Telangana

News August 22, 2024

ఆదిలాబాద్: పీఎస్ ఎదుట విద్యార్థుల ధర్నా

image

ఆదిలాబాద్ టూ టౌన్ పీఎస్ వద్ద గురుకుల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. మావల గురుకుల ప్రిన్సిపల్ సంగీతను తొలగించాలని నిరసన వ్యక్తం చేశారు. నాసిరకం భోజనంపై ప్రశ్నిస్తే ప్రిన్సిపల్ బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపల్‌ను తొలగించేవరకు ఆందోళన చేస్తామని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు.

News August 22, 2024

మంచి ఫలితాలను ఇస్తున్న ‘టీ-సేఫ్’ యాప్: సీతక్క

image

మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘టీ-సేఫ్’ యాప్ మంచి ఫలితాలనిస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. టీ- సేఫ్ ద్వారా పోలీసులకు సమాచారం ఇస్తే మహిళలు గమ్యస్థానాలకు చేరే వరకు వారి భద్రతకు ప్రభుత్వమే భరోసా కల్పిస్తుందన్నారు. ఈ యాప్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మహిళల భద్రతపై సచివాలయంలో సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు.

News August 22, 2024

పంచాయితీ ఓటర్ల జాబితా సిద్ధం చేయడానికి షెడ్యూల్ విడుదల

image

NGKL: గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా సిద్ధం చేయటానికి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. గ్రామ పంచాయతీల వల్ల ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 6న ప్రచురిస్తారు. జాబితాపై 13 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. తొమ్మిది పది తేదీలలో రాజకీయ పార్టీల సూచనలు తీసుకుంటారు. నాగర్ కర్నూలు జిల్లాలో 461 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఓటర్ల జాబితా సిద్ధం చేయడానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

News August 22, 2024

MDK: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. సెప్టెంబర్‌ 21న ఓటర్ల తుది జాబితా

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు జోరందుకున్నాయి. వార్డులు, గ్రామపంచాయతీల వారీగా ఓటర్ల జాబితా షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఓటర్ల తుది జాబితాను సెప్టెంబర్‌ 21న విడుదల చేయనున్నారు. ఓటర్ల జాబితాపై బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితా షెడ్యూల్‌ ప్రకారం.. సెప్టెంబర్‌ 6న ఓటర్ల జాబితా ముసాయిదాను గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఉంచుతారు.

News August 22, 2024

MBNR: 1041 మంది మహిళలపై అత్యాచారం

image

రాష్ట్రంలో మహిళపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, పోక్సో, అదృశ్యం జనవరి నుంచి కేసుల నమోదు వివరాలు. ‌మహబూబ్‌నగర్‌లో 406, వనపర్తిలో 230, గద్వాల జిల్లాలో 157, నారాయణపేట్ 152, నాగర్ కర్నూల్‌లో 96 పోక్సో, అత్యాచారం, అదృశ్యం కేసులు నమోదు అయ్యాయి. చట్టాలు కఠినంగా అమలు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

News August 22, 2024

నిండుకుండలా సాగర్ జలాశయం..

image

సాగర్ జలాశయ నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరి నిండుకుండలా కనిపిస్తోంది. బుధవారం శ్రీశైలం జలాశయం నుంచి 47,650 క్యూసెక్కుల వరదనీరు సాగర్ జలాశయానికి చేరింది. సాగర్ నుంచి కుడి కాల్వ ద్వారా 8144 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 8280, ప్రధాన విద్యుత్ కేంద్రం ద్వారా 28826, SLBC ద్వారా 1800, వరద కాలువ ద్వారా 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

News August 22, 2024

NZB: గల్లంతైన చిన్నారి అనన్య మృతదేహం లభ్యం

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆనంద్‌నగర్ లో నిన్న సాయంత్రం వరద నీటిలో <<13910342>>గల్లంతైన చిన్నారి <<>>అనన్య మృతదేహం లభ్యమయింది. రాత్రి వరకు మున్సిపల్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది గాలించినప్పటికీ చీకటి కారణంగా ఆచూకీ దొరకలేదు. అయితే డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్ సానిటరీ ఇన్‌స్పెక్టర్ మహిపాల్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది మున్సిపల్ కార్మికులతో గాలింపు చర్యలు చేపట్టగా పీఎఫ్ ఆఫీస్ వెనుక ప్రాంతంలో చిన్నారి మృతదేహం లభ్యమైంది.

News August 22, 2024

చేర్యాల: యువతిని కాపాడిన పోలీసులు!

image

డయల్-100 కాల్‌తో యువతిని మద్దూర్ పోలీసులు కాపాడారు. చేర్యాల సీఐ శ్రీను తెలిపిన వివరాలు.. ఏటూరునాగారం మండలం గోగుపల్లికి చెందిన రాజశేఖర్, వేలేరుకు చెందిన ఓ యువతి HYD కూకట్‌పల్లిలోని ఫార్మా కంపెనీలో పని చేస్తున్నారు. రాజశేఖర్ మాయమాటలు చెప్పి అమ్మాయిని మద్దూరులోని తన మిత్రుడి ఇంటికి తీసుకెళ్లాడు. దీంతో మోసపోయానని యువతి గుర్తించి 100కి కాల్ చేయగా పోలీసులు కాపాడారు. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

News August 22, 2024

పెద్దపల్లి: మాజీ హోంగార్డు దారుణ హత్య

image

మాజీ హోంగార్డు హత్యకు గురైన ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెలా మండలంలో జరిగింది. కొలనూర్ గ్రామానికి చెందిన మాజీ హోంగార్డు మాటూరి విజయ్‌ని అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. కాగా ఈ హత్యకు భూ వివాదాలు కారణం అని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పొత్కపల్లి ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News August 22, 2024

నేడు పాపన్నపేట బంద్‌కు పిలుపు

image

బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోతకు నిరసనగా గురువారం మెదక్ జిల్లా పాపన్నపేట పట్టణం బంద్ పాటించనున్నట్లు హిందూ ఐక్యవేదిక ప్రతినిధులు పేర్కొన్నారు. బంగ్లాదేశ్ హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బంద్‌‌కు పిలుపునిచ్చారు. వ్యాపార, విద్యాసంస్థలు, అందరూ సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.