Telangana

News September 4, 2025

ADB: 7న అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం

image

ప్రముఖ తత్వకవి ఉదారి నాగదాసు స్మారక కవితా అవార్డును 2025 సంవత్సరానికి ప్రముఖ కవయిత్రి కరీంనగర్ వాసి తోట నిర్మలారాణికి అవార్డును కమిటీ ప్రకటించిందని నిర్వాహకులు డా.ఉదారి నారాయణ తెలియజేశారు. ఈ అవార్డును సెప్టెంబర్ 7న జిల్లా పరిషత మీటింగ్ హాల్‌లో మద్యాహ్నం మూడు గంటలకు అవార్డు ప్రదానం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవార్డు కింద రూ.5 వేల నగదు, ప్రశంసాపత్రం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

News September 4, 2025

HYD: ఈనెల 7న ఫ్రీడమ్‌ ఫర్‌ యానిమల్స్

image

మనం ఆరోగ్యంగా ఉండడానికి పాలు, గుడ్లు, మాంసం అవసరం లేదని గాంధీ దర్శన్‌ ఎగ్జిబిషన్‌ సొసైటీ డైరెక్టర్ ప్రొఫెసర్‌ గొల్లనపల్లి ప్రసాద్‌ తెలిపారు. శరీర పోషణ కోసం జంతువులు, వాటి ఉత్పత్తులు వాడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అందుకే జంతువులపై అవగాహన కల్పించేందుకు ఈనెల 7న ఫ్రీడమ్‌ ఫర్‌ యానిమల్స్‌ పేరుతో శిల్పారామం నుంచి బొటానికల్‌ గార్డెన్‌ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.

News September 4, 2025

పాతబస్తీ మెట్రో పనుల కోసం వేగంగా చర్యలు: MD

image

పాతబస్తీ మెట్రో కోసం చర్యలను వేగవంతం చేస్తున్నట్లు MD NVS రెడ్డి తెలిపారు. ఓవర్ హెడ్ విద్యుత్ తీగలను తొలగించి భూగర్భ కేబుల్స్ వేస్తామన్నారు. ఇప్పటికే కొంత మేరకు ఆస్తులకు నష్టపరిహారం చెల్లించడం పూర్తయిందని చెప్పారు. కరెంట్ స్తంభాలకి మధ్య 25 మీటర్ల దూరం ఉండేలా స్థలాలను గుర్తించినట్లు పేర్కొన్నారు.

News September 4, 2025

HYD: ‘HMWSSB పేరిట FAKE మెసేజెస్ నమ్మకండి’

image

సైబర్ నేరగాళ్లు HMWSSB పేరుతో హైదరాబాద్‌లో వినియోగదారులకు వాట్సప్ మెసేజెస్ పంపిస్తున్నారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి వస్తున్న మెసేజెస్ అన్నీ ఫేక్ అని జలమండలి తెలిపింది. వేరే నంబర్లను కాంటాక్ట్ చేయమని, లింక్ ఓపెన్ చేయమని, పార్సల్ చేయమని, డబ్బు పే చేయమని అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని హెచ్చరించింది. జలమండలి ఎప్పుడూ వాట్సప్ ద్వారా ఏమీ పంపదని స్పష్టం చేసింది.

News September 4, 2025

ఉపాధ్యాయుల పాత్ర కీలకం : ADB కలెక్టర్

image

ఒక వ్యక్తి ఉన్నతస్థానానికి ఎదగడంలో, భవిష్యత్తుకు పునాదులు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఉన్నతస్థాయికి చేరాలంటే గురువు అవసరం తప్పనిసరని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు చేస్తున్న కృషికి తగిన గౌరవాన్ని ప్రభుత్వం ఇస్తోందని, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చిందన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఏఐ ద్వారా బోధించేలా టీచర్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు.

News September 4, 2025

వ్యవసాయ వర్సిటీకి 24వ ర్యాంక్

image

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎన్‌ఐఆర్‌ఎఫ్- 2025 ర్యాంకింగ్స్‌లో దేశంలోనే 24వ స్థానంలో నిలిచింది. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ నివేదికలో వ్యవసాయ, అనుబంధ విశ్వవిద్యాలయాల పనితీరును పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి అల్దాస్ జానయ్య సంతోషం వ్యక్తం చేశారు. ఈ ర్యాంక్ సాధించడం తమ కృషికి నిదర్శనమని తెలిపారు.

News September 4, 2025

OU బీఫార్మసీ పరీక్షా ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని బీఫార్మసీ(పీసీఐ) ఎనిమిదో సెమిస్టర్ మేకప్ పరీక్షా ఫీజు స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 15లోగా ఫీజులను సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని ఓయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.

News September 4, 2025

బీఏ వన్ టైం చాన్స్ పరీక్షా తేదీల ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఏ వన్ టైం చాన్స్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీఏ(ఇయర్ వైస్ స్కీమ్) వన్ టైం చాన్స్ పరీక్షలను వచ్చే నెల 7 నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.

News September 4, 2025

నిబద్ధతతో పనిచేస్తేనే మనుగడ: ఖమ్మం అ.కలెక్టర్

image

నిబద్ధతతో పనిచేస్తేనే వ్యవస్థ మనుగడ సాధ్యమవుతుందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇటీవల నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన గ్రామ పాలన అధికారులతో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ గురువారం సమావేశం నిర్వహించి, ఆప్షన్ ఫారంలను స్వీకరించారు. ఇటీవల నిర్వహించిన పరీక్షలో 253 మంది ఉత్తీర్ణత సాధించారని, వీరిలో 240 మంది లోకల్, 13 మంది నాన్ లోకల్ ఉన్నారని పేర్కొన్నారు.

News September 4, 2025

గణేష్ నిమజ్జనం.. ఓయూ పరిధిలో పరీక్షలు వాయిదా

image

గణేష్ నిమజ్జనం నేపథ్యంలో జంటనగరాల్లోని అన్ని విద్యాసంస్థలకు శనివారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ రోజు ఓయూ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. పీజీ కోర్సుల మూడో సెమిస్టర్ బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలతో పాటు, బీఈడీ రెండు, మూడో సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.