India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మద్యం మత్తు వాహన చోదకుల జీవితాలను చిత్తు చేస్తోంది. సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ డివిజన్ వ్యాప్తంగా గత ఏడాది 9,645 మంది మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ.. పోలీసులకు పట్టుబడ్డారు. వారిపై కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా పలువురికి జైలు శిక్షలతో పాటు రూ.93.73 లక్షల జరిమానా విధించారు. 34 మంది జైలు శిక్ష విధించారు.

రెండు రోజుల్లో కరీంనగర్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిపై స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ స్థానానికి తీవ్ర పోటీ నెలకొనడంతో అభ్యర్థి ఎంపిక ఆలస్యమవుతోంది. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్‌ను ప్రకటించగా.. BJP అభ్యర్థిగా ఎంపీ బండి సంజయ్ మరోసారి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఎంజీఎం ఆసుపత్రి అత్యవసర విభాగంలోని ఎక్స్-రే మూడు రోజుల నుంచి పని చేయడం లేదు. దీంతో టెక్నీషియన్లు తాళం వేశారు. అప్పటి నుంచి అత్యవసర రోగులను ఓపీ విభాగంలోని రేడియాలజీకి తీసుకెళ్లి పరీక్షలు చేస్తున్నారు. ఓపీ రేడియాలజీ విభాగం దూరంగా ఉండటం వల్ల రాత్రి వేళ ప్రమాదంలో గాయపడిన వారికి సత్వర చికిత్స అందడం లేదు. ఈ విషయంపై అధికారులు స్పందించి ఎక్స్-రే యంత్రాన్ని మరమ్మతులు చేయించాలని రోగులు కోరుతున్నారు.

పార్లమెంట్ ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో రూ.1,69,904 విలువైన మద్యం స్వాధీనం చేసుకుని, 21 బెల్ట్ షాపులను సీజ్ చేశామని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ బుధవారం తెలిపారు. జిల్లాలోని పలుచోట్ల చేపట్టిన తనిఖీల్లో అనుమతి లేకుండా విక్రయిస్తున్న మద్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలను పాటించకుండా మద్యం విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

ఒంటరిగా ఇంట్లో ఉన్న మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడిన దేవర్ల మహేశ్‌కు ఆత్మకూరు సివిల్ కోర్టు న్యాయమూర్తి 4 నెలల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు ఇచ్చారని ఎస్ఐ సురేశ్ తెలిపారు. 2018లో అత్యాచారయత్నానికి పాల్పడినట్లు ఫిర్యాదు రాగా ఏఎస్ఐ జమీరుద్దీన్ కేసు నమోదు చేశారన్నారు. పూర్తి స్థాయిలో ఆధారాలు కోర్టులో సమర్పించడంతో బాధితురాలికి న్యాయం జరిగిందన్నారు.

రుణాల పేరుతో రూ.2.82 కోట్లు దోచుకున్న తాళ్లసింగారానికి చెందిన ఎస్బీఐ మేనేజర్ హరిప్రసాద్‌పై కేసు నమోదు చేసినట్లు నూతనకల్ ఎస్సై సైదులు తెలిపారు. ప్రస్తుత మేనేజర్ రవీందర్ ఫిర్యాదు మేరకు.. నకిలీ రైతులు, వ్యాపారస్థులు, మహిళా సంఘాల పేరుతో రుణాలు మంజూరు చేసి తన ఖాతాలోకి నిధులు మళ్లించుకొని రూ.కోట్ల బ్యాంకు సొమ్ము కాజేసినట్లు రుజువు కావడంతో హరిప్రసాద్‌తో పాటు అతనికి సహకరించిన 14 మందిపై కేసు నమోదు చేశారు.

పదో తరగతి విద్యార్థినిపై అదే తరగతికి చెందిన బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన సుజాతనగర్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసు వివరాలు ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక, బాలుడు ఒకే పాఠశాలలో చదువుతున్నారు. బాలికపై ఆ విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నిజాంసాగర్ మండలం బ్రాహ్మణ పల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద పోలీసులు రూ.లక్ష 20 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద బుధవారం వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలో HYD నుంచి జాల్నాకు వెళ్తున్న ఓ కారులో ఎలాంటి ఆధార పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకున్నట్లు SI సుధాకర్ పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో 23 గ్రీన్ ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు రోడ్డెక్కాయి.
బస్సులు తిరిగే రూట్‌లు, బస్సుల సంఖ్య:
*సికింద్రాబాద్-మణికొండ రూట్: 12
*పటాన్‌చెరు-CBS రూట్: 6
*పటాన్‌చెరు-కోఠి రూట్: 5
ప్రతి 10, 15 నిమిషాలకు అందుబాటులో ఉంటాయి. ఈ బస్సులన్నింటిలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
SHARE IT

హుస్నాబాద్‌కి చెందిన రుద్రయ్య(20) కరీంనగర్ జిల్లాలో పనికి వెళ్లాడు. ఈక్రమంలో ఓ యువతిని గత నెల 2న పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు రుద్రయ్య ఇంటికి వెళ్లి మేజర్ అయ్యే వరకు దూరంగా ఉండాలంటూ యువతిని తీసుకువెళ్లారు. అనంతరం ఫొటోలను డిలీట్ చేయాలంటూ బెదిరించడంతో మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.