India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పెండింగులో ఉన్న ప్రభుత్వ పాఠశాలల కుట్టు కూలీ బకాయి నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున కుట్టిన దర్జీల ఛార్జీల చెల్లింపు కోసం ఆరు నెలలుగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారుల ఖాతాల్లో నిధులను జమ చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 2,11,932 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.2.11 కోట్లను విడుదల చేసింది.

ఇబ్రహీంపట్నం మం. దండుమైలారంలో కూతురిని చంపిన తల్లికి పోలీసులు రిమాండ్ విధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బావను పెండ్లి చేసుకోవాలని పేరెంట్స్ భార్గవి(19) మీద ఒత్తిడి తెచ్చారు. ఇది ఆమెకు నచ్చలేదు. మంగళవారం శశి(ప్రియుడు)ని ఇంటికి పిలిచి మాట్లాడుతుండగా తల్లి జంగమ్మ చూసింది. కోపంతో కూతురిని కొట్టి, చీరతో ఉరేసి చంపేసింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జంగమ్మను అరెస్ట్ చేశారు.

ఇబ్రహీంపట్నం మం. దండుమైలారంలో కూతురిని చంపిన తల్లికి పోలీసులు రిమాండ్ విధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బావను పెండ్లి చేసుకోవాలని పేరెంట్స్ భార్గవి(19) మీద ఒత్తిడి తెచ్చారు. ఇది ఆమెకు నచ్చలేదు. మంగళవారం శశి(ప్రియుడు)ని ఇంటికి పిలిచి మాట్లాడుతుండగా తల్లి జంగమ్మ చూసింది. కోపంతో కూతురిని కొట్టి, చీరతో ఉరేసి చంపేసింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జంగమ్మను అరెస్ట్ చేశారు.

భద్రాచలం బ్రిడ్జి పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఈ ఉదయం జరిగింది. పాల్వంచ వనమా కాలనీకి చెందిన తంగెళ్ల శేషం రాజ్ బ్రిడ్జి పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

రైలు కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామలో బుధవారం జరిగింది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రమణారెడ్డి వివరాల ప్రకారం.. జనగామ రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ ఫారం సమీపంలో 50 ఏళ్ల వయసు ఉండే ఓ వ్యక్తి రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవన్నారు. తెలుపు రంగు చొక్కా, నలుపు రంగు పాయింట్ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు.

మహారాష్ట్ర గడ్చిరోలి ఎన్ కౌంటర్‌తో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల పోలీసులు అలర్ట్ అయ్యారు. గడ్చిరోలి ఎన్ కౌంటర్‌తో మావోలు ప్రాణహిత దాటి మహారాష్ట్ర నుంచి తెలంగాణాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో ప్రాణహిత తీరం వెంట హై అలర్ట్ ప్రకటించారు.
మహారాష్ట్రలోని అటవీప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు హతమవ్వగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై నిఘా పెంచారు.

ఆదిలాబాద్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిని నేడు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా ఆత్రం సక్కును ప్రకటించగా.. BJP అభ్యర్థిగా గోడం నగేశ్ బరిలో ఉన్నారు. ఇక్కడ బలమైన నాయకుడిని బరిలో నిలపాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. దీంతో తమ పార్టీ అభ్యర్థి ఎవరని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారో కామెంట్ చేయండి.

✔అడ్డాకల్: నేటి నుంచి రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ✔GDWL: నేడు పలు మండలాలలో కరెంట్ కట్ ✔విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అధికారుల ఫోకస్ ✔రంజాన్ వేళలు:-
ఇఫ్తార్(గురు):6:35, సహార్(శుక్ర):4:59 ✔రసవత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ✔MLC పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ✔మక్తల్: నేడు ఎద్దుల బండి గిరక పోటీలు ✔’ELLICTION EFFECT’ కొనసాగుతున్న తనిఖీలు ✔DSC ఉచిత శిక్షణకు దరఖాస్తులు చేసుకోండి

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో జరిగే బీ-ఫార్మసీ (సీబీఎస్సీ) 3, 5వ సెమిస్టర్ (రెగ్యులర్, సప్లిమెంటరీ), 4, 6వ సెమిస్టర్ (సప్లిమెంటరీ) పరీక్ష ఫీజు గడువు ఈనెల 30 వరకు ఉందని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ తెలిపారు. రూ.300 అపరాధ రుసుంతో ఏప్రిల్ 3 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.

రెండు రోజుల్లో నిజామాబాద్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిపై స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ఈ స్థానానికి ప్రముఖ నాయకులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్, BJP నుంచి ధర్మపురి అర్వింద్‌ను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం పెండింగ్‌లో ఉంచింది. ఆపార్టీ అభ్యర్థి ఎవరని శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
Sorry, no posts matched your criteria.