India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ఓయూ జేఏసీ నేత, కడెం మండలానికి చెందిన సిద్ధార్థ నాయక్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు గురువారం కడెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనుకబడి ఉందని వాపోయారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం తాను ఎన్నికల బరిలో దిగుతున్నానని ఆయన తెలిపారు. ఓయూ జేఏసీ తరఫున పోటీ చేయనున్నానని ఆయన వెల్లడించారు.

నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. గురువారం పాలకవర్గం పెట్టిన అవిశ్వాస తీర్మాన సమావేశంలో భాస్కర్ రెడ్డికీ వ్యతిరేకంగా మెజార్టీ సభ్యులు ఓటింగ్లో పాల్గొనడంతో ఆయన పదవి కోల్పోయారు. 21 మంది పాలకవర్గ సభ్యులకుగాను 17 మంది హాజరయ్యారు. అందులో 16 మంది భాస్కర్ రెడ్డి పై వ్యతిరేకంగా చేతులెత్తి అవిశ్వాసానికి మద్దతు తెలిపారు.

సుజాతనగర్ మండలంలో పదో తరగతి బాలికపై అదే తరగతికి చెందిన <<12894244>>బాలుడు అత్యాచారానికి <<>>పాల్పడిన ఘటన తెలిసిందే. బాలిక తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టగా.. సదరు బాలుడికి రూ.2 లక్షలు జరిమానా విధించారు. తాజాగా ఈ విషయం బయటకు రావడంతో రంగంలో దిగిన ఐసీడీఎస్ అధికారులు బాలికను విచారించి బాలుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు.

అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాంతంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నివేదికల ప్రకారం 2018 సంవత్సరంలో 12, 2021 సంవత్సరంలో 21 పులులు ఉండగా, ప్రస్తుతం 2024 సంవత్సరంలో 32 పెద్ద పులులు ఉన్నట్లు గుర్తించారు. ఇవి కాక చిరుత పులులు 176, ఎలుగుబంట్లు 250, ఇతర అటవీ జంతువులు 10వేల వరకు ఉన్నాయి. క్రమంగా వన్యప్రాణుల సంఖ్య పెరగటంతో పరోక్షంగా అడవి సంరక్షణకు ఉపయోగపడుతోంది.

రానున్న ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా తీసుకునే ముందస్తు చర్యల్లో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశామని పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి కరీంనగర్‌లోని అన్ని హోటళ్లు, లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. అక్రమ డబ్బు, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేసే వారిని కట్టడి చేస్తామన్నారు.

అత్యాచారం కేసులో నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ రాజేంద్రనగర్ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. గచ్చిబౌలి PS పరిధిలో ఉండే బాలిక మీద కన్నేసిన శివకృష్ణ (22).. 2014, అక్టోబర్‌లో కిడ్నాప్ చేశాడు. ఓ గదిలో బంధించి పలుమార్లు అత్యాచారం చేశాడు. పేరెంట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. బుధవారం విచారణకు రాగా 10 ఏళ్ల జైలు శిక్ష, బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది.

అత్యాచారం కేసులో నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ రాజేంద్రనగర్ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. గచ్చిబౌలి PS పరిధిలో ఉండే బాలిక మీద కన్నేసిన శివకృష్ణ (22).. 2014, అక్టోబర్‌లో కిడ్నాప్ చేశాడు. ఓ గదిలో బంధించి పలుమార్లు అత్యాచారం చేశాడు. పేరెంట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. బుధవారం విచారణకు రాగా 10 ఏళ్ల జైలు శిక్ష, బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది.

రైల్వే లైన్ కోసం అధికారులు ఏర్పాటు చేస్తున్న మార్కింగ్‌తో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గతంలో డోర్నకల్-మిర్యాలగూడెం వరకు రైల్వే లైన్ కోసం అధికారులు ఖమ్మం రూరల్ మండలంలో సర్వేని చేపట్టారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళనలు వ్యక్తం కావడంతో నిలిపివేశారు. మూడు రోజులుగా ఎస్సీపీ నలుపు, తెలుపు రంగులతో మార్కింగ్‌ను ఎంవి పాలెం, కాచిరాజుగుడెం, ఆరేకొడు, చింతపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేశారు.

అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. బిక్కనూర్ మండలం అంతంపల్లి, జంగంపల్లి గ్రామాలలో ఆయన పర్యటించి నష్టపోయిన పంటలను పరిశీలించారు. రైతులు ఎలాంటి ఆందోళన పడవద్దని చెప్పారు. త్వరలోనే నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఉన్నారు.

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం మిర్చి ధరలు ఎలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకి రూ.19,300 ధర పలకగా.. 341 రకం మిర్చి రూ.16,500, వండర్ హాట్(WH) రకం మిర్చికి రూ.15,500 వచ్చింది. అలాగే 5,531 మిర్చికి రూ.12,500 ధర, టమాటా రకం మిర్చికి రూ.34,000 ధర వచ్చింది. కాగా, టమాటా రకం మిర్చి మినహా అన్ని రకాల ధరలు తగ్గాయి.
Sorry, no posts matched your criteria.