎం 2.5 వంటి సూక్ష్మదూళి కణాల ఉద్గారాలతో అనేక మంది శ్వాసకోశ సంబంధ సమస్యల బారిన పడి మరణించినట్లు వెల్లడించింది. 2000 నాటికి కాలుష్యం బారిన పడి 2,810 మంది, 2019 నాటికి 6,460 మంది మరణించారు.

News August 22, 2024

HYDలో పీల్చే గాలి చంపేస్తోంది!

image

HYDలో కాలుష్యం పెరుగుతోంది. క్రమక్రమంగా విషవాయువులు పీలుస్తున్న జనాలు అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. ‘స్టేటస్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్’ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2000 నుంచి 2019 వరకు నగరంలో పీఎం 2.5 వంటి సూక్ష్మదూళి కణాల ఉద్గారాలతో అనేక మంది శ్వాసకోశ సంబంధ సమస్యల బారిన పడి మరణించినట్లు వెల్లడించింది. 2000 నాటికి కాలుష్యం బారిన పడి 2,810 మంది, 2019 నాటికి 6,460 మంది మరణించారు.

News August 22, 2024

చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం

image

మెగాస్టార్ చిరంజీవికి గురువారం హుస్నాబాద్ ఎమ్మెల్యే బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గతంలో చిరంజీవిని కలిసి దిగిన ఫోటోను మంత్రి పొన్నం ప్రభాకర్ షేర్ చేశారు. నటనలో రారాజు చిరంజీవి అని పేర్కొన్నారు. ఆయన జీవితం ఎంతోమందికి ఆదర్శమని కొనియాడారు.