India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నిజామాబాద్ పెద్ద బజారులోని లక్ష్మీనరసింహ కిరాణ దుకాణానికి వచ్చిన ఓ వ్యక్తి తాను ICICI బ్యాంక్ ఉద్యోగినంటూ యాజమానిని నమ్మించాడు. కరెంట్ అకౌంట్‌తో పాటు క్యూఆర్ కోడ్ అప్డేట్ చేయాలని చెప్పి, ఆధార్, పాన్ కార్డ్ వివరాలు అడిగాడు. యాప్ డౌన్లోడ్ చేస్తానని నమ్మించి ఫోన్ తీసుకొని పరారయ్యాడు. కాసేపటికి బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.లక్ష మాయమైనట్టు గుర్తించిన బాధితుడు రాజ్ కుమార్ 2వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వడదెబ్బతో ఉపాధి కూలీ చనిపోయిన ఘటన ఎర్రవల్లి మండలంలో జరిగింది. వల్లురుకు చెందిన చిన్నకృష్ణ(55) శనివారం ఉపాధి పనికి వెళ్లి వడదెబ్బకు గురై కుప్పకూలిపోయాడు. తోటి కూలీలు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్ద చూపించారు. రాత్రి భోజనం చేసి పడుకున్న అతను తెల్లారేసరికి మృతిచెందాడు. భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎండల తీవ్ర నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

హోలీ పండగను పురస్కరించుకుని సోమవారం HYDలోని సాలార్జంగ్ మ్యూజియానికి సెలవు ఉంటుందని మ్యూజియం పరిపాలన అధికారి పి.నాగేశ్వరరావు ఒక ప్రకటనతో తెలిపారు. కావున పర్యాటకులు ఎవరు కూడా మ్యూజియానికి రావద్దని పేర్కొన్నారు. మళ్లీ మంగళవారం నుంచి మ్యూజియం యథాతధంగా తెరిచి ఉంటుందన్నారు. కావున ఈ విషయాన్ని పర్యాటకులు గమనించాలని కోరారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బస్టాండ్‌ల పరిధిలోని దుకాణాలను లీజు ప్రాతిపదికన టెండర్లు పిలిచి సంస్థ అద్దెకి ఇస్తుంది. నిబంధనల ప్రకారం దుకాణాదారులు ఎమ్మార్పీ ధరలకు మించి వస్తువులు అమ్మకూడదు. కానీ ఉమ్మడి జిల్లాలోని ఏ బస్టాండ్‌లో చూసినా ఆ పరిస్థితి లేదు. బస్టాండ్‌లో అమ్మకాలు జరిపే ప్రతి వస్తువుపై రూ.5 నుంచి రూ.15 వరకు అదనంగా పెంచి వసూలు చేస్తున్నారు.

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎర్రగడ్డల గూడెంను అంతుచిక్కని జ్వరాలు వణికిస్తున్నాయి. గ్రామంలో సగం మంది హాస్పిటళ్లలో చేరుతున్నారు. ప్రతి ఇంట్లోనూ ఒకరు అనారోగ్యంతో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. 2 నెలలుగా స్థానికంగా ఫీవర్ క్యాంపు ఏర్పాటుచేసి చికిత్స అందిస్తున్నా తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామాన్ని ఇప్పటికే జిల్లా, రాష్ట్ర వైద్యం బృందం పరిశీలించారు.

✏MBNR:నేడు మన్యం కొండాలో అలివేలు మంగతాయారు ఉత్సాహాలు
✏గద్వాల్:పలు మండలాలలో కరెంట్ కట్
✏నేడు హోలీ.. పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✏యాసంగి వరి ధాన్యం.. కొనుగోలుకు కసరత్తు
✏MLC ఎన్నికలు.. ఓటర్లపై ఫోకస్
✏నేటి రంజాన్ వేళలు:
ఇఫ్తార్(MON)-6:36,సహార్(TUE):4:56
✏’ELECTION-EFFECT’.. పలుచోట్ల తనిఖీలు
✏బాలానగర్:తిరుమల నాథ స్వామి వేడుకలు షురూ
✏ఉమ్మడి జిల్లాలో అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు
✏త్రాగునీటిపై సమీక్ష

మైనార్టీ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను 5,6,7వ తరగతుల్లో ప్రవేశాలకుగాను దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని భగీరథ కాలనీలోని గురుకుల పాఠశాల-3 ప్రిన్సిపల్ కె.సురేఖ తెలిపారు. నాల్గో తరగతి చదువుతున్న దరఖాస్తు చేసుకోవాలని, 80 సీట్లలో 60 ముస్లింలకు, 20 రిజర్వేషన్ ప్రాతిపాదికన భర్తీ చేశామన్నారు. 6, 7వ తరగతుల్లో సీట్ల భర్తీకి దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం ఉందన్నారు.

కళాకారులు భరతనాట్య ప్రదర్శనతో సందర్శకులను ఆకట్టుకున్నారు. HYD మాదాపూర్‌లోని శిల్పారామంలో నిర్వహిస్తున్న వారాంతపు కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఐశ్వర్యవల్లి శిష్య బృందంచే భరతనాట్య ప్రదర్శనతో అలరించారు. పుష్పాంజలి, గరుడగమన, పంచమూర్తి కౌతం, జతిస్వరం, గణేశపంచరత్న, చండ్రచూడ శివశంకర, మురళీధర కీర్తనం, దశావతారం, అదివో అల్లదివో తదితర ప్రదర్శనలతో అలరించారు.

Sorry, no posts matched your criteria.