Telangana

News August 22, 2024

HYDలో పీల్చే గాలి చంపేస్తోంది!

image

HYDలో కాలుష్యం పెరుగుతోంది. క్రమక్రమంగా విషవాయువులు పీలుస్తున్న జనాలు అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. ‘స్టేటస్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్’ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2000 నుంచి 2019 వరకు నగరంలో పీఎం 2.5 వంటి సూక్ష్మదూళి కణాల ఉద్గారాలతో అనేక మంది శ్వాసకోశ సంబంధ సమస్యల బారిన పడి మరణించినట్లు వెల్లడించింది. 2000 నాటికి కాలుష్యం బారిన పడి 2,810 మంది, 2019 నాటికి 6,460 మంది మరణించారు.

చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం

image

మెగాస్టార్ చిరంజీవికి గురువారం హుస్నాబాద్ ఎమ్మెల్యే బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గతంలో చిరంజీవిని కలిసి దిగిన ఫోటోను మంత్రి పొన్నం ప్రభాకర్ షేర్ చేశారు. నటనలో రారాజు చిరంజీవి అని పేర్కొన్నారు. ఆయన జీవితం ఎంతోమందికి ఆదర్శమని కొనియాడారు.

News August 22, 2024

NLG: పర్యావరణహితుడు .. మన సైదులు!

image

చౌటుప్పల్ కు చెందిన నిల్లిగొండ సైదులు ఏటా మట్టి గణేశ్‌ విగ్రహాలను తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు తమవంతుగా కృషి చేస్తున్నారు. బీఎస్సీ చదివి స్వయం ఉపాధిగా కులవృత్తిని ఎంచుకున్న సైదులు.. సొంతూరిలో కుండలతో పాటు గ్రామ దేవతల విగ్రహాలు, పూజకు అవసరమయ్యే వస్తువులను మట్టితో తయారు చేస్తూ పర్యావరణహితుడిగా పేరు పొందాడు. ఈ ఏడాది 20 వేల మట్టి గణపతి విగ్రహాలను తయారు చేసినట్లు తెలిపారు.

News August 22, 2024

HYD: రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక కోర్సు..!

image

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే హైదరాబాద్‌లో మాత్రమే ప్రింటింగ్ టెక్నాలజీ కోర్సు ఉంది. దీనిలో చేరడానికి పదో తరగతి పాసై తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించే పాలిసెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే చాలు. HYDలో జూ పార్క్ సమీపంలోని కులీ కుతుబ్షా (QQ) గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో మాత్రమే ఈ కోర్సు బోధిస్తున్నారని, విద్యార్థులు మెరుగైన ఉపాధి పొందుతున్నట్లు లెక్చరర్లు తెలిపారు.

WGL: జిల్లా వ్యవసాయాధికారుల బదిలీ

image

ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖలో జరుగుతున్న సాధారణ బదిలీల్లో భాగంగా కొందరికి స్థాన చలనం జరిగింది. సుమారు 20 ఏళ్లుగా ఉమ్మడి జిల్లాలో పని చేస్తున్న జేడీఏ ఉషను ఆదిలాబాద్‌కు, యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ అధికారి అనురాధను వరంగల్ జిల్లాకు బదిలీ చేశారు. నరేశ్ కుమార్‌ను ములుగు జిల్లాకు ఏడీఏగా బదిలీ చేశారు.

News August 22, 2024

ఉమ్మడి ADB జిల్లాలో కూరగాయల సాగు వివరాలు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టమాటా పంట సాగుతో పాటు కూరగాయల ఉత్పత్తి విపణి వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 48,560 ఎకరాల్లో కూరగాయలు సాగు చేయబడుతున్నాయి. ఈ విస్తరణలో, దాదాపు 15 ఎకరాల్లో టమాటా పంట సాగించబడుతుంది. జిల్లాలో మొత్తం 27.39 లక్షల జనాభా ఉన్న నేపథ్యంలో, కూరగాయల సాగు చేసే గ్రామాల సంఖ్య 212, ఏడాది మొత్తంలో 6.20 లక్షల టన్నులు కూరగాయలు ఉత్పత్తి అవుతున్నాయి.

News August 22, 2024

ములుగు జిల్లాలో విషాదం.. యువ రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లాలో జరిగింది. ఎస్సై టీవీఆర్ సూరి తెలిపిన వివరాలు.. మంగపేట మండలం మల్లూరు గ్రామానికి చెందిన జయంత్ (26) గతేడాది తనకున్న ఐదెకరాల్లో మిర్చి సాగు చేశాడు. పెట్టుబడికి రూ. 8 లక్షలు అప్పు చేశాడు. కాగా పంట దిగుబడి సరిగా రాకపోవడంతో మనస్తాపంతో ఈ నెల 19న రాఖీ రోజు పురుగుమందు తాగాడు. వరంగల్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందాడు.

News August 22, 2024

వరంగల్ మార్కెట్‌లో తగ్గిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే ఈరోజు మిర్చి ధరలు తగ్గాయి. బుధవారం క్వింటా తేజ మిర్చి ధర రూ.18,500 పలకగా.. నేడు సైతం అదే ధర పలికింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.15వేలు పలకగా నేడు రూ.14,500 కి పడిపోయింది. మరోవైపు వండర్ హాట్ మిర్చి(WH) కి నిన్న రూ.16,000 ధర రాగా ఈరోజు రూ.15 వేలకి దిగజారింది.