Telangana

News August 22, 2024

హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి ధర్నా

image

HYDలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గురువారం ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నేతల ధర్నా కార్యక్రమం జరగనుంది. మరికాసేపట్లో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఆందోళన చేపట్టనున్నారు. మరోవైపు రైతు రుణమాఫీ‌పై కేటీఆర్‌ పిలుపు మేరకు బీఆర్ఎస్‌ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఒకేరోజు అధికార, ప్రతిపక్ష నేతల ధర్నాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

News August 22, 2024

హైటెన్షన్: హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి ధర్నా

కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో ఆగనున్న రైలు!

image

లక్షలాది మంది భక్తులు వచ్చే కొమురవెల్లి మల్లన్న స్వామి సన్నిధిలో రైలు ఆగేందుకు ఫ్లాట్ ఫారం నిర్మాణ పనులు చకచక సాగుతున్నాయి. మొదట్లో ఇక్కడ స్టేషన్ ఏర్పాటు విషయాన్ని రైల్వే శాఖ విస్మరించింది. దీంతో మూడేళ్ల క్రితం రైల్వే స్టేషన్ మంజూరు కోరుతూ నేతలు నిరసన చేపట్టగా.. మల్లన్న సన్నిధిలో హాల్టింగ్ స్టేషన్ మంజూరు చేశారు. ఫిబ్రవరి 15న శంకుస్థాపన చేయగా, మరో 3 నెలల్లో పనులు పూర్తవుతాయని అధికారులు చెప్పారు.

News August 22, 2024

నాగర్‌కర్నూల్: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

image

కడ్తాల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య గుండెపోటుతో బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. బుధవారం సాయంత్రం విధులలో చేరిన ఆయన అకస్మాత్తుగా గుండెపోటుతో ఇబ్బంది పడడంతో ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. అతను కల్వకుర్తి నియోజకవర్గంలో పలు పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించారు.

News August 22, 2024

KTDM:అత్తవారింటికి వచ్చి అల్లుడు సూసైడ్

image

మణుగూరులో రాఖీ పండుగకి అత్తగారింటికి వచ్చిన అల్లుడు మద్యం మత్తులో కలుపు మందు తాగిన విషయం తెలిసిందే. ఖమ్మంకు చెందిన ఓంకార్ కు మణుగూరుకు చెందిన యువతితో ఏడాది కిందట వివాహమైంది. రాఖీపౌర్ణమికి అత్తగారి ఇంటికి వచ్చిన ఓంకార్ మద్యం మత్తులో కలుపు మందు తాగాడు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై ఎస్సై మేడాప్రసాద్ కేసు నమోదు చేశారు.

News August 22, 2024

రామగుండం: పాత ఫోన్లతో సైబర్ క్రైమ్.. ముగ్గురి అరెస్ట్

image

పాత సెల్ ఫోన్లను కొనుగోలు చేసి వాటితో సైబర్ మోసాలకు పాల్పడుతున్న బిహార్‌కు చెందిన ముగ్గురిని రామగుండం పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 వేల పాత సెల్ ఫోన్లు, 3 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పాత ఫోన్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని ఝార్ఖండ్‌లోని ఓ ముఠాకు అప్పగిస్తుంటారు. వారు వాటిలోని సాఫ్ట్‌వేర్ ఆధారంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు.

News August 22, 2024

వరంగల్ మార్కెట్‌లో తగ్గిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర మళ్లీ తగ్గింది. 2 రోజులుగా పెరుగుతూ వచ్చిన ధర నేడు తగ్గింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,370 ఉండగా, బుధవారం రూ.7,500 కి చేరింది. నేడు మళ్లీ తగ్గి రూ.7,420 అయింది. దీంతో పత్తి రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ధరలు పెరిగేలా చూడాలని కోరుతున్నారు.

News August 22, 2024

ఆదిలాబాద్: పీఎస్ ఎదుట విద్యార్థుల ధర్నా

image

ఆదిలాబాద్ టూ టౌన్ పీఎస్ వద్ద గురుకుల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. మావల గురుకుల ప్రిన్సిపల్ సంగీతను తొలగించాలని నిరసన వ్యక్తం చేశారు. నాసిరకం భోజనంపై ప్రశ్నిస్తే ప్రిన్సిపల్ బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపల్‌ను తొలగించేవరకు ఆందోళన చేస్తామని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు.

News August 22, 2024

మంచి ఫలితాలను ఇస్తున్న ‘టీ-సేఫ్’ యాప్: సీతక్క

image

మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘టీ-సేఫ్’ యాప్ మంచి ఫలితాలనిస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. టీ- సేఫ్ ద్వారా పోలీసులకు సమాచారం ఇస్తే మహిళలు గమ్యస్థానాలకు చేరే వరకు వారి భద్రతకు ప్రభుత్వమే భరోసా కల్పిస్తుందన్నారు. ఈ యాప్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మహిళల భద్రతపై సచివాలయంలో సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు.