India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేశం స్టార్ కాదని.. ఆత్మగౌరవ స్టార్ అని హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి వోడితల ప్రణవ్ తెలిపారు. ఆత్మగౌరవ స్టార్ కాబట్టే.. స్వరాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. మంత్రిని భర్తరఫ్ చేయించే అర్హత, విమర్శించే స్థాయి కౌశిక్‌కు ఉందా అని ప్రశ్నించారు. మంత్రిని పట్టుకొని పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తారా..? అలా మాట్లాడడం ఎమ్మెల్యే అహంకారానికి నిదర్శనమన్నారు.

వరంగల్ నగరంలోని కరీమాబాద్ SRR తోట ప్రాంతంలో ఉన్న వాణి విద్యానికేతన్ స్కూల్‌పై వివిధ విద్యార్థి సంఘాలు వినతి పత్రం సమర్పించడంతో డీఈవో వాసంతి స్పందించారు. శనివారం ఆర్జేడీకి ప్రొసీడింగ్ లేఖ పంపించారు. ఒక పర్మిషన్ మీద రెండు బ్రాంచీలు నడిపిస్తున్న వాణి విద్యానికేతన్ పాఠశాల అనుమతి రద్దు చేయాలని ఆర్జేడీకి పంపించారు. ఈ మేరకు AIFDS వామపక్ష విద్యార్థి సంఘాలు డీఈఓకు కృతజ్ఞతలు తెలిపాయి.

డోర్నకల్ నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల వరకు నూతనంగా రైల్వేలైన్ మంజూరు కాగా.. నిర్మాణానికి సర్వే పూర్తికావడంతో మార్కింగ్ ఇస్తున్నారు. ఈ రైల్వేలైన్ పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల మీదుగా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో మార్కింగ్ చేస్తుండగా తాము భూములు కోల్పోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాజ్యాంగ విలువలను కాపాడటానికి ఏర్పడిన పౌర సమాజ వేదిక జనగణమన అభియాన్ ఆధ్వర్యంలో వ్యాస రచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రస్తుత దేశంలో ‘రాజ్యాంగ విలువల పరిస్థితి ప్రజల కర్తవ్యం’ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో MLG కేఎన్ఎం డిగ్రీ కళాశాల విద్యార్థిని ఎండీ. యాస్మిన్ మొదటి బహుమతి సాధించింది. ప్రొఫెసర్ హరగోపాల్ ప్రైజ్ అందజేశారు.

నారాయణపేట జిల్లా కేంద్రంలోని మహేశ్వరీ థియేటర్‌లో BJP ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఆధ్వర్యంలో రజాకార్ సినిమాను ఆదివారం ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు పార్టీ మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు తెలిపారు. తెలంగాణ చరిత్ర, రజాకార్ల అణచివేత, ప్రజలు పడిన కష్టాలు, విముక్తి పొందిన చరిత్రను దర్శకుడు అద్భుతంగా చూపించారన్నారు.

నగరంలో ఖరీదైన ఇళ్ల విక్రయాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆరంభంలో వీటి రిజిస్ట్రేషన్లు మరింత పెరిగాయి. రూ.కోటి అంతకంటే ఎక్కువ విలువైన గృహాల వాటా 2023లో 8 శాతం ఉంటే.. ఈ ఏడాది ఆరంభంలో ఏకంగా 14 శాతానికి పెరిగింది. స్థిరాస్తి ధరలు పెరగడమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ హవా కొనసాగింది. లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎక్కువ సార్లు ఇక్కడ హస్తం అభ్యర్థులే గెలుపొందారు. 1957లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో పాగా వేసిన కాంగ్రెస్.. 11 సార్లు గెలిచింది. అలాగే బీజేపీ ఐదు సార్లు గెలిచింది. కాంగ్రెస్ జోరుకు 1991లో బీజేపీ అడ్డుకట్ట వేసింది. కాగా గత ఎన్నికల్లో కిషన్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే.

బీఆర్ఎస్ టికెట్ మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన దానం నాగేందర్ ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరారని, ఆయన ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితాలో నాగేందర్ పేరు ఉందని, వెంటనే ఆయన్ను సస్పెండ్ చేయాలని పేర్కొన్నారు. ఈ విషయమై ఇటీవల అసెంబ్లీ స్పీకర్‌ను కూడా కలిశామని కౌశిక్ రెడ్డి చెప్పారు.
Sorry, no posts matched your criteria.