Telangana

News April 17, 2025

MBNR: ‘నిరుద్యోగులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి’

image

రానున్న పోటీ పరీక్షల సన్నద్ధం చేసేందుకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి నిరుద్యోగులకు జిల్లా కేంద్రంలో బుధవారం ఉచిత శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, వీఆర్వో, టెట్, వీఆర్ఏ డీఎస్సీ, తదితర పలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ అందివ్వనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 17, 2025

ఇకపై జిల్లాలో రోజూ మైనర్ స్పెషల్ డ్రైవ్: NZB CP

image

ఇకపై జిల్లాలో రోజూ మైనర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని నిజామాబాద్ CP సాయి చైతన్య వెల్లడించారు. ఇప్పటివరకు మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే పోలీసు వారే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి జరిమానాలు వేసేవారని పేర్కొన్నారు. ఇకపై మైనర్ల డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని, జైలు శిక్షతో పాటు వాహన రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తామని హెచ్చరించారు.

News April 17, 2025

సర్వే వివరాలు పక్కాగా నమోదు చేయాలి: డీఈవో

image

మెదక్ జిల్లాలో ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించే యుడైస్ సర్వేలో పరిశీలించిన అంశాలను పక్కగా నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యార్థుల, ఉపాధ్యాయుల సంఖ్య, పాఠశాలల మౌలిక వసతుల వివరాలను పరిశీలించి, ఏమైనా తప్పులు ఉంటే యుడైస్ వెబ్ సైట్లో సరిదిద్దుకోవాలని పాఠశాల హెచ్ఎంలకు సూచించారు.

News April 17, 2025

ఖమ్మం: నేటి నుంచి భూభారతిపై అవగాహన సదస్సు

image

ఖమ్మం జిల్లాలో రైతులకు, ప్రజలకు భూ భారతి చట్టంపై ఈనెల 17 నుంచి 30 వరకు రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు 2 మండల కేంద్రాల్లో అవగాహన సమావేశాలు నిర్వహిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీజ తెలిపారు. కొత్త ఆర్ఓఆర్ చట్టం అమలుపై సమగ్రంగా అధికారులు వివరిస్తారని, ప్రజలకు ఏలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవచ్చునని ఆమె సూచించారు.

News April 17, 2025

ఈ నెల 19న నల్గొండలో ప్రత్యేక ప్రజావాణి

image

ఈ నెల 19న నల్గొండ కలెక్టరేట్‌లో వయో వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని వయోవృద్ధులు, దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News April 17, 2025

పాలమూరులో నేటి TOP NEWS!

image

✔నీళ్లతో రాజకీయం చేయడం BRSకు తగదు: మక్తల్ ఎమ్మెల్యే✔రైల్వే అధికారులతో ఎంపీ డీకే అరుణ సమీక్ష✔అకాల వర్షం.. దెబ్బతిన్న పంటలు✔GDWL:ఈడ్చుకెళ్లిన ట్రాక్టర్..మహిళ మృతి ✔భూభారతిపై అవగాహన కలిగి ఉండాలి:కలెక్టర్లు✔పలుచోట్ల వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం✔‘రజతోత్సవ సభకు తరలిరండి’:BRS✔MBNR: ఉచిత శిక్షణ ప్రారంభం ✔పలుచోట్ల డ్రగ్ అండ్ డ్రైవ్

News April 16, 2025

నల్గొండలో యువతి సూసైడ్

image

యువతి సూసైడ్ చేసుకున్న ఘటన నల్గొండలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మాన్యచెల్కకు చెందిన మాధురి (26) బిటెక్ పూర్తి చేసి ఓ ప్రవేట్ ఉద్యోగం చేస్తోంది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 16, 2025

వరంగల్‌: రైలు నుంచి జారి పడి యువకుడి మృతి

image

రైలు నుంచి జారిపడి యువకుడు మృతి చెందిన ఘటన వరంగల్‌లో జరిగింది. శివనగర్‌కు చెందిన అనిల్(29) వరంగల్ నుంచి రామగుండం కూలి పని కోసం కోర్బా రైలు ఎక్కాడు. పాత వరంగల్ రైల్వే గేట్ సమీపానికి చేరుకోగానే ప్రమాదవశాత్తు అతడు రైలు నుంచి జారిపడ్డాడు. అతడి తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలవగా ఎంజీఎంకు తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 16, 2025

సర్వేను పకడ్బందీగా చేపట్టాలి: ADB DEO

image

యూడైస్లో నమోదైన సంఖ్య మేరకు విద్యార్థులు, పాఠశాల భౌతిక, వసతులపై డైట్ ఛాత్రోపాధ్యాయులు చేస్తున్న థర్డ్ పార్టీ సర్వే పకడ్బందీగా చేపట్టాలని డీఈవో శ్రీనివాసరెడ్డి అన్నారు. బేల అశోక్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో సర్వే తీరును ప్లానింగ్ కోఆర్డినేటర్ నారాయణతో కలిసి ఆయన పరిశీలించారు. పాఠశాల రిపోర్టు కార్డులో నమోదైన వివరాల ద్వారా భౌతిక పరిశీలన చేసి ధ్రువీకరించాలని సూచించారు. ఈనెల 21వరకు సర్వే కొనసాగుతుందన్నారు.

News April 16, 2025

Caratlane ఫ్రాంచైజీతో జ్యువెల్లరీ రంగంలోకి ‘కమల్ వాచ్’

image

కమల్ వాచ్ కంపనీ జ్యువెల్లరీ రంగంలో అడుగుపెడుతూ హైదారాబాద్ గచ్చిబౌలిలో మొదటి Caratlane ఫ్రాంచైజీని టోట్ల ఫ్యామిలీతో కలిసి ప్రేమలతా భాయ్ టోట్ల ప్రారంభించారు. గచ్చిబౌలిలో గూగుల్ కార్యాలయం ఎదురుగా ఈ మొట్టమొదటి నూతన షోరూమ్‌ను కమల్ వాచ్ ఏర్పాటు చేసింది. ఐదు రాష్ట్రాలలో 56 వాచ్ స్టోర్లు, Swarovski అవుట్‌లెట్లు మరియు లగేజ్ స్టోర్లతో పాటు ఈ కొత్త ప్రారంభంతో తమ వ్యాపారంలో వైవిధ్యతను ప్రకటించారు.

error: Content is protected !!