Telangana

News March 22, 2024

సంగారెడ్డి: గురుకుల పాఠశాలలో ప్రవేశానికి ఆహ్వానం

image

సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఈనెల 23వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని మెదక్ రీజియన్ కోఆర్డినేటర్ భీమయ్య గురువారం తెలిపారు. దరఖాస్తులను https://WWW. TSWREIS.ac.in లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 22, 2024

సూర్యాపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి 

image

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడులో హెచ్.పీ బంకు పక్కన గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతి చెందిన యువకుడు మండలంలోని వెంకట్రాంపురానికి చెందిన చింతోజు ఉపేంద్ర చారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News March 22, 2024

దుబ్బాకలో ఒగ్గుపూజారుల గొడవ.. కేసు నమోదు

image

దుబ్బాక పట్టణంలో రేకులకుంట మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి ఒగ్గు పూజారులు ఇరు వర్గాలుగా వీడిపోయి దాడి చేసుకున్నారు. ఈ గొడవపై కేసు నమోదు చేసినట్లు దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపారు. రేకులకుంట, మల్లయ్యపల్లి గ్రామాలకు చెందిన పదకొండు మందిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటనలో బాధ్యులు, మరికొంత మందిపై చర్యలు తీసుకోనున్నట్లు వివరణ ఇచ్చారు.

News March 22, 2024

‘గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం’

image

మహబూబ్ నగర్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో మిగులు సీట్ల భర్తీకి ఈనెల 23 తుది గడువు అని జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారిణి ఫ్లారెన్స్ రాణి తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి 6,7,8,9 తరగతుల్లో మిగులు సీట్లు ఉన్నాయని, ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని, వెంటనే నిర్దేశిత వెబ్ సైట్ www.tswreis.ac.in లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

News March 22, 2024

సంగారెడ్డి: వేసవి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి: కలెక్టర్

image

రానున్న ఏప్రిల్, మే నెలలో తాగునీటి సమస్య లేకుండా వేసవి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తాగునీటి సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని వివరించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

News March 22, 2024

MBNR: ఓ వైపు ఎన్నికల కోలాహలం.. మరోవైపు ఫిరాయింపులు

image

ఇటు పార్లమెంట్.. అటు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఒకవైపు ప్రచార ఆర్భాటాలు జరుగుతూ ఉంటే.. మరోవైపు చేరికల తతంగం కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. ఇక మరికొంతమంది మారేందుకు సిద్ధపడినట్లు సమాచారం.

News March 22, 2024

ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిపై ఉత్కంఠ!

image

కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రకటించిన రెండో జాబితాలో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి పేరు లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న ఆశావహులు, ఎవరికి వారు టికెట్ తమకే అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. కాగా, కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News March 22, 2024

పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ నేపథ్యం..

image

మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి(కాక) మనవడు వంశీకృష్ణ. వంశీకి భార్య రోష్ని, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈయన 2010లో అమెరికాలో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ పట్టా పొందారు. కాకా కుటుంబంలోని 3వ తరానికి చెందిన వంశీకృష్ణ విశాఖ ట్రస్టు ద్వారా పలు సేవలు చేస్తున్నారు. తండ్రి వివేక్ చెన్నూరు ఎమ్మెల్యేగా, పెదనాన్న వినోద్‌ బెల్లంపల్లి ఎఎమ్మెల్యేగా ఉండగా కొడుకు వంశీ పెద్దపల్లి ఎంపీ బరిలో నిలిచారు.

News March 22, 2024

BRS మాజీ నేతలకే కాంగ్రెస్ MP టికెట్.. గెలుపెవరిది..?

image

HYD, RRలో రాజకీయం రసవత్తరంగా మారింది. మల్కాజిగిరి నుంచి వికారాబాద్ జడ్పీ ఛైర్‌ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, చేవెళ్ల నుంచి ఎంపీ రంజిత్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు బీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి ఇటీవల అధికార పార్టీలోకి చేరగా వీరికే అధిష్ఠానం MP టికెట్లు ఇచ్చింది. వీరిలో గెలిచేది ఎవరు.. మీ కామెంట్..?

News March 22, 2024

BRS మాజీ నేతలకే కాంగ్రెస్ MP టికెట్.. గెలుపెవరిది..?

image

HYD, RRలో రాజకీయం రసవత్తరంగా మారింది. మల్కాజిగిరి నుంచి వికారాబాద్ జడ్పీ ఛైర్‌ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, చేవెళ్ల నుంచి ఎంపీ రంజిత్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు బీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి ఇటీవల అధికార పార్టీలోకి చేరగా వీరికే అధిష్ఠానం MP టికెట్లు ఇచ్చింది. వీరిలో గెలిచేది ఎవరు.. మీ కామెంట్..?