Telangana

News March 21, 2024

నార్కట్‌పల్లి: తనిఖీలు ముమ్మరం.. రూ.10 లక్షలు సీజ్

image

పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. గురువారం నార్కట్‌పల్లిలో చేపట్టిన తనిఖీలో ఓ వ్యక్తి కారులో ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్న పది లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ అంతిరెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎవరూ రూ.50 వేలకు మించి తీసుకెళ్లొద్దని, ఒకవేళ తీసుకెళ్తే ఆ డబ్బుకు సంబంధించి ఆధారాలు వెంట తీసుకెళ్లాలని సూచించారు.

News March 21, 2024

‘జహీరాబాద్ ఎంపీ సీటు గెలిచి మోడీకి బహుమతిగా ఇద్దాం’

image

చౌటకూర్ మండల కేంద్రంలో గురువారం ఎంపీ, బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జహీరాబాద్ పార్లమెంట్ సీటును నరేంద్ర మోడీకి బహుమతిగా ఇవ్వాలన్నారు. ఇందుకు బూత్ స్థాయి కార్యకర్తలే అత్యంత కీలకమన్నారు. పదేళ్లుగా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు.

News March 21, 2024

ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇస్తాం: మంత్రి జూపల్లి

image

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా కల్పించారు. నష్టపోయిన రైతులు ఆందోళన చెందొద్దని, ధైర్యంగా ఉండాలన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలపై అధికారులు సర్వే చేస్తున్నారని, పంట నష్టపోతే ఎకరానికి 10 వేల పరిహారం అందిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని, తమ పాలనలో రైతులకు ఇబ్బందులు ఉండవని అన్నారు.

News March 21, 2024

ADB: 40 ఏళ్ల నుంచి ఆ ఊరిలో నీరు ఇంకలేదు..!

image

ఆదిలాబాద్ ‌లోని తిప్ప పంచాయతీ పరిధిలోని బోరింగ్ గూడకు గ్రామ పేరుకు ఓ ప్రత్యేకత ఉంది. గ్రామంలో 40 ఏళ్ల క్రితం బోరు వేసి చేతి పంపు ఏర్పాటు చేశారు. అయితే ఆ బోరు వేసినప్పటి నుంచి అక్కడ నీరు ఉబికి వస్తోంది. అన్ని కాలాల్లో 24 గంటలు నీరు ఉంటుందని, భూమిలో నీటి ఊట ఎక్కువగా ఉన్నచోట ఇలా జరుగుతుందని ఆర్‌డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈఈ శ్రీనివాస్ తెలిపారు. ఈ బోరింగ్ వల్లనే ఆ ఊరికి బోరింగ్ గూడ అని పేరు వచ్చిందన్నారు.

News March 21, 2024

MBNR: కాంగ్రెస్ పార్టీలోకి వలసలు !

image

ఉమ్మడి జిల్లాలో పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. BJP నుంచి జితేందర్ రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ ఛైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, గద్వాల జిల్లా పురపాలక ఛైర్మన్ కేశవ్, 15 మంది వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉమ్మడి జిల్లాలో ద్వితీయ శ్రేణి నాయకులు సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎన్నికల నాటికి ఓటరు నాడి ఎలా ఉండనుందో చూడాలి.

News March 21, 2024

నేను సీఎం అవ్వాలనుకోవడం లేదు: పొంగులేటి

image

తాను సీఎం అవ్వాలనుకోవడం లేదని, ఆ ఆలోచనే లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తానే సీఎం అనడం ఊహాజనితమైన అన్నారు. తాను ఎవరికీ టచ్‌లో లేనని, రాజకీయంగా ఎదుర్కోలేక తనపై తప్పుడు ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోనన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ సీట్లను గెలుచుకుంటుందని పేర్కొన్నారు.

News March 21, 2024

పాపన్నపేట: ఆయకట్టు ఎత్తు పెంపు ఉత్తిదేనా..!

image

ఘణపురం ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. పాలకుల నిరాదరణతో పూర్వ వైభవం కోల్పోయింది. నిజాం కాలంలో కళకళలాడిన ప్రాజెక్టు నేడు పూడికతో నిండిపోయింది. ప్రాజెక్టు నిండినా వారం రోజులు కూడా నీరు ఉండని పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ప్రభుత్వం 2016లో రూ. 43.64 కోట్లు మంజూరు చేసింది. పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ పూర్తి కాలేదు. నాలుగేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

News March 21, 2024

నార్కట్‌పల్లి: హైవేపై లారీ ఢీకొని ఒకరి దుర్మరణం

image

నార్కట్‌పల్లిలో హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న లారీ నార్కట్‌పల్లి శివారులోని నల్లగొండ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఓ వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. మృతుడి వయసు 55-60 ఏళ్లు ఉంటాయని.. అతను యాచకుడిలా పోలీసులు భావిస్తున్నారు.

News March 21, 2024

HYD: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం: మంత్రి

image

HYDలో ఉన్న జర్నలిస్టులకు తప్పకుండా ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. నగరంలో డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం చాలా నిబద్ధతగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు బొల్లోజు రవితోపాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

News March 21, 2024

HYD: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం: మంత్రి 

image

HYDలో ఉన్న జర్నలిస్టులకు తప్పకుండా ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. నగరంలో డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం చాలా నిబద్ధతగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు బొల్లోజు రవితోపాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.